– వివేకాహత్యకేసుతో అవినాశ్ రెడ్డికి సంబంధంలేదన్న సజ్జల వ్యాఖ్యలు అతని అవగాహానారాహిత్యానికి, దివాలాకోరుతనానికి నిదర్శనాలు
• సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడా..లేక జగన్ రెడ్డి గుమాస్తానా?
• వివేకాహత్యకేసుకు సంబంధించి అన్నివేళ్లు, సాక్ష్యాలు అవినాశ్ రెడ్డివైపు చూపిస్తుంటే, ఈకుట్రలో అతనే ప్రధాన భాగస్తుడని చెబుతుంటే, సజ్జల నిర్లజ్జగా అతనికి సంబంధంలేదని ఎలా చెబుతాడు?
• అతను సలహాదారుడు అయితే ప్రభుత్వ మంచిచెడ్డల్ని దృష్టిలో పెట్టుకొని, విశాల దృక్పథంతో మాట్లాడాలి. అదే గుమాస్తా అయితే జగన్ చెప్పింది మాత్రమే చేస్తాడు
• చంద్రబాబు గారికి నిజంగా సీబీఐని ప్రభావితం చేసే శక్తే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈపాటికే ఊచలు లెక్కపెడుతుండేవాడని సజ్జల తెలుసుకోవాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వివేకాహత్యతో అవినాశ్ రెడ్డికి సంబంధంలేదన్న ప్రభుత్వసలహాదారు సజ్జల వ్యాఖ్యలు, అతని అవగాహానారాహిత్యా నికి, దివాలాకోరుతనానికి నిదర్శనాలని, హత్యకేసుదర్యాప్తులో సీబీఐ హత్యజరిగిననాడు అర్థరాత్రి నవీన్ ఫోన్ కు అవినాశ్ రెడ్డి కాల్ చేసి భారతిరెడ్డితో, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి కాల్ చేసి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడింది..ఆయాఫోన్ల కాల్ డేటా ..అదేరోజున వారున్న లొకేషన్లు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించడం చేసినా, సజ్జల ఇప్పటికీ నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్ర హం వ్యక్తంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“హూ కిల్డ్ బాబాయ్’ ప్రశ్నకు ‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’ అని సీబీఐ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లో వేసిన కౌంటర్ పిటిషన్ తో తేలిపోయింది. హత్యకేసుదర్యాప్తులో హత్యజరిగిన అర్థరాత్రి నవీన్ భారతిగారితో మాట్లాడటం, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్ తో మాట్లాడటం, వారి కాల్ డేటా సమాచారం, గూగుల్ టేకౌట్ లో వాళ్ల లొకేషన్లు సీబీఐ కనిపెట్టేసి, అవినాశ్ రెడ్డే బాబాయ్ హత్యకు ప్రధాన కారకుడని తేల్చింది నీకు కనిపించడంలేదా సజ్జలా? వివేకాహత్యకేసుకు సంబంధించి అన్నివేళ్లు, సాక్ష్యాలు అవినాశ్ రెడ్డివైపు చూపిస్తుంటే, ఈకుట్రలో అతనే ప్రధాన భాగస్తుడని చెబుతుంటే, సజ్జల నిర్లజ్జగా అతనికి సంబంధంలేదని ఎలా చెబుతాడు? అన్నీకళ్లముందు కనిపిస్తున్నా హత్యతో అవినాశ్ కి సంబంధం లేదని సజ్జల చెప్పడం అతని దివాలాకోరుతనానికి నిదర్శనం.
ప్రభుత్వంలో అంతాతానై వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వసలహాదారుడా..లేక జగన్మోహన్ రెడ్డి గుమాస్తానా?అతను సలహాదారుడు అయితే ప్రభుత్వ మంచిచెడ్డల్ని దృష్టిలో పెట్టుకొని, విశాల దృక్పథం తో మాట్లాడాలి. అదే గుమాస్తా అయితే జగన్ చెప్పింది మాత్రమే చేస్తాడు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ లో సీఎం జగన్ కు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంకా దింపుడుకళ్లం ఆశలున్నట్లు కనిపిస్తోంది.సీబీఐని చంద్రబాబు ప్రభావితంచేస్తున్నారు అని సజ్జల మతి ఉండే మాట్లాడుతున్నాడా? సీబీఐ అధికారుల్ని కూడా బెదిరించి, వారిపైకేసులు పెట్టు తెంపరితనం మీదిగానీ, చంద్రబాబు దికాదు. చంద్రబాబు గారికి నిజంగా సీబీఐని ప్రభావితం చేసే శక్తే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈపాటికే ఊచలు లెక్కపెడుతుండేవాడు.జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థుడి చేతిలో రాష్ట్రం సర్వనాశనమైపోతూ, ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునేవారుకాదు సజ్జలా?
“జగన్మోహన్ రెడ్డి మీ చిలక సీబీఐకి దొరికింది. హత్యజరిగిన నాడు మీరు, మీ ధర్మపత్ని ఎప్పుడైతే అవినాశ్ రెడ్డితో మాట్లాడారో అప్పుడే మీరుదొరికిపోయారు” అని చెప్పాల్సిన సజ్జల సిగ్గులేకుండా ఇంకా బుకాయిస్తున్నాడు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వం, ఆయన అవినీతి సొమ్ము ఆపగలదా సజ్జలా?బాబాయ్ హత్యజరిగిన ప్రదేశంలో అక్కడేఉండి అవినాశ్ రెడ్డి సాక్ష్యాలు రూపుమాపాడని సీబీఐ ఆధారాలతో సహా బయటపెట్టినా సజ్జల అతనికి సంబంధంలేదని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? సజ్జల నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచిని, క్షేమాన్ని కోరుకునేవారయితే అలా మాట్లాడడు.హత్య జరిగినప్పుడు సీబీఐ విచారణకావాలని కోరిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కు తీసుకున్నాడో చెప్పగలవా సజ్జలా జగనాసుర రక్తచరిత్ర (బహిరంగం) పుస్తకంలోని ప్రతిపేజీకి సమాధానం చెప్పే ధైర్యం నీకుందా సజ్జలా? పుస్తకంలోని అంశాలపై నాతో బహిరంగచర్చకు రాగలరా?
మీరు ఎప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీరుఅడిగే వాటికి సమాధానంచెప్పడానికి నేను సిద్ధం… మీరు సిద్ధమా సజ్జలా?మీరుచెప్పే కట్టుకథలు వినడానికి, ఇంకామిమ్మల్ని నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా సజ్జలా? అంత:పుర కుట్రలో భాగమైన బాబాయ్ హత్యకేసు నుంచి అసలు నిందితుల్ని కాపాడటం ఎవరివల్లా కాదు.వివేకాహత్య జరిగిననాడు చేయాల్సిన విషప్రచారం చేశారు. గొడ్డలివేటుకి తల రెండు ఒక్కలైతే, గుండెపోటు అన్నారు. మీ అవినీతిపత్రికలో నారాసురరక్తచరిత్ర అని దుష్ప్రచారం చేశారు.వివేకాకుమార్తె సునీత లేకపోతే, వివేకాహత్యకేసు ఇంతవరకు వచ్చేదికాదు. మీరు ఇంతచేసినా వివేకాకుమార్తె సునీత కాలికి బలపంకట్టుకొని తిరిగి, నేడు జగన్మోహన్ రెడ్డితో 7చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఆమె పోరాటానికి నిజంగా అభినందనలు తెలుపుతున్నాం. ఆమెపోరాటపటిమను యావత్ మహిళాలోకం ఆదర్శంగా తీసుకోవాలి. సీబీఐ ఇప్పటికైనా ముఖ్యమంత్రి దంపతుల్ని విచారించి, వారి కాల్ డేటాను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తున్నాం.
ముఖ్యమంత్రి కదా అని జగన్మోహన్ రెడ్డిని, భారతిదేవి ముఖ్యమంత్రి సతీమణి అని సీబీఐ వారిద్దరినీ వదలదు.బాబాయ్ ని హత్యచేసినవారితో రోజూ కలిసి భోజనంచేస్తూ, ముచ్చటిస్తున్న జగన్ రెడ్డి గుండె ఎంత కఠినమైందో, ప్రజలంతా ఆలోచించాలి. బాబాయ్ ని చంపినవారెవరో హత్యజరిగిన నాటినుంచే జగన్ కు తెలుసు. అన్నీ తెలిసే నారాసుర రక్తచరిత్ర అని, చంద్రబాబే చంపించాడని, బీ.టెక్.రవి, ఆదినారాయణ రెడ్డిల పాత్రఉందని విషప్రచారం చేశాడు. అన్నీ తెలిసికూడా హత్యోదంతంలో వ్యవహరించిన తీరు నటులకే నటన నేర్పగల సమర్థుడు జగన్ రెడ్డి అని తేలిపోయింది. వివేకాహత్యకేసు విచారణలో ముఖ్యమంత్రి దంపతులు ఏదో ఒకరోజు విచారణ ఎదుర్కోకతప్పదు.”