Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర సంపదను జలగల్లా పీలుస్తున్న జగన్‌ అండ్‌ కో

-జగన్‌ను చూసి అవినీతికి పాల్పడుతున్న ఆయన దండు
-అవినీతిని ఏకీకృతం చేసిన ఘనుడు జగన్‌
-సత్తెనపల్లి నియోజకవర్గం చౌటపాపాయపాలెం బహిరంగసభలో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ

2019లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి తండ్రిని మరిపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక తన తండ్రిని రాష్ట్ర ప్రజలు తిట్టేలా చేస్తున్నాడు. రాష్ట్ర సంపద మొత్తాన్ని ఏకీకృతం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే దోచుకుంటోంది. జగన్ ను చూసి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన 4నెలల్లో నేను బెంగళూరు వెళ్లినప్పుడు అనంతపురంజిల్లాకు చెందిన జర్నలిస్టు వైసీపీ నాయకుడి వాయిస్ నాకు వినిపించాడు. అందులో కర్ణాటక నుండి లిక్కర్ తెచ్చి అనంతపురం, చిత్తూరుజిల్లాలో హోమ్ డెలివరీ చేస్తున్నారని తెలిసింది. ఆ నాయకుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం కోట్లు ఖర్చుపెట్టాం..కానీ జగన్ ఒక్కడే సంపదను దోచుకుంటున్నాడు..మేం బ్రతకొద్దా అని మాట్లాడాడు.

ఈ విధంగా వైసీపీ నాయకులు పోటీ పడి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారు. వైసీపీ నాయకుల దోపిడీకి పోలీసులు సహకరిస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించిన టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు.ఇటీవల చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లినప్పుడు చిత్తూరుజిల్లాలో వైసీపీ నాయకులు రాళ్లదాడి చేయడమే కాకుండా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.

ఇలాంటి దుర్మార్గపు పాలకులను గద్దె దించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు సీఎం అవుతారు. సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.

LEAVE A RESPONSE