Suryaa.co.in

Andhra Pradesh

విజయసాయిరెడ్డిని ప్రధాని మోదీ కార్యాలయం కాపాడుతోందా?

– ఏపీలోని భూ కుంభకోణం ఆసక్తికర మలుపులు తిరుగుతోందన్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణికం ఠాగూర్
– విజయసాయి విచారణను ఎదుర్కొవాల్సిందేనని ట్వీట్
– విజయసాయి అవినీతికి ప్రధాని సహకరిస్తున్నారా? అని ప్రశ్న

విశాఖలో భారీ భూ కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విమర్శలు వెల్లుతున్నాయి. మరోవైపు, విజయసాయిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఈ విషయంపై స్పందిస్తూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఏపీలోని భూ కుంభకోణం ఆసక్తికర మలుపులు తిరుగుతోందని అన్నారు.అవినీతికి పాల్పడిన విజయసాయిరెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కార్యాలయం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడర్ అయిన విజయసాయి అవినీతికి వారు సహకరిస్తున్నారా? అని అడిగారు. డెక్కన్ క్రానికల్ పత్రికకు వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలను వెల్లడించారని… ఆ ఇంటర్య్వూని చదివి చర్యలు తీసుకోగలరా? అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE