– ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్పంచుల సమావేశం లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు Y.V.B. రాజేంద్ర ప్రసాద్
రాష్ట్రపతి చేతుల మీదగా న్యూఢిల్లీలో ఇచ్చిన పంచాయతీరాజ్ జాతీయ 46 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఒక్క అవార్డు కూడా రాకపోవడం అనేది జగన్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. జగన్ ప్రభుత్వం గ్రామపంచాయతీల, సర్పంచుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మొదటినుంచి మొత్తుకున్నా కానీ ఈ ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్లు లేదు – ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల, సర్పంచుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని తెలుసుకొని బాధ్యత వహిస్తూ ఏపీకి ఒక్క అవార్డు కూడా రానందున రాష్ట్రంలోని సర్పంచులు అందరికీ క్షమాపణ చెప్పి మా డిమాండ్లు పరిష్కరించాలి .
చిత్తూరు జిల్లా, చిత్తూరు టౌన్, హోటల్ భాస్కరలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్పంచ్ ల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల, గ్రామ పంచాయతీల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ, జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో ఏపీకి ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై ప్రసంగించిన వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావు .
ఈ సమావేశంలో వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ ప్రసంగిస్తూ నిన్న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రధానోత్సవములో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గ్రామపంచాయతీల పట్ల, సర్పంచుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని, మన పక్క రాష్ట్రం తెలంగాణకు 13 అవార్డులు వస్తే, మన రాష్ట్రానికి మాత్రం ఒక్క అవార్డు కూడా రాకపోవడం మన రాష్ట్రంలోని సర్పంచులు, గ్రామపంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుందో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలని, మన రాష్ట్రం పరువు గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా తీసివేయడం ఈ జగన్ ప్రభుత్వానికే చెల్లిందని, మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మొదటి నుంచి మొత్తుకుంటుంది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రానికి రాకూడదు అనే అని, ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల 12918 మంది సర్పంచులు తలదించుకోవలసిన పరిస్థితి వచ్చిందని రాజేంద్రప్రసాద్ అన్నారు.
లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ఎంతో కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు ఉన్న సర్పంచులు మన రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతకాని పాలన వలన మన రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా రాలేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మా సర్పంచులను పూర్తిగా నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు లాగా మార్చి వేసిందని, మా నిధులు మా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు.
అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం యొక్క డిమాండ్లు అయినటువంటి…
1) సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం మరియు కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ,,8660 కోట్ల రూపాయలు తిరిగి సర్పంచుల PFMS ఖాతాల్లో జమ చెయ్యాలని…
2) గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని….
3) సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ:15 వేలు – అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ,,30000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని….
4) ఉపాధి హామీ నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని….
5) పాత పద్ధతిలోనే పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని..
6) గత మూడు న్నర సంవత్సరములుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన గ్రామపంచాయతీల బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని…
ఇలా న్యాయబద్ధమైన మా 13 డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులందరినీ కలుపుకొని ఉద్యమాలు ఉధృతం చేస్తామని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సర్పంచుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు రాఘవ రాజు మణిరాజ్, సర్పంచుల సంఘం రాష్ట్ర సెక్రెటరీ రెడ్డి రాము, పంచాయతీరాజ్ ఛాంబర్ స్టేట్ సెక్రటరీ వానపల్లి ముత్యాలరావు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు రెడ్డివారి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.