Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింల అభివృద్ధిని పట్టించుకోని జగన్‌!

• ఇమామ్, మౌజమ్ లకు ఆరు నెలల బకాయిలు రూ.45 కోట్లు ఒకేసారి విడుదల
• వైసీపీ పెట్టిన బకాయిలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
• 2024-25 ఆర్థిక బడ్జెట్ లో ముస్లిం మైనార్టీలకు రూ.4,376 కోట్లు కేటాయింపు
• గత ఐదేళ్ల వైసీపీ హయాంలో మైనార్టీలకు రక్షణ లేదు
• పాదయాత్రలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ రెడ్డి అమలు చేయలేదు
• చంద్రబాబు హయాంలో అమలు చేసిన పథకాలు జగన్ రద్దు చేశారు
• ముస్లిం మైనార్టీలకు అండగా చంద్రబాబు ప్రభుత్వం ఉంది
– ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షరీఫ్

అమరావతి: ముస్లిం మైనార్టీలకు తెలుగు దేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అండగా నిలుస్తూ వస్తుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు ఇమామ్ మౌజమ్ లకు గౌరవ వేతనం ఆరు నెలల బకాయిలు విడుదల చేసిన సందర్భంగా ముస్లిం మైనార్టీల తరఫున సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో ముస్లిం మైనార్టీలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇమామ్, మౌజమ్ లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా నిలపుదల చేశారని ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షరీష్‌ ఆరోపించారు. ఆరు నెలల బకాయిలు రూ.45 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తం నిధులను ఏప్రిల్ నెల నుంచి ఇమామ్ మౌజమ్ లకు అందుతాయి.

ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని… చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు అధిక నిధులు బడ్జెట్ లో కేటాయించి న్యాయం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్వభావం చంద్రబాబుది అయితే… ఇచ్చిన మాట మరిచిపోయి ద్రోహం చేయడం జగన్ రెడ్డి స్వభావం. జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు మైనార్టీలను దోకా చేశారు.

ఇచ్చిన ఏ హామీని అమలు చేయకపోగా 2014- 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలను రద్దు చేసి ముస్లిం మైనార్టీలకు తీరని ద్రోహం చేశారు. ఇమామ్ మౌజమ్ లకు ఇప్పటికే ప్రభుత్వం రూ.90 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇమామ్లకు రూ.10 వేలు, మౌజామ్లకు రూ.5 వేల చొప్పున నెలకు గౌరవ వేతనం లభిస్తుంది.

LEAVE A RESPONSE