– ఎనిమిది మంది అమాయకుల నిండు ప్రాణాలను పణంగా పెట్టిన పాపం ముఖ్యమంత్రిదే
– కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్
– ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్. ఏడాది క్రితం చెప్పింది. ఇవాళ అక్షరాలా నిజమైంది. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారు. గతేడాది 10 శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటు. చెత్త నిర్ణయాలతోనే తెలంగాణ ఆర్థికరంగంలో ఈ విధ్వంసం. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం.
ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరం. కేసిఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి.. ముఖ్యమంత్రి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా?
ఎస్ఎల్బీసీ లో సెంటీమీటర్ సొరంగం తవ్వడం కూడా చేతకాని సీఎం, 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తిచేసిన బీఆర్ఎస్ పై నిందలు వేయడం సిగ్గుచేటు. గత 13 నెలలుగా ప్రాజెక్టు పనులను పూర్తిగా పండబెట్టి, తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టాలనే నీచానికి దిగడం అత్యంత దుర్మార్గం.
కనీస ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెట్టి, నాలుగు రోజులు కాకముందే ఎనిమిది మంది అమాయకుల నిండు ప్రాణాలను ఫణంగా పెట్టిన పాపం ముఖ్యమంత్రిదే. మొత్తం సొరంగం 43.94 కిలోమీటర్లైతే, 2005-2014 వరకున్న గత కాంగ్రెస్ సర్కారు హయాంలో తవ్వింది కేవలం 22.89 కిలోమీటర్లే. సొరంగంలో క్లిష్టమైన పరిస్థితులున్నా, ఏ ప్రమాదం జరగకుండా ఏకంగా 12 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తి చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ పనులకు రూ.3300 కోట్ల ఖర్చుచేస్తే, బీఆర్ఎస్ పాలనలో రూ.3900 కోట్ల పనులు పూర్తిచేసిన వాస్తవాన్ని దాచే ప్రయత్నంలో ముఖ్యమంత్రి బొక్కబోర్లా పడ్డారు
గత కాంగ్రెస్ సర్కారుకన్నా రూ.600 కోట్లు ఎక్కువ ఖర్చుచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడున్నరేళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెళ్లు తవ్వినా, ఎస్ఎల్బీసీ వంటి దారుణ సంఘటన జరిగిన దాఖలా లేదు. రైతులకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కాకుండా.. గల్లీ నుంచి ఢిల్లీదాకా కమీషన్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టి వాటిని అర్ధాంతరంగా గాలికి వదిలేసే నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. చేసిన తప్పును ఒప్పుకోవడం తప్ప ముఖ్యమంత్రి ముందు మరో మార్గం లేదు. ఈ “డ్యామేజ్ డైవర్షన్” కుట్రలు చైతన్యవంతమైన తెలంగాణ గడ్డపై ఎప్పటికీ సాగవు.