Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తాయో, ఏ నెలవి ఏ నెలలో వస్తాయో తెలియని పరిస్థితి

– చంద్రబాబు హాయాంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఒకటో తేదీనే జీతాలు అందాయి
– షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వంటి తన బినామీల సంస్థలకు విద్యుత్ రంగాన్ని దోచిపెట్టాడు
– జగన్ పాలనలో పెరిగిన విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు
– ఉద్యోగులకు జీతాలు అందవుగానీ, ఠంఛన్ గా షిరిడిసాయి సంస్థ బిల్లులు మాత్రం క్లియర్ అవుతాయి
– టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన టీ.ఎన్.టీ.యూ.సీ అనుబంధ విభాగం తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సమావేశం
– ‘తెలుగువికాస దైనందిని-2024’ పేరుతో డైరీని ఆవిష్కరించిన టీడీపీనేతలు
– కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు పరుచూరి అశోక్ బాబు, గురజాల మాల్యాద్రి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, టీ.ఎన్.టీ.యూ.సీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నేతలు పర్వతనేని సాంబశివరావు, మదుసూదన్ రెడ్డి, కోగంటి వెంకటేశ్వరరావు, శ్రీరామమూర్తి

గొట్టుముక్కల రఘురామ రాజు మాట్లాడుతూ… “ కార్మికుల కష్టం, వారి శక్తికి గుర్తుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఖాకీ దుస్తులు ధరించి జనంలోకి వెళ్లారు. కర్షకులు, కార్మికులకు అండగా నిలుస్తున్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. 2014కు ముందు రాష్ట్రానికి అనేక సమస్యలున్నప్పటికీ, చంద్రబాబునాయుడు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. ముఖ్యంగా విద్యుత్ రంగ కార్మికులు ప్రజలకోసం రేయింబవళ్లు పనిచేశారు.

ఎండావాన, రాత్రి పగలు అనే తేడా లేకుండా చంద్రబాబునాయుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి, ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా పనిచేశారు. చంద్ర బాబు హాయాంలో ఉద్యోగులు, వివిధ విభాగాలకు ఠంచన్ గా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలదాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, ప్రజలకోసం పనిచేసే ఉద్యోగులు, కార్మికుల్ని ఇబ్బందిపెట్టకూడదని చంద్రబాబు భావించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విద్యుత్ రంగం సహా.. అన్నివర్గాలు నాశనమయ్యాయి. ఈ ప్రభుత్వం ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపిం ది. జగన్ పాలనలో పెరిగిన విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.” అని రఘురామరాజు చెప్పారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ… “ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ టారిఫ్ ల మార్పుల పేరుతో ఛార్జీలు పెంచడంద్వారా, విద్యుత్ సంస్థలను తనఖా పెట్టిగానీ రూ.64వేల కోట్ల అప్పుల భారం మోపాడు. విద్యుత్ రంగంపై ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా, సదరుశాఖ సిబ్బంది జీతభ త్యాలు పెరిగిందిలేదు. అలానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతు న్నది లేదు. పరిశ్రమలు, వ్యాపారా సంస్థలకు నాణ్యమైన విద్యుత్ అందడం లేదు. విద్యుత్ వినియోగ దారుల్ని పీడించి గానీ, పరిశ్రమలు, ఇతర రంగాలపై భారం మోపిగానీ జగన్ రెడ్డి తాను చేసిన అప్పులు రూపేణగానీ మొత్తంగా రూ.64 వేల కోట్లను ముక్కు పిండి వసూలు చేశాడు. రూ.64వేల కోట్లను ఈ ముఖ్యమంత్రి దేనికి ఖర్చుచేశారంటే సమాధానం లేదు.

బయటి మార్కెట్లో అధికధరకు విద్యుత్ కొనడానికి రూ.15వేల కోట్లను జగన్ దుబారా చేశాడు. ఆ మొత్తంలో ముఖ్యమంత్రికి ఎంత కమిషన్ అందిందో తెలియాలి. చంద్రబాబు నాయుడి హాయాంలో ఏపీ ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మితే, జగన్ రెడ్డి వచ్చాక బయటినుంచి అధికధరకు విద్యుత్ కొనాల్సిన దుస్థితి. రాష్ట్రంలోని థర్మల్ స్టేషన్లు, ఇతర పవర్ ప్లాంట్లను కావాలనే మూతవేయించిన జగన్, విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దిగజార్చి, అధికధరకు విద్యుత్ కొన్నాడు. అలానే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వంటి తన బినామీల సంస్థలకు విద్యుత్ రంగాన్ని దోచిపెట్టాడు” అని మాల్యాద్రి తెలిపారు.

టీడీపీ నేత కేశినేని చిన్ని మాట్లాడుతూ… “ కరోనా సమయంలో వైద్య, పారిశుధ్య సిబ్బందితోపాటు విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రకృతి విపత్తుల వల్ల విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యల పరిష్కారంలో విద్యుత్ సిబ్బంది చూపుతున్న చొర వ నిజంగా ప్రశంసనీయం. టీ.ఎన్.టీ.యూ.సీ అనుబంధ సంఘంలో తెలుగు నాడు విద్యుత్ విభాగమే పెద్దదేమో! టీ.ఎన్.టీ.యూ.సీ సభ్యత్వాలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ అని నమ్మి అందరూ మోసపోయారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడి నాయకత్వం చాలా అవసరం. అన్ని కార్మిక సంఘాలు… టీడీపీ నేతలు, కార్యకర్తల్లా ప్రత ఇంటికి వెళ్లి, ఈ దుర్మార్గుడి పాలన వల్ల జరిగిన నష్టాన్ని, రాష్ట్రం ఎంతలా నష్టపోయిందనే వివరాల్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కోరుతున్నాను. 165కు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన గెలిచేలా టీ.ఎన్.టీ.యూ.సీ అనుబంధ విభాగాలన్నీ సమిష్టిగా పనిచేయాలి.” అని చిన్ని సూచించారు.

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ…“ తెలుగునాడు విద్యుత్ సంఘం మొదటి డిమాండ్ ఏమిటంటే.. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని. జీతాలు సక్రమంగా చెల్లించాలని పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ సన్నాసి ప్రభుత్వం ఎంతబాగా పనిచేస్తోందో అర్థమవు తోంది. సాధారణంగా ఉద్యోగులు పీఆర్సీ ఇవ్వాలని, డీఏలు చెల్లించాలని, ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చాకే ఇలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ దుస్థితికి కారణం సైకో అసమర్థ, చేతగాని పాలనే. రాష్ట్రంలోని వనరుల్ని దోచేస్తూ, ప్రజల్ని దోచుకు తింటూ, ఆ సొమ్మంతా దిగమింగుతున్న జగన్ రెడ్డికి ప్రజలతో పాటు, ఉద్యోగుల సమస్యలు, కష్టాలు కూడా పట్టడంలేదు. ఈ ప్రభుత్వంలో ఒకటో తేదీన విద్యుత్ ఉద్యోగులకు జీతాలు అందవుగానీ, ఠంఛన్ గా షిరిడిసాయి సంస్థ బిల్లులు మాత్రం క్లియర్ అవుతాయి. జగన్ రెడ్డి వచ్చినప్పటి నుంచీ ఎవరెవరు ఆయనకు చెంచాగిరీ చేస్తూ, అటు ప్రజల్ని..ఇటు మీలాంటి ఉద్యోగుల్ని ఇబ్బందులు పెట్టే వారి సంగతి తేలుస్తాం. ఈసారి వచ్చే టీడీపీ ప్రభుత్వం తప్పుచేసిన వారి తాటతీసే ప్రభుత్వమే అవుతుంది.

శిష్టరక్షణతో పాటు దుష్టశిక్షణ కూడా జరగాలి. అతిమంచితనం కూడా పనికిరాదు. లోకేశ్ రెడ్ బుక్ చూపించడం ఆషా మాషీ కాదు. రెడ్ బుక్ లో నమోదైనవారిని కచ్చితంగా శిక్షించే తీరతాం, అవసర మైతే వారికోసం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జగన్ రెడ్డి పేరుతో ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్మిస్తాం. ప్రజలసొమ్ము మింగి, వారిని నానా రకాలుగా హింసించిన వారంతా తమ శేష జీవితం అక్కడే గడుపుతారు.

మన సైకో కొత్తగా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్నాడు. 5 ఏళ్లుగా ప్రజలతో ఆడుకున్నాడు.. ఉద్యోగులతో ఆడుకున్నాడు. అది చాలదన్నట్లు ఇప్పుడు ఆటలు ఆడుతాడంటా! ఈసారి ఈ సైకోని మనం కొట్టే దెబ్బ దిమ్మతిరిగేలా ఉండాలి. మొన్ననే ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలయ్య బాబు, లోకేశ్ ల బొమ్మతో జగన్ రెడ్డికి బ్లాక్ బస్టర్ సినిమా చూపించాం.

జగన్ రెడ్డి కొత్తగా ఎమ్మెల్యేల బదిలీలకు సిద్ధమయ్యాడు. ఒక నియోజకవర్గంలో పనికిరాని చెత్త, మరో నియోజకవర్గంలో బంగారం ఎలా అవుతుందో చెప్పాలి. జగన్ ఇంకా ప్రజల్ని మోసగించే ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నా.. ప్రజలపై రూపాయి కూడా విద్యుత్ ఛార్జీల భారం మోపలేదు. విద్యుత్ ఉద్యోగులు సహా అన్ని విభాగా ల వారికి ఒకటో తేదీనే జీతాలు పడేవి. అలాంటి చంద్రబాబు నాయకత్వం మనకు, రాష్ట్రానికి చాలా అవసరమని గ్రహించండి. చంద్రబాబునాయుడు గతంలో రాష్ట్రం రూ.16వేల కోట్ల ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం హెచ్ ఆర్ ఇచ్చారు. 2018లో 25శాతం ఇచ్చారు.

రివర్స్ గేర్ పాలనలో ఈ సైకో ముఖ్యమంత్రి ఇచ్చింది కేవలం 8శాతం. ముష్టి వేశాడు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విద్యుత్ ఉద్యోగులకు చిల్లర వేశాడు. ఈ సైకో జగన్ రెడ్డికి ఊరికొక ప్యాలెస్ కావాలి. రుషికొండపై కొత్తగా నిర్మించుకుంటు న్న ప్యాలెస్ లో బంగరాంతో చేసిన కమోడ్స్..బాత్ టబ్స్ పెట్టిస్తున్నాడని చెబు తున్నారు. తన విలాసాలకోసం విపరీతంగా ప్రజలసొమ్ము దుర్వినియోగం చేస్తు న్నాడు కాబట్టే, నేడు సమైక్యాంధ్రప్రదేశ్ సమరాంధ్రప్రదేశ్ గా మారింది. అంగన్ వాడీ సిబ్బంది, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లు సహా అందరూ రోడ్లపైకి వచ్చారు. జగన్ రెడ్డిని కార్మికులు, వివిధ విభాగాల ఉద్యోగులు కొత్తగా ఏమీ అడగడంలేదు.

గతంలో తాను ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ రెడ్డి గతంలో మాట్లాడిన ప్రతి మాట మోసమే. ఇచ్చిన హామీ లు అన్ని బుట్టదాఖలు చేశాడు కాబట్టే, అన్నివర్గాల వారు ఇంకా ఎప్పుడు నెరవేరుస్తావు అంటూ ఈ సైకో ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజల్ని మోసగిస్తున్నాడు. కానీ భవిష్యత్ లో ప్రజలు తమ చేతిలో ఉన్న అసలైన బటన్ నొక్కితే, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కను మరుగై పోతుంది. రేపు టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పదేపదే మీ నుంచి వచ్చే ఫిర్యాదు ఏదైతే ఉందో, అది మరలా ఉత్పన్నం కాకుండా చూసే బాధ్యత మాది.” అని పట్టాభిరామ్ హామీ ఇచ్చారు.

టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ… “ 41 సంవత్సరాలుగా తెలుగునాడు విద్యుత్ సంఘం డైరీని ఆవిష్కరించడం సామాన్య విషయం కాదు. ఇలాంటి వాటికంటే కూడా మన పనితీరు చాలా ముఖ్యం. ఏ కార్మిక సంఘం అయినా, ఏ నాయకుడు అయినా, తమ పనితీరు తోనే ప్రజల మనసులు గెలవగలరు. అలానే మంచి దార్శనికత, ముందు చూపు కూడా ఉండాలి. ఏ రంగం వృద్ధి చెందాలన్నా విద్యుత్తే (పవర్) కీలకం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ దాన్ని సద్వినియోగం చేసుకునేలా అన్ని రంగాలు, అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు దూరదృష్టితో ఆలోచించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు, కార్మిక సంఘాలు కూడా పనితీరు మార్చు కోవాలి.

విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల తరుపున రెగ్యులర్ ఉద్యోగులు ఒక్కరోజు కూడా ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు? ఒకటో తేదీన జీతాలు రావడం లేదని రెగ్యులర్ ఉద్యోగులు బాధపడుతున్నారు.. కానీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తాయో, ఏ నెలవి ఏ నెలలో వస్తాయో తెలియని పరిస్థితి. చంద్రబాబు హాయాంలో అన్ని విభాగాల్లోని రెగ్యులర్ ఉద్యోగు లతో పాటే, కాంట్రాక్ట్ .. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఒకటో తేదీనే జీతాలు అందాయి.

ఒకటో తేదీ సెలవు అయితే, దానికి ముందురోజే జీతం సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో పడేది. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా.. ఎప్పుడూ చంద్రబాబు ఉద్యోగుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అదీ టీడీపీప్రభుత్వ నిబద్ధత. తెలుగు నాడు విద్యుత్ కార్మిక విభాగం గానీ, టీ.ఎన్.టీ.యూ.సీ ఇతర విభాగాలు గానీ తెలుగుదేశానికి తప్ప ఇతర పార్టీలకు ఓటు వేయవు.” అని అశోక్ బాబు తెలిపారు.

LEAVE A RESPONSE