ఓబీసీల డిమాండ్ల సాధన లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి
– ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్ 8 వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోని సావిత్రి బాయి పూలే ఆడిటోరియంలో నిర్వహించనున్న ఓబీసీ యూత్ లీడర్ షిప్ సమ్మిట్ -2025 పోస్టర్ ను ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, జాతీయ ఓబీసీ నాయకులు బీపీ మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ పార్లమెంట్ సభ్యులు శ్యామ్ సింగ్ యాదవ్ , ఒడిషా రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సస్మిట్ పాత్ర, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు మస్తాన్ రావు , ఢిల్లీ యూనివర్సిటీ ఓబీసీ నాయకులు ప్రొఫెసర్ సందీప్ కుమార్ , బనారస్ హిందూ యూనివర్సిటీ ఓబీసీ నాయకులు ప్రొఫెసర్ కృష్ణకాంత్ , ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ , శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఓబీసీ నాయకులు మాట్లాడుతూ, ఓబీసీల డిమాండ్ల సాధనలో విద్యార్థుల పాత్ర ముఖ్యమైనది, ప్రతి ఓబీసీ ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాముయి, ఉద్యమానికి వెన్నెముకగా ఉండాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ లలో జరిగే అన్యాయాలను అవగాహన కల్పించాలి.
జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు చట్ట సభలలో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ల సాధనకు పాటుపడాలి. తెలంగాణలో బీసీల జనాభా ఎంత అనేది ఈ రోజు వరకు కచ్చితమైన లెక్క లేదంటే, కుట్ర పూరితంగా బీసీల జనాభా తక్కువగా చూపించడం జరిగింది అనేది అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా జనగణన తో పాటు కులగణన చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు.
జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగం మరియు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే అన్ని రాష్ట్రాలలో తిరిగి ఓబీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ ప్రకటించాలన్నారు.
ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ…. బీసీ యువ నేతృత్వ సమ్మిట్ 2025 యువతకు వివిధ రంగాల్లో రాజకీయ, బ్యూరోక్రటిక్, వ్యాపార, అకడమిక్, వృత్తిపర, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు మార్గనిర్దేశం చేయడానికే ఏర్పాటు చేయబడింది. “రాజకీయ అధికారమే మాస్టర్ కీ” అని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నట్లుగా, ఈ సమ్మిట్ యువ ఒబీసీ నాయకులకు రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకునే వ్యూహాలు, పరిజ్ఞానం అందిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.