Suryaa.co.in

Andhra Pradesh

ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శిస్తామంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటు

-పోలీసులు నిర్భందిస్తోంది టీడీపీ నేతల్ని కాదు న్యాయాన్ని అన్న విషయం గుర్తుంచుకోవాలి
– నాడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని కారు కూతలు కూసిన వారి గుండెల్లో నేడు రైళ్లు పరుగెడుతున్నాయి
-టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి
నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రతిపక్షపార్టీ నాయకునిగా నారా లోకేశ్ వస్తుంటే అడ్డుకోవటం, టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం అప్రజాస్వామికం. ఇలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం, పోలీసులు ఆలోచించుకోవాలి. అనూష హత్యకు గురై సంవత్సరం గడస్తున్నా…ఇంతవరకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతల్ని అరెస్టు చేయటం సిగ్గుచేటు. పోలీసులు నిర్భందిస్తోంది టీడీపీ నేతల్ని కాదు, న్యాయాన్ని అన్న విషయం గుర్తుంచుకోవాలి. అన్యాయాలకు గురైన భాదిత కుటుంబాలకు అండగా నిలబడటం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల హక్కు, ఆ హక్కు కాదనే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా అడ్డుకోవటం జగన్ రెడ్డి పిరికితనానికి ప్రతీక. లోకేశ్ కి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతల వెన్నులో వనుకు మొదలైంది. నాడు నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరారని కారుకూతలు కూసిన వైసీపీ నేతల గుండెల్లో నేడు రైళ్లు పరుగెడుతున్నాయి. అందుకే లోకేశ్ ని అడుగడునా అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డి కక్ష్యసాధింపులో పోలీసులు భాగస్వాములై తమ భవిష్యత్ పాడుచేసుకోవద్దు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో నిరసన తెలిపే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోకపోతే ముందు రోజుల్లో ఇబ్బందులు తప్పవు. హౌస్ అరెస్టులు చేసిన టీడీపీ నేతల్ని వెంటనే విడుదల చేయాలి, లోకేష్ నరసరావుపేట పర్యటనకు అనుమతివ్వాలి.

LEAVE A RESPONSE