ఒక కార్యకర్త కష్టపడితే అత్యున్నత స్థాయిలో కూర్చోవచ్చు అని తెలుగుదేశం పార్టీలో నేడు రుజువు అయింది. అలా జరిగిందంటే దాని వెనకాల ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాన్ని ముందుకు నడిపించి పార్టీలో నాయకులను ఒప్పించి మెప్పించి సాధ్యమయ్యేలా చేశారు యువనేత నారా లోకేష్. పార్టీలో కొత్త తరాన్ని తీసుకుని వస్తూ యువతని ప్రోత్సహిస్తూ ఈరోజు పార్టీలో నవతరంతో కూడిన కొత్త రక్తంతో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతోంది అంటే దీని వెనుక ఉన్నది ఒక వ్యక్తి ఆలోచన శ్రమ ఆ యువశక్తి పేరే నారా లోకేష్
ఈరోజు ఆయన అధిరోహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఒక్క రోజులో వచ్చింది కాదు.. ఎన్నో ఏళ్ల ఆయన కృషికి, శ్రమకు దక్కిన ఫలితం ఇది. రాజకీయ నాయకుల వారసులు పార్టీలోకి వస్తే పదవులు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయని అనుకుంటారు కానీ లోకేష్ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు పార్టీలో వెనుక నుంచి తన సేవలను అందించారు. ఒక సాధారణ కార్యకర్తగా పార్టీ మేనిఫెస్టోలో పథకాలకు సూచనలు చేస్తూ ఎన్నికల సమయంలో పార్టీ బ్యాక్ ఆఫీస్ కి కావలసిన సహకారాన్ని అందించారు.
ఆ తర్వాత ఆయనలోని తెలివితేటలు, పోరాట పటిమ చూసి టీడీపీ అధిష్టానం యువనేత నారా లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆనాటి నుంచి పార్టీలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మొదటిగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అలాంటి వ్యవస్థ లేదు.
అలాంటిది కార్యకర్తల కోసం ప్రత్యేక వ్యవస్థ సృష్టించి కార్యకర్తలకు అండగా నిలబడుతూ దేశానికే రోల్ మోడల్ గా నిలిచారు. అలానే కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ సిస్టమ్‌ను తీసుకొచ్చారు నారా లోకేష్. దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిందంటే ఆ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తే నారా లోకేష్. ఇలా పార్టీలో బాధ్యతలు చేపట్టిన వెంటనే సరికొత్త ఆలోచనలతో కార్యకర్తలకు అండగా నిలబడుతూ వాళ్ళ మనసు గెలిచారు యువనేత నారా లోకేష్.
ఆ తర్వాత ఆయన పట్టుదల, చేసిన సేవలను చూసి ప్రభుత్వంలో మంత్రిగా తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . అలా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న ఐటీ, పంచాయతీరాజ్ శాఖలకు దేశంలోనే నెంబర్ వన్ గా అవార్డులను అందుకున్నారు. విమర్శకులకు తన పనితనంతో సమాధానం చెప్పారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీలో కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడ్డారు. 2019-2024 మధ్యలో ఎన్నో సవాళ్లును ఎదుర్కొంటూ ఆనాటి అధికారపక్షం పెట్టిన అక్రమ కేసుల నుంచి నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్లకి ధైర్యాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలందరి పక్షాన నిలబడి ప్రజాబలంతో యువగళం పాదయాత్ర చేస్తూ కార్యకర్తలకు, ప్రజలకు భరోసానిస్తూ ఆనాటి అధికారపక్షంలో ఉన్న రౌడీ మూకలు, గుండాలు దాడులకు తెగబడుతున్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా రాజీలేని పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు యువనేత నారా లోకేష్.
నేను 30 ఏళ్లు అధికారంలో ఉంటాను అని విర్రవీగిన ఆనాటి వైసీపీ సైకోలకు ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా 11 సీట్లకు కూర్చోబెట్టి తిరుగులేని చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళని పైకి తీసుకువస్తూ అండగా నిలబడుతున్నారు. అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఉండగా నిలబడుతున్నారు. ఇలా నిరంతరం ప్రజల కోసం కార్యకర్తల కోసం అండగా నిలబడుతున్నారు నారా లోకేష్
ఈ విధంగా లోకేష్ కష్టానికి దక్కిన ఫలితం నేడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. లోకేష్ నేటి యువతరానికి ఓ స్ఫూర్తి. రాజకీయాల్లో రావాలనుకునే వారికి ఆయన జీవితం ఒక మార్గదర్శకం. ఎందుకంటే కష్టాల కడలిలో ఉన్న పార్టీని ఉక్కు ధైర్యంతో ముందుకు నడిపించారు. ప్రత్యర్థి కంచుకోటలో పోటీ చేసి గెలిచి తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మార్చారు. పార్టీలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీలకు సాధ్యంకాని విధంగా కార్యకర్తలకు గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చారు. సాధారణ కార్యకర్త కూడా అధినాయకుడితో మాట్లాడే విధంగా వాళ్ళ పనితనం అధినాయకుడుకి తెలిసేలా మార్పులు తీసుకొచ్చారు.
వారసుడుగా కాదు, కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు యువనేత నారా లోకేష్..నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో పార్టీ తిరుగులేని శక్తిగా,దేదీప్యమానంగా వెలగాలని, మాలాంటి యువతకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మనందరి యువనేత నారా లోకేష్ అన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు.
– శశి