Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణ సత్రాలు కూడా బ్రాహ్మణ జాతికి అందజేస్తూ ప్రభుత్వం తక్షణమే జీవో ఇవ్వాలి!

శనివారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు చెందిన సత్రాలను ఆర్యవైశ్య కార్పొరేషన్ కు, స్థానిక వైశ్య సంఘాల నేతృత్వంలో నిర్వహించుకునే విధంగా ఇవ్వటం జరిగిందని, అలానే బ్రాహ్మణ జాతికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్న 25 సత్రాలు ఉన్నాయని, దేవాదాయ శాఖ కబ్జాలో ఉన్న ఈ బ్రాహ్మణ సత్రాలను కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ కు, స్థానిక బ్రాహ్మణ సంఘాలకు ,స్థానిక బ్రాహ్మణ దేవాలయాలు నిర్వహించుకునే విధంగా తక్షణమే ఒక జీవో జగన్ ప్రభుత్వం ఇవ్వాలని శ్రీధర్ డిమాండ్ చేసారు.
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే గుంటూరు నగరంలో ఉన్న యడవల్లి వారి సత్రం, నెల్లూరు లో ఉన్న ఐలూరు వెంకయ్య సత్రాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ కు అందజేస్తూ చంద్రబాబు ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆనాడే జీవో అందజేశారని, అలాగే జగన్ ప్రభుత్వం కూడా బ్రాహ్మణ జాతికి చెందిన మిగిలిన 25 సత్రాలను కూడా బ్రాహ్మణులే నిర్వహించుకునే విధంగా తక్షణమే జీవో ఇవ్వాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆర్యవైశ్య నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు వైశ్య సంఘం నేతలు కలసి తమ జాతి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ జీవో సాధించుకున్నారని, అలానే జగన్ ప్రభుత్వంలో ఉన్న బ్రాహ్మణ జాతి ప్రజాప్రతినిధి లైన కోనా రఘుపతి,


మల్లాది విష్ణు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ మరియు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న బ్రాహ్మణ పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి గతంలో దేవాదాయ శాఖ బలవంతంగా లాక్కున్న బ్రాహ్మణ దాతలకు చెందిన, ఎంతో సదుద్దేశంతో బ్రాహ్మణ జాతి ప్రయోజనాల కోసం ఇచ్చిన 25 బ్రాహ్మణ సత్రాలను కూడా బ్రాహ్మణ సంక్షేమం కోసం బ్రాహ్మణ జాతికి చెందేలాగా చేసి బ్రాహ్మణ మనోభావాలు కాపాడలని, తక్షణమే జీవో తీసుకురావాలని బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను శ్రీధర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బ్రాహ్మణ జాతి మనోభావాలు దెబ్బతింటాయని జగన్ ప్రభుత్వం బ్రాహ్మణ జాతి సత్రాలను బ్రాహ్మణులకు అందజేస్తూ జీవో ఇవ్వకుండా చులకనగా చుస్తే రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ జాతికి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ ఉద్యమం చేపడతామని జగన్ ప్రభుత్వాన్ని శ్రీధర్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE