తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే, తప్పుడు కేసులు నమోదు చేయం ఇదెక్కడి న్యాయం?
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే, తప్పుడు కేసులు నమోదు చేయడం ఇదెక్కడి న్యాయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు …
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పోలీసులు తెలుగుదేశం పార్టీవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పోలీసులే టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. పుంగనూరులో కొంతమంది పోలీసులకు గాయాలైతే దాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఒక టెర్రర్ క్రియేట్ చేసి, తెలుగుదేశం వారిని గ్రామాల్లో లేకుండా తరిమేస్తోంది. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి.
పుంగనూరు ప్రాంతంలో శాంతి నెలకొల్పాలి. కేసులను బూచీగా చూపి టీడీపీ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపై దాడి అని పుంగనూరు, మదనపల్లి, అంగళ్లు లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ఎక్కడి న్యాయం, ఎక్కడి ధర్మం?. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి దాసోహం చేస్తూ, నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఆడవారు, వృద్ధులు, చిన్నపిల్లలని కూడా చూడకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
అధికార పార్టీతో పెట్టుకుంటే మీకు ఇదే గతి పడుతుందని భయపెడ్తున్నారు, ఇది చాలా అన్యాయం. ఏకేసైనా పోలీసులు పద్ధతి ప్రకారం దర్యాప్తు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులపాలౌతారు. ప్రతిదాంట్లో ఏడెనిమిది కేసులు నమోదు చేసి అదర్స్ అని రాసి కనిపించిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అదర్స్ లో ఇరికించి జైలుకు పంపాలని ప్రభుత్వం కుట్ర పన్నింది. పుంగనూరు పోలీసులు అశాంతికి కారకులౌతూ, ప్రశాంతత లేకుండా చేస్తూ, భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
ఈ అరాచకం పట్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూడా కలుగజేసుకొని ఈ హారష్ మెంట్ ని ఆపాలి. తెలుగుదేశం పార్టీ పుంగనూరులో కనపడకూడదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబితే పోలీసులు దానికి అనుగుణంగా నడుస్తారా? పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేస్తున్న భజన మానాలి. లేనివారిపై కూడా దాడి చాలా అమానుషం. ఒక్క 307 కేసుకి కోర్టు లో ఆ హరాష్ మెంట్, సందడేంటి? మీరే అరాచకం సృష్టిస్తే ఇంకెక్కడికి వెళ్లి చెప్పుకోవాలని పుంగనూరు టీడీపీ నాయకులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
ఈరోజు కోర్టులో ఒక్క కేసులో వాదించడానికి వివిధ ప్రాంతాల నుండి ఇంతమంది న్యాయవాదులు రావడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.