ప్రభుత్వం తన తప్పుల్ని,పాలనా వైఫల్యాలను పోలీసులపై నెట్టడం దుర్మార్గం

-వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేయబట్టే కడుపు మండి వాళ్లు‎ రోడ్ల మీదకు వచ్చారు
– అనగాని సత్య ప్రసాద్

ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి, మోసానికి నిరసనగా ఆక్రోశంతో నిన్న ఉద్యోగులు చేసిన ధర్నాతో ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అందుకే తన పాలనా వైఫల్యాలను ఇతరుల మీద నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పోలీసుల వైఫల్యం వల్లే ధర్నా విజయవంతం అయిందని ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటు. ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వం చేసిన మోసం, అన్యాయం పట్ల ఎంత ఆశ్రోకం, ఆవేధనతో ఉన్నారో అర్దం చేసుకుని తన తప్పులు తెలుసుకోకుండా ‎ఇది పోలీసుల వైఫల్యమని, ‎చంద్రబాబు ప్రోద్బలం అని వైసీపీ నేతలు మాట్లాడటం దివాళుకోరుతనానికి నిదర్శనం. మీ తప్పుల్ని పోలీసులపైకి నెట్టి వాళ్లను బలి చేస్తారా? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పోలీసులకు ఇదేనా మీరేచ్చే గౌరవం ఇదేనా? పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఇస్తున్నామని ప్రచారం చేసుకున్నారు తప్ప వాటిని అమలు చేస్తున్నారా? వీక్లీ ఆఫ్ లు ఇవ్వకపోగా చివరకు వాళ్లకు ఇస్తున్న జీతాలు కూడా తగ్గించటం అన్యాయం. నిన్న పోలీసులు సంయమనం తో వ్యవహరించారు. లేకుంటే తీవ్రమైన పరిణామాలు జరిగి ఉండేవి. పోలీసులను అందుకు అభినందిస్తూ..ఆదే స్పూర్తితో పనిచేయాలని టిడిపి కోరుకుంటోంది.

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది కాబట్టే వారంతా కడుపు మండి ప్రభుత్వ నిర్భందాలను చేధించుకుని మరీ రోడ్ల మీదకు వచ్చారు. వారంలో రద్దు చేస్తామన్న సీపీఎస్ 700 రోజులైనా ఎందుకు రద్దు చేయలేదు? ఉద్యోగుల జీతాల్ల కోత విధించి వెనక్కి తీసుకోవటం ఎంత వరకు న్యాయం ? పీఆర్సీపై అన్యాయం చేశారు, అదనపు ఫించను తీసేశారు. పనికి తగిన వేతనం ఇవ్వకుండా గ్రామ సచివాలయ ఉద్యోగుల శ్రమను దోపిడి చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తన తప్పుల్ని తెలుసుకోవాలి. లేకపోతే ఉద్యోగుల చేతిలో ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవటం ఖాయం. ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం పరిపాలన సాగించిన దాఖలాలు లేవు. తక్షణమే చీకటి జోవోలు రద్దు చేసి ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి. ‎

Leave a Reply