• పంటల బీమా పరిహారం ముసుగులో రైతుల సొమ్ముని వైసీపీ వాళ్లే దిగమింగుతున్నారు
• నాలుగేళ్లలో జగన్ రెడ్డి అవలంభించిన విధానాలు, రైతులకు చేసిన అన్యాయం చూస్తే, రైతులన్నా, వ్యవసాయమన్నా ముఖ్యమంత్రికి ఎంతద్వేషమో అర్థమవుతోంది
• పంటలబీమాసొమ్ము పంపిణీలో కూడా జగన్ రెడ్డి రైతుల్నిచిన్నచూపే చూశాడు
• కడప, కర్నూలు జిల్లాలకు ఎక్కువ పరిహరం కేటాయించి, మిగతా జిల్లాలకు అన్యాయం చేయడంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
రైతులు, వ్యవసాయమంటే ముఖ్యమంత్రికి ఎందుకంత ద్వేషమని, పంటలబీమా సాయం అందించకుండా రైతుల్ని వేధించడం, రైతుభరోసాకేంద్రాల్లో అంతా బాగుందని నమ్మించే ప్రయత్నంచేయడం జగన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలుఆయనమాటల్లోనే…
“ రాష్ట్రంలో అసలు వ్యవసాయశాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. 9సార్లు 50లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే, దాన్ని అంచనావేసేవిషయంలోగానీ, రైతులకు పరిహారం అందించేవిషయంలో గానీ ప్రభుత్వపరంగా ఎప్పుడైనా న్యాయంజరిగిందా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ప్రకృతివిపత్తులవల్ల జరిగిన పంటనష్టం అంచనా ల్ని ఎప్పుడైనా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి సమర్పించిందా? అలాంటివేమీ చేయకపోగా, రైతులకడుపుకొట్టేలా వ్యవహరిస్తారా?
వాతావరణ ఆధారిత, దిగుబడి ఆధారిత పంటల బీమా పేరుతో రైతుల పొట్టకొడుతున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోతాడు
స్వాంతంత్ర్యం వచ్చాక భారతదేశంలో ఏప్రభుత్వంలో జరగనంత నష్టం, అన్యాయం జగన్ ప్రభుత్వంలో రైతులకు జరిగింది. ఈక్రాప్ ద్వారా రాష్ట్రంలో ఎంతభూమి సాగులో ఉందని ప్రభుత్వం రిజిస్టర్ చేసింది? ఎన్నిఎకరాల్లో ఏఏ పంటలు సాగవుతున్నాయని నమోదుచేసింది? ఎన్నిహెకార్టు ఈ క్రాప్ లో నమోదైతే, ఎన్నిఎకరాలను జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం పంటలబీమాకింద నమోదుచేసింది? వాతావరణఆధారిత పంటల బీమా, దిగుబడిఆధారిత పంటలబీమా అంటూ గందరగోళం సృష్టించి, రైతులకు ఇవ్వా ల్సిన పరిహారాన్ని జగన్ రెడ్డి ఎగ్గొడుతున్నాడు.
పంటలబీమాసాయం రైతులకు అం దించడకోసం చంద్రబాబునాయుడు స్వయంగా అసెంబ్లీలో నేలపైకూర్చొని, ప్రభుత్వం పై నిరసన వ్యక్తంచేశారు. ఆయన అలాచేస్తే, రాత్రికి రాత్రి ప్రభుత్వం తరుపున చెల్లించా ల్సిన పంటలబీమాసొమ్ముని చెల్లించారు. రైతులకు న్యాయంచేయమని ప్రతిపక్షనేత స్పందించేవరకు ప్రభుత్వంలో, ముఖ్యమంత్రిలో చలనంలేకపోవడం నిజంగా రైతుల దౌర్భాగ్యమే.
2021-22లో పంటలునష్టపోయిన పత్తిరైతులకు దిగుబడిఆధారిత పంటల బీమాకింద రూ.189.86కోట్లువస్తే, దానిలో రూ.120కోట్లు కడపజిల్లారైతులకే పంచారు . రాష్ట్రంలో మిగతాజిల్లాల్లో రైతులు ఎక్కడాపత్తిసాగుచేయలేదా..లేక పత్తిపైరు దెబ్బతినలేదా? కడపజిల్లాలోని కొండాపురం మండలం ఏటూరు రైతుభరోసాకేంద్రానికే రూ.62.59లక్షలు పంపిణీచేయడంలోని ఆంతర్యం ఏమిటి?
అదేవిధంగా వాతావరణ ఆధారితబీమా కింద విడుదలచేసిన రూ.148.55కోట్లపంటనష్టపరిహారం సొమ్ములో, రూ.103కోట్లు కర్నూలుజిల్లాకే ఎందుకు పంపిణీచేశారు. రాష్ట్రంలోని మిగతాజిల్లాల్లో ఎక్కడా దిగుబడిఆధారిత, వాతావరణఆధారిత పంటలబీమా సాయం అందుకోవడాని కి రైతులు లేరా? దీనిపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతారు?
పంటనష్టపోయిన వరిరైతుకి ఎకరాకు రూ.32ల పరిహారం ఇవ్వడం ఎలాంటి న్యాయం జగన్ రెడ్డి?
ఎన్నికలకు ముందు రైతునిరాజుని చేస్తానని, రైతుభరోసాకేంద్రాలతో వ్యవసాయాన్ని పండగలా మారుస్తానని గొప్పలుచెప్పిన జగన్ రెడ్డి, నాలుగేళ్లపాలనలో కేంద్రప్రభుత్వ మిచ్చే రైతుభరోసా సొమ్ముపంపిణీకి బటన్ నొక్కడానికే పరిమితమయ్యాడు. గతంలో పంటలబీమాకింద చంద్రబాబుప్రభుత్వం రైతులకు రూ.4,700కోట్లు చెల్లించింది.
జగన్ రెడ్డి ప్రభుత్వంలో 9సార్లు రైతులు పంటలునష్టపోయినా, 50లక్షలఎకరాల్లో పంటలు దె బ్బతిన్నా, రైతులకు అందినసాయం అరకొరే. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం, పసుపుగల్లుగ్రామంలో భానుముక్కల లక్ష్మిరెడ్డి అనేరైతు ఎకరా15సెంట్లలో వరిసాగు చేసినష్టపోయారు. ఆ రైతుకి జగన్ ప్రభుత్వమిచ్చిన పంటనష్టపరిహారం కేవలమంటే కేవలం … రూ.36.50పైసలు.
అదే గ్రామానికి చెందిన పిచ్చయ్య అనేరైతుకి 2ఎకరా లకు రూ.64లు పరిహారం ఇచ్చారు. జగన్ అతనిప్రభుత్వం ఎకరావరిపైరుకి ఇచ్చిన పరిహారంతో కేజీబియ్యం కూడా రావడంలేదు. ఈ విషయం జగన్ రెడ్డికి తెలియదా? అయ్యోలక్ష్మణా అని రాష్ట్రరైతాంగం ప్రకృతివిపత్తలకు గురై అలమటిస్తుంటే, జగన్ రెడ్డి ఎందరు రైతులకు న్యాయంచేశాడు? రాష్ట్రంలోని 21జిల్లాల్లో జగన్ ప్రభుత్వం అరకొరగా నే పంటలబీమా పరిహారం అందించింది. 9జిల్లాల్లో రూ.కోటిలోపుమాత్రమే చెల్లించింది. కడప, కర్నూలుజిల్లాలకు మాత్రమే ముఖ్యమంత్రి పంటలబీమా సాయం అందించి, మిగతాజిల్లాల రైతాంగాన్ని చిన్నచూపు చూడటం ఎంతవరకు సబబు? ఏవిధమైన అంచనాలు, లెక్కలతో ఆ రెండుజిల్లాలకు వాతావరణఆధారిత, దిగుబడి ఆధారిత పంటలబీమా పరిహారం ముఖ్యమంత్రి అందించాడు?
ఈ-క్రాప్ లో రైతులపేర్లతో పంటనష్టం వివరాలు నమోదుచేసి, పంటలబీమా పరిహారం సొమ్ముని దిగమింగుతున్నది ఎవరో ముఖ్యమంత్రికి తెలియదా?
క్షేత్రస్థాయిలో రైతులుసాగుచేస్తున్న పంటలువేరు.. ఈ-క్రాప్ వివరాల్లో అధికారులు చూపుతున్న పంటలువేరు. రెవెన్యూ, వ్యవసాయఅధికారులతో సంబంధంలేకుండా ఎవరు ఈ క్రాప్ వివరాలు నమోదుచేస్తున్నారు? రాష్ట్రంలోలేని రైతులపేర్లు ఈక్రాప్ లో నమోదుచేస్తూ, న్యాయంగా రైతులకుదక్కాల్సిన సొమ్ముని ఎవరు దిగమింగుతున్నారో ముఖ్యమంత్రికి తెలియదా? జగన్ రెడ్డి అప్పులరెడ్డిగా మిగిలి, నాలుగేళ్లలో 98 శాతం రైతుకుటుంబాల్ని అప్పుల ఊబిలో దించేశాడు. ఒక్కో రైతుతలసరి అప్పు రూ.2.45లక్షలకు చేర్చాడు. రోజురోజుకి రైతుపరిస్థితి దిగజారిపోవ డానికి జగన్ రెడ్డి చేతగానితనం, అసమర్థతేకారణం. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరిగిపోయి, రైతాంగందిక్కుతోచని స్థితిలో ఉంటే, జగన్ రెడ్డి ఇచ్చే అరకొరసాయం ఏ మూలకు వస్తుంది?
గత ప్రభుత్వం రూ.3,700కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తే, నాలుగే ళ్లలో జగన్ రెడ్డి రూ.1900కోట్లతో సరిపెట్టాడు. అధికారంలోకి వచ్చింది మొదలు రైతు ల్ని నట్టేటముంచేలా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డి, ఇంకాసిగ్గులేకుండా చంద్రబాబుపై టీడీపీప్రభుత్వంపై నిందలేయడం సిగ్గుచేటు.ఖరీఫ్, రబీ రెండుసీజన్ల పంటల్ని పంటల బీమాకింద నమోదుచేయడంలో జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
రైతుల్ని కుల,మత పరంగా విభజించి, వారి నోట్లో జగన్ రెడ్డి మట్టికొట్టాడు
విత్తనంవేసే దగ్గరనుంచి పంటఉత్పత్తుల్ని అమ్ముకునేవరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని మోసగిస్తున్నతీరు మాటల్లోచెప్పలేనిది. వాతావరణఆధారిత పంటలబీ మాపేరుతో రాష్ట్రంలో 9జిల్లాలరైతుల్ని పంటలబీమాసాయం నుంచి జగన్ రెడ్డి పక్కకు తప్పించాడు. ఎందుకు తప్పించారో, ఏ నిబంధనలప్రకారం తప్పించారో చెప్పరు. కేంద్రప్రభుత్వం అందించే ఫసల్ బీమాయోజన కింద కట్టాల్సిన సాయం మొత్తం తానే కడతానని, రైతులు రూపాయికూడా కట్టాల్సినపనిలేదని చెప్పిన జగన్ రెడ్డి చివరకు రాష్ట్రవాటాగా కట్టాల్సిందికట్టకుండా రైతులనోట్లో మట్టికొట్టాడు.
అన్నంపెట్టే రైతుల్ని కులాలు, మతాలు, రాజకీయపరంగా విభజించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. చంద్రబాబు రైతుని రైతుగానేచూసి, అందరికీ సమన్యాయంచేశాడు. రైతురుణమాఫీ, అన్నదాతా సుఖీభవ కింద అందించే ఆర్థికసాయాన్ని అర్హులైన రైతులందరికీ అందించారు. పంట లబీమా సాయంపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు?
ప్రభుత్వం విడుదలచేసిన రూ.1117కోట్ల పంటలబీమా సాయంలో ఏజిల్లాకు ఎంత కేటాయించారు? ఎంతమంది నిజమైనరైతులకు సాయంఅందిస్తున్నారో చెప్పాలి. రైతులపొట్టకొట్టి, రైతుఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపిన మోసకారీ జగన్ రెడ్డి చరిత్రహీనుడిగా, రైతుద్రోహిగా మిగిలిపోతాడు.” అని ఆలపాటి స్పష్టంచేశారు.