Suryaa.co.in

Andhra Pradesh

వన్ టైం సెటిల్మెంట్ కింద జగన్ ప్రభుత్వం రూ.4,800కోట్ల వసూలుకి సిద్ధమైంది

– ఎన్నికలకు ముందు పేదలకు రూ.3లక్షలవరకు గృహరుణాలు మాఫీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి
– నేడు పేదలు తమకష్టార్జితంతో నిర్మించుకున్నఇళ్లపేరుతో వసూలుచేయడమేంటి?
– జగనన్న శాశ్వత గృహహక్కు పేరుతో ప్రభుత్వమిచ్చిన జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్
తుగ్లక్ పాలనకు అసలైన నిదర్శనంగా, నేడు జగన్మోహన్ రెడ్డి తీసుకుం టున్న నిర్ణయాలు ఉంటున్నాయని, ఎన్నికలకు ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడంలో ముఖ్యమంత్రి ఆరితేరాడ ని, ఏరుదాటేవరకు ఓడమల్లన్న అని, ఏరుదాటాక బోడిమల్లన్న అనే సామెత, జగన్ లాంటివ్యక్తుల వల్లే వాడుకలోకి వచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు కూనరవికుమార్ ఎద్దేవాచేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో రూ.4,800కోట్లు ప్రజలనుంచి కొట్టేసేలా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్న శాశ్వత గృహహక్కు పథకానికి రూపకల్పన చేసిందన్నారు. పేదలు వారి పూర్వీకులనుంచి వారసత్వంగా వచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే, వాటికి ప్రభు త్వానికి పన్నుకట్టాలని వైసీపీ రౌడీలైన వాలంటీర్లు ఇళ్లునిర్మించుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆఖరికి పేదలపీకలపై కత్తిపెట్టడానికికూడా వైసీపీనేతలు, కార్యకర్తలు వెనుకాడటంలేదని రవి కుమార్ తెలిపారు. పేదవాడిసొంతింటి కలను నిజంచేయడంకోసం స్వర్గీయ ఎన్టీఆర్ పక్కాగృహాలను నిర్మిస్తే, చంద్రబాబునాయుడు గారు దాన్ని నిర్విరామంగా కొనసాగించారు తప్ప, ఏనాడూ వారిపేర్లను పేదల కోసం నిర్మించే పక్కాగృహాలకు పెట్టలేదన్నారు.
కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరోపేదలకోసం కట్టించిన ఇళ్లకు తనపేరు పెట్టాలని, తనప్రభుత్వమే కట్టించిందని చెప్పాలనడం వింతధోరణి కాక మరేమిటన్నారు. కనీసం ప్రజలసొమ్ము జీతంగా తీసుకుంటున్న ప్రభుత్వసలహాదారులుకూడా ఈ విషయంలో ముఖ్యమంత్రికి ఎందుకు సలహాఇవ్వడంలేదని రవికు మార్ ప్రశ్నించారు. 1983లో మొట్టమొదటిసారి రూ.7వేలతో పక్కా గృహాలనిర్మాణం రాష్ట్రంలో ప్రారంభమైందని, తరువాత వచ్చిన అనేక ప్రభుత్వాలు ఇళ్లనిర్మాణానికి సబ్సిడీపై పేదలకు రుణాలు అందించాయన్నారు.
కానీ జగన్ ప్రభుత్వం 1983నుంచి 2011 వరకు, రాష్ట్రంలో ఇళ్లునిర్మించుకున్న పేదగృహస్తులనుంచి, ఒక్కొక్కరి నుంచి రూ.10వేలవరకు వసూలుచేయడానికి సిద్ధమైందన్నారు. దానికే ఈ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ అనేపేరుతో, జగనన్న శాశ్వతగృహ హక్కు పథకమంటూ రూ.4,800కోట్లను రాబట్టేందుకు సిద్ధమైందన్నా రు. ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చిందన్న కూన, లబ్ధిదారులకు డబ్బులు చెల్లించలేమనే ఆప్షన్ కూడా లేకుండా చేసిందన్నారు.
ఇప్పటికే వాలంటీర్లు, గృహనిర్మాణ శాఖాధికారులు, రాష్ట్రమంతా తిరిగి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద 40లక్షలమంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వారిలో 8లక్షలమం ది జగనన్నశాశ్వత గృహహక్కు కింద డబ్బులుచెల్లించడానికి సిధ్ధమైతే, మిగిలిన 32లక్షలమంది చెల్లించబోమని తెగేసి చెప్పడం జరిగిందన్నా రు. కానీ అహంకారపూరితుడైన జగన్మోహన్ రెడ్డి , ఆయనప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ గృహనిర్మాణ లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకొస్తోందన్నారు.
చాలాప్రాంతాల్లో ఇళ్లలబ్ధిదారులు, డబ్బులుకట్టేది లేదని అడ్డం తిరుగుతున్నారన్నారు. దాదాపు 30 ఏళ్లక్రితం ఇళ్లునిర్మిం చుకున్న లబ్ధిదారులనుంచి కూడా ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో వసూళ్లు చేయడమేంటని రవికుమార్ ఆగ్రహంవ్యక్తంచేశారు. జగన్ ప్రభుత్వంఇళ్లనిర్మాణానికి ఎక్కడా గజం స్థలంఇవ్వకుండా, బొచ్చెఇసుక, పది ఇటుకలుకూడా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ల పేరుతో, గృహస్తులనుంచి డబ్బులు వసూలుచేయడం ముమ్మాటికీ క్షమించరా ని నేరమన్నారు. సామాన్యులు తాము డబ్బులు చెల్లించమంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం వారిని వారిఇళ్లు వారికి దక్క కుండాచేస్తామని బెదిరింపులకు దిగుతోందన్నారు.
ఇళ్లరిజిస్ట్రేషన్ పేరుతో వారినుంచిడబ్బులు గుంజడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవడా న్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గతఎన్నికలకు ముందు ఇళ్లనిర్మాణాల తాలూకా ప్రజలు తీసుకున్న రూ.3లక్షల రుణాలను తన ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గృహాలునిర్మించుకున్న 46లక్షలమంది లబ్ధిదారులనుంచి, రూ.10వేలచొప్పున వసూలుచేయడానికి సిద్ధమయ్యాడన్నారు. 1983 నుంచి 2011 ఆగస్ట్ వరకు రాష్ట్రంలోని గ్రామీణప్రాంతాల్లో 41లక్షలఇళ్లు, పట్టణప్రాంతాల్లో నిర్మించిన 5లక్షలఇళ్లపై జగన్ ప్రభుత్వం ఓటీఎస్ కింద వసూళ్లు చేయడానికి సన్నద్ధమైందన్నారు.
గ్రామీణప్రాంతాల్లో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలను జగన్ ప్రభుత్వం ఓటీఎస్ కింద వసూలు చేస్తోందన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీ లకింద తాముకోరినంత చెల్లించకపోతే, భవిష్యత్ లో రిజిస్ట్రేషన్లకోసం రెట్టింపుఫీజు చెల్లించాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం చెబుతోందన్నారు. ఎవరి ఇంటిని ఎవరిపేరుతో రిజిస్ట్రేషన్ చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధ మైందన్న కూన, 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నఇళ్లపై , లబ్దిదా రులకు హక్కులేదనిచెప్పడం విడ్డూరం కాక ఏమిటన్నారు. దశాబ్దాల నుంచి పేదలు నివాసముంటున్నఇళ్లను, వారివి కావంటూ ప్రభుత్వం బెదిరించడం జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమన్నారు.
రాష్ట్రం ఏర్పడింది మొదలు అనేకమంది ముఖ్యమంత్రులయ్యారని, కానీ ఏ ఒక్కరూ కూడా పేదలనుంచి ఈ విధమైన వసూళ్లకు పాల్పడలేదని రవికుమార్ తెలిపారు. వాలంటీర్లు, వైసీపీకార్యకర్తలు ఇళ్ల రిజిస్ట్రేషన్లకు డబ్బుకట్టమని బెదిరించినా ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని రవి కుమార్ తేల్చిచెప్పారు. ఇళ్లు నిర్మించుకున్న పేదలనుంచి రూ.4,800 వసూలుచేయడానికి సిద్ధమైన జగన్ ప్రభుత్వనిర్వాకాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తే, జగన్ గెజిట్ పత్రికైన సాక్షిలో మాత్రం, పేదలకు వారిఇళ్లపై ముఖ్యమంత్రి హక్కుకల్పిస్తున్నారంటూ గారడీ రాతలు రాసింది. పేదవాడికి సొంతింటి నిర్మాణమనే హక్కుని కల్పించా ల్సిన బాధ్యత ప్రభుత్వాలపైఉందన్నారు. అది వాటిబాధ్యతే గానీ, ప్రజలకు ఇస్తున్న అవకాశంకానేకాదన్నారు.
వన్ టైమ్ సెటిల్మెంట్ కింద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమిచ్చిన జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రవికుమార్ డిమాండ్ చేశారు. 12 ఏళ్లపాటు పేదలు నివాసమున్న ఇళ్లు, స్థలాలు వారికే సొంతమవుతాయన్న కూన … వాటికి ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎలాంటి కప్పంకట్టాల్సిన పనిలేదన్నారు. ముఖ్యమంత్రి తనఅవినీతిని తగ్గించుకుంటే, రాష్ట్రంలోని పేదలకు సొంతిళ్లు నిర్మించడం ప్రభుత్వానికి పెద్దకష్టమేం కాదన్నారు.

LEAVE A RESPONSE