Suryaa.co.in

Andhra Pradesh

సునీత టీడీపీ పులివెందుల అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదు

– వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్సార్ జిల్లా మేయర్ సురేష్ బాబు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య పై ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం. హత్య జరిగిన సమయంలోనే వివేకా నుదుటి పై , వెనుక వైపు గాయాలు ఉన్నాయని ఎంపీ వైఎస్ అవినాష్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వైఎస్ అవినాష్ గుండెపోటు అని చెప్పారని దుష్ప్రచారం.

అప్పటి ఇంటలిజెన్స్ డిజి ఏబీ వెంకటేశ్వర రావు కనుసన్నల్లో అధికారులు నడిచారు. అప్పట్లో మాట్లాడిన వాయిస్ అన్ని ఛానెల్స్ దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు వివేకా కుమార్తె సునీత ఇలా మాట్లాడటం వెనుక టీడీపీ నేతల కుట్రలు. పరమేశ్వర రెడ్డి హత్య జరిగిన మరుసటి రోజు ఓ లాడ్జి కి పిలిపించి మాట్లాడిన విషయం వాస్తవం కాదా? సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. బిటెక్ రవి, సూర్యప్రకాష్ రెడి, వివేకా అల్లుడు నరెడీ రాజశేఖర్ రెడ్డి ని కూడా విచారణ జరపాలి. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్ లో సునీత టీడీపీ పులివెందుల అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవల్సిన అవసరం లేదు. తిరిగి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీ లోకి వచ్చినా చూస్తూనే ఉండాలి. టీడీపీ అధినేత చంద్రబాబు ఉచ్చులో సునితమ్మ పడినట్లు ఉంది. ప్రతి రోజు ఎల్లో మీడియా ద్వారా విష దుష్ప్రచారం చేస్తున్నారు. కర్త ,కర్మ క్రియ కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఆయన్ను విచారించాలి. కుట్రదారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి:
వైఎస్ వివేకా వ్యక్తిత్వం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం. అజాత శత్రువు గా , ప్రజల మనిషిగా ప్రసిద్ధి.అటువంటి మనిషి హత్యకు గురి అవ్వడం నిజంగా బాధాకరం. హత్య జరిగే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని వివేకా స్పష్టం చేశారు. వివేకా కుమార్తె సునితమ్మ అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ పై వచ్చిన ఆరోపణలపై ఖండించారు. కుటుంబ సభ్యులు ఎందుకు హత్య చేస్తారని మండిపడ్డారు. ఎంపీ వైఎస్ అవినాష్ పై అనవసరంగా నిందలు మోపాలని చూస్తున్నారు. హత్య జరిగిన సమయంలో మీడియాతో ఎంపీ వైఎస్ అవినాష్ మాట్లాడిన వీడియోలను చూపిన ఎమ్మెల్యే.

హత్య పై అనుమానాలు ఉన్నాయని ఎంపీ స్పష్టం చేశారు..హత్య జరిగిన మూడేళ్ళ తర్వాత ఇప్పుడు టీడీపీ నేతలు ఎంపీ పై దుష్ప్రచారం.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గుణం, వ్యక్తిత్వం మంచి తనం జిల్లా ప్రజలకు తెలుసు. దివంగత రాజారెడ్డి ని, వంగవీటి ని హత్య చేసింది ఎవరనేది అందరికి తెలుసు. సునితమ్మ దయచేసి చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు. హత్య ఎవరు చేసారనేది ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. వివేకా హత్య కేసులో సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.

LEAVE A RESPONSE