Suryaa.co.in

Telangana

ఇది ప్రజల తెలంగాణకు – దొరల తెలంగాణకు మధ్య యుద్ధమే

-మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్

రాహుల్ గాంధీ కాలి గోటికి సరిపోని స్థాయి నీది డ్రామారావు. ఆయనది ఈ దేశం కోసం రక్తం ధారపోసిన కుటుంబం. నీది అమరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న కుటుంబం. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్. దళితుడ్ని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తానని దోకా ఇచ్చిన ద్రోహి కేసీఆర్. ముమ్మాటికీ ఇది ప్రజల తెలంగాణకు – దొరల తెలంగాణకు మధ్య యుద్ధమే.

తెలంగాణ స్వేచ్ఛ కోరుతోంది… మీ నియంత పాలన నుండి తెలంగాణ ఆత్మగౌరవం కోరుతోంది… మీ బానిస పాలన నుండి తెలంగాణ ప్రజాస్వామ్యం కోరుతోంది… మీ రాక్షస పాలన నుండి తెలంగాణ కోరికను కాంగ్రెస్ నెరవేరుస్తుంది… డిసెంబర్ 3న.

LEAVE A RESPONSE