Suryaa.co.in

Telangana

బూతులతో రేవంత్ పాలన

– రేవంత్ మోడీ ఏజెంట్
– మోడీ ని పొగుడుతూ కిషన్ రెడ్డి ని రేవంత్ తిట్టడం ఓ పెద్ద డ్రామా.
– ఎస్ ఎల్ బి సి సొరంగం లో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే
– ఘటన స్థలం లో ఉండాల్సింది రేవంత్ రెడ్డా ,హరీష్ రావా ?
– సీఎం సోయి లేకుండా మాట్లాడుతున్నారు
– ఇసుక వ్యాపారం కోసమే కాళేశ్వరాన్ని ఎండబెట్టారు
– మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో గత 15 మాసాలుగా ప్రభుత్వం పూర్తిగా చతికిలబడి పోయింది. పాలన రివర్స్ గేర్ లో ఉంది. అభివృద్ధి సూచికలు అధోపాలనకు పడిపోతున్నాయి. పాలన పట్ల రేవంత్ కు చిత్తశుద్ధి లేదు .ప్రజలంటే కమిట్ మెంట్ లేదు. మంత్రులకు తమ శాఖల పట్ల అవగాహన లేదు. రేవంత్ రెడ్డి ,ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకునేలా పాలన జరుగుతోంది.

సమస్యలు పరిష్కరించకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఎస్ ఎల్ బి సి లాంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వకపోగా బూతులతో పాలన చేస్తున్నారు. ఏడాదికి పైగా పోలీసులను వాడి పోరాటాలను నిర్వీర్యం చేయాలనీ రేవంత్ కుట్ర చేశారు. అయినా పోరాటాలు ఆగడం లేదు. ఎస్ ఎల్ బి సి సొరంగం లో ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రమాదం జరిగి పది రోజులు అవుతున్నా ఒక్క పైసా పని జరగలేదు.

సీఎం సోయి లేకుండా మాట్లాడుతున్నారు. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు లో ప్రమాదం జరిగితే మేము ఎవ్వరం వెళ్లలేదని సీఎం చిల్లర మాటలు మాట్లాడారు. ప్రమాద వార్త తెలిసిన కొన్ని నిమిషాల్లోనే నేను ప్రమాద స్థలికి బయలుదేరాను. 24 గంటల లోపే మేము డెడ్ బాడీ లు రికవరీ చేశాo. కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం తో పాటు మరణించిన వారి కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాము. అన్ని రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రేవంత్ చెక్ చేసుకోవచ్చు.

రేవంత్ ప్రతిపక్షం లో ఉండగా ఆ ఘటన ను రాజకీయం చేయబోతే అరెస్టు అయ్యారు. అది బయటకు కూడా రాలేదు. పది రోజుల తర్వాత ఎస్ ఎల్ బీసీ కి వెళ్లి రేవంత్ చిల్లర మాటలు మాట్లాడారు. సీఎం ఎస్ ఎల్ బి సి కి వెళ్లి 24 గంటలు గడిచింది. నిపుణులు వచ్చినా వారి సేవలను వాడుకోవడం లేదు. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గూడుపుఠాణీ ఏదో ఉంది.
.ఎస్ ఎల్ బీ సీ ఘటన పై విచారణ జరగాలి.

రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మోడీ ని కలిసి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డిని అదే పనిగా తిడుతున్నారు. మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మోడీ ఇస్తాను అంటే కిషన్ రెడ్డి వద్దు అంటున్నాడట. నాలుగు రోజులుగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. బీజేపీ లో ఏ టీం బీ టీం లు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి. రేవంత్ మోడీ ఏజెంట్ లా తయారయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు ఇది గ్రహించాలి

హరీష్ రావు మంత్రా ,ముఖ్యమంత్రా? ఎస్ ఎల్ బి సీ ఘటన స్థలం లో ఉండాల్సింది రేవంత్ రెడ్డా ,హరీష్ రావా ? ప్రతిపక్షానికి కొన్ని పరిమితులు ఉంటాయి. పాలక పక్షం లో రేవంత్ ఉండి ఏం లాభం ? హరీష్ రావు పై చిల్లర ఆరోపణలను ఖండిస్తున్నాం. పదిహేను నెలల రేవంత్ పాలనలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నాణ్యత లేని కరెంటు తో మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉంది. సీఎం మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారు.

కేసీఆర్ ఇచ్చిందే ఇవ్వడం లేదు . కొత్తగా రేవంత్ కు ఇవ్వడం చేతనవుతుందా అని ప్రజలు అడుగుతున్నారు. సూర్యాపేటకు గతం లో వచ్చినవి ఎస్ ఆర్ ఎస్ పి జలాలే అని కాళేశ్వరం జలాలు కావని ఉత్తమ్ అంటున్నారు. మరి సూర్యాపేట కు ఇపుడు ఎస్ ఆర్ ఎస్ పి జలాలు ఎందుకు రావడం లేదు ? ఇసుక వ్యాపారం కోసమే కాళేశ్వరాన్ని ఎండ బెట్టారు. ఈ రోజు కూడా ప్రభుత్వం తలచుకుంటే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయవచ్చు.

కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి పంటలు ఎండిపోకుండా కాపాడవచ్చు. కేసీఆర్ ను బద్నామ్ చేసేందుకే కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. సీఎం మాటలు ఒక్కటి కూడా ఆ హోదా కు దగ్గట్టు లేవు. కేవలం పదవిని కాపాడుకోవడానికి రేవంత్ మోడీ తో అంటకాగుతున్నాడు. మోడీ ని పొగుడుతూ కిషన్ రెడ్డి ని రేవంత్ తిట్టడం ఓ పెద్ద డ్రామా. రాష్ట్ర బీజేపీ ని తిట్టడం వల్ల ఏదో పోరాడుతున్నానని రేవంత్ బిల్డప్ ఇస్తున్నారు. సీఎం చిల్లర మాటలు బంద్ చేసి ఎండుతున్న పంటలు కాపాడాలి. మంత్రి ఉత్తమ్ కూడా ఎండుతున్న పంటలు కాపాడేందుకు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలి.

 

LEAVE A RESPONSE