Suryaa.co.in

Andhra Pradesh

ప్రసాదాలలో బొద్దింక రావడం అమానుషం

– మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు

విజయవాడ: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దివ్య క్షేత్రం శ్రీశైలంలో ప్రసాదాలలో బొద్దింక వచ్చిన అంశం మీద రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్ష్యులు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు స్పందించారు. ప్రసాదాలలో బొద్దింక రావడం అనేది చాలా అమానుషం, నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు.

ప్రతి దేవాలయము ప్రసాదాన్ని దేవుని యొక్క ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలు నిర్వహణ, దేవాలయాల భద్రత దేవాలయాల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతుంది.

దేవాలయాల నిర్వహణలో ఏరకం గా ప్రసాదాల తయారీ ఉన్నదో శ్రీశైలంలో సంఘటనే ఉదాహరణ. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ప్రసాదాల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్, సంబంధిత అధికారుల మీద చర్యలు చేపట్టాలి. కాని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రసాదాల నిర్వహణలో బాధ్యత రాహిత్య కారణంగా జరిగిన సంఘటనలమీద ఉద్యమస్తామని అన్నారు.

LEAVE A RESPONSE