Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతకు రక్షణ లేదా?

వైసీపీ నాయకులు పత్తిత్తులా? వైసీపీ అంటేనే చీప్ లాంగ్వేజ్ పార్టీ
చంద్రనాయుడు ఇంటి ముందు ప్రజా వేదిక – జగన్ ఇంటి ముందు 24/7 144 సెక్షన్
డోల బాల వీరాజంనేయస్వామి, గూడూరి ఎరిక్సన్ బాబు
చంద్రబాబు నాయుడు ఇంటిని వైసీపీ రౌడీలు ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక పాలనలో ఉన్నామా? ఒక గూండా వైసీపీ ఎమ్మెల్యే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుడి ఇంటిని ముట్టడిస్తామని సవాల్ విసిరి నేడు ఇంటిపై దాడికి యత్నిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్న ప్రజలు, నాయకులను మాత్రం ముందుగా హౌస్ అరెస్ట్ లు చేస్తారు, హింసిస్తారు. కాని వైసీపీ నాయకులకు అవేమి ఉండవా? చట్టం వైసీపీ చుట్టమా?
పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేసిన జగన్ రెడ్డిని ప్రశ్నిద్దామని వెళ్లిన విద్యార్ధులపై రేప్ కేసు పెట్టారు. జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడిన జగన్ రెడ్డిని నిలదీద్దామని ఇంటికి వెళ్లబోతుంటే అరెస్ట్ లు, లాఠీచార్జీలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను తీర్చేందుకు ఆయన ఇంటి దగ్గరే ప్రజా వేదిక పెడితే జగన్ రెడ్డి ఇంటి దగ్గర 24/7 144 సెక్షన్ పెట్టుకొని తాడేపల్లి రాజప్రసాదంలో కులుకుతున్నారు. ఎన్నో ప్రజా సంఘాలు, ఉద్యమకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకుందామని జగన్ రెడ్డి ఇంటికి వెళితే పోలీసులతో కొట్టిస్తున్నారు.
గంట, అరగంట, వెనక నుండి అంటూ మహిళలను కించపరుస్తూ మాట్లాడి అడ్డంగా దొరికిన వైసీపీ నాయకులు నేడు పత్తిత్తుల్లా మాట్లాడటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ అంటేనే చీప్ లాంగ్వేజ్ పార్టీగా చెరగని ముద్ర వేసుకున్నారు.

LEAVE A RESPONSE