Suryaa.co.in

Andhra Pradesh

గీతాంజలిని హత్య చేసింది వైసీపీనే

– ఆడబిడ్డ చావుపైనా శవ రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ఏమనాలి?
– తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసీపీనే హత్య చేసింది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారతాడని, ఆడపిల్ల చావును కూడా శవ రాజకీయాలకు వాడుకుంటాడని చెప్పడానికి గీతాంజలి మృతిపై చేస్తున్న శవ రాజకీయమే నిదర్శనం. అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి, హత్య అని ఒకసారి, ఆత్మహత్య అని ఒకసారి ఇలా రకరకాలుగా వైసీపీ నేతలు మాట్లాడారు.

యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేసుకునే గీతాంజలి బాగా మాట్లాడుతుందని గుర్తించిన వైసీపీ నేతలు ఆమెతో కొన్ని వీడియోలు చేయించి డబ్బు ఇచ్చేవారు. ప్రతిరోజూ తెనాలి నుంచి విజయవాడకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో వస్తూండేది. రోజువారీ ఖర్చుల కింద గీతాంజలికి వైసీపీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లేవి. 7వ తేదీన గీతాంజలి చనిపోయింది. ఆమెతో పాటు తెనాలి రైల్వే స్టేషన్ లోనే ఉన్న ఆ ఇద్దరి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదు? సీసీ ఫుటేజ్ ఎక్కడ? చనిపోయాక కూడా ఆమెను గుర్తు తెలియని శవంగా రెండు రోజులు ఆస్పత్రిలో ఎందుకు అట్టిపెట్టారు?

టీడీపీ సోషల్ మీడియా ప్రచారం వల్లే గీతాంజలి చనిపోయిందని ఆమె భర్తతో వైసీపీ వాళ్లు కంప్లైంట్ ఇప్పించారు. 7న చనిపోతే గీతాంజలి చనిపోతే 11న ఆమె భర్తతో టీడీపీ ట్రోల్స్ వల్లే చనిపోయిందని కంప్లైంట్ ఇప్పించారు . నారా లోకేష్ అకౌంట్ నుంచి ట్వీట్ పెట్టినట్టు ఒక ఫేక్ ట్వీట్ పెట్టి, ఆడపిల్ల చావును కూడా మీ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేశారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపాలి. మీ కోసం పనిచేసిన ఆడపిల్ల చనిపోతే గుర్తించని శవంగా రోజుల తరబడి ఉంచేస్తారా? కుటుంబసభ్యులకు అప్పగించరా?

అసలు ఆడబిడ్డల చేత తప్పుడు వీడియోలు చేయించడమేంటి? గీతాంజలికి 8 ఏళ్ల కుమారుడు ఉంటేఐదేళ్లుగా అమ్మఒడి ఎలా వస్తోంది? మీ అరాచకాలపై ప్రశ్నిస్తే దుష్ప్రచారం చేస్తున్నారు. గీతాంజలి చావు విషయంలో రాజకీయ లబ్ధికి పాకులాడటం దుర్మార్గం. శవాలతో రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి బాగా అలవాటు. బాబాయ్ హత్య, కోడికత్త అంశాల్లోనూ ఇదే విధంగా చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో మహిళలపై నీచపు ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిని బలి తీసుకుని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఆడబిడ్డ చావునూ వదలని జగన్ రెడ్డిని ఏమనాలో అర్ధం కావడం లేదు. జగన్ రెడ్డికి అతి త్వరలో ప్రజలే బుద్ధి చెప్తారు.

LEAVE A RESPONSE