Suryaa.co.in

Andhra Pradesh

గంజాయిని ఏపీకి పరిచయం చేసింది వైసీపీయే!

– యువత మాదక ద్రవ్యాల కు బానిస అవ్వడానికి ఎమ్మెల్యే జగనే కారణం
– మాదకద్రవ్యాల దగ్గరకు వెళితే కుటుంబం గుర్తుకు రావాలి
– ఎన్డీఏ కూటమి ఏర్పడడంతో గంజాయిపై ఉక్కుపాదం
– ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీలో మంత్రి సవిత

పెనుకొండ: గంజాయిని రాష్ట్రానికి పరిచయం చేసింది వైసీపీ పార్టీ అని మంత్రి సవిత విమర్శించారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా దర్గా సర్కిల్ తెలుగు తల్లి సర్కిల్ వరకు విద్యార్థులు, మహిళా సంఘాలు అధికారులు కలిసి నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.

సమాజానికి చెడు చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించమన్నారు. అందరూ కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగ పనిచేయాలంటూ ప్రతిజ్ఞ చేయించారు. మాదక ద్రవ్యాలు వాడిన వారు తన అమ్మ, సోదరి, కూతురు అని చూడకుండా ఎన్నో అఘాయిత్యాలకు పాటు పడ్డారని, గత ప్రభుత్వ హయంలో జగన్ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి వైపు కాకుండా మాదక ద్రవ్యాల ప్రదేశ్ గా మార్చారన్నారు.

గంజాయి గురించి తెలీయక పంటలు పెట్టిన వారికి ఉపాధి చూపించి, సంఘ విద్రోహమైన మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకుండా వారికి భవిత చూపిన ఘనత కూటమి ప్రభుత్వందని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మహిళలు, మహిళా సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE