Suryaa.co.in

Telangana

భారతదేశానికి అది బ్లాక్ డే

– మాజీ ఎమ్మెల్సీ, న్యాయవాది ఎన్.రామచందర్‌రావు

హైదరాబాద్: 1975 జూన్ 25 న నాటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు. దాదాపు 21 నెలల పాటు ఎమర్జెన్సీ ద్వారా దేశ ప్రజలను హింసించారు, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రాన్ని అణిచివేశారు వందేమాతరం అంటే చాలు జైలు పాలు చేశారు.

దేశ నాయకులను ప్రజాస్వామ్య వాదులను జైల్లో బంధించడానికి ఆనాటి జైలు సరిపోలేదు అంటే అతిశయోక్తి కాదేమో! ఇందిరా గాంధీ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు జయప్రకాష్ నారాయణ అటల్ బిహారీ వాజపేయి, అద్వానీ జి, జార్జ్ ఫెర్నాండేజ్ లాంటి అనేకమంది నాయకులు ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఉద్యమించారు.

ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ హైకోర్టు మెయిన్ గేట్ నందు న్యాయవాదులు బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు. బిజెపి లీగల్ సెల్ మరియు ఎమర్జెన్సీ ని వ్యతిరేకించే న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ సీనియర్ న్యాయవాది ఎన్ రామచంద్ర రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని విమర్శించారు. ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నియంత విధానాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఇందిర కంటే రాహుల్ పెద్ద నియంత అని విమర్శించారు. ఎమర్జెన్సీ రోజుల్లో దొరికిన ఆణిముత్యాలను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.

LEAVE A RESPONSE