-వైసీపీ పొలిటికల్ మైలేజీ కోసం యూనివర్సిటీలను తమ కార్యకలాపాలకు వేదికగా చేయడం సిగ్గు చేటు
– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్
రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విలువ తెలియక వాటిని కార్పొరేట్ స్కూల్ స్థాయికి దిగజార్చారు.విశ్వవిద్యాలయాలను ప్రైవేట్ స్కూల్స్ అనుకొని విజయసాయిరెడ్డి ప్రవర్తిస్తున్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ మేళాలతో ప్రైవేటు ఉద్యోగాలు అని పగటి వేషాలు వేస్తున్న సాయిరెడ్డిని నిరుద్యోగులు తరిమికొట్టాలి.జగన్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. జగన్ రెడ్డి జాబ్ ఎక్కడ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తారేమోనని భయంతో రాజప్రసాదం వీడి బయటకు రావడం లేదు.