రైతులను పరామర్శించే తీరిక ప్రభుత్వానికి లేదా.?
మోటార్లకు మీటర్లు పెడితే తాడేపేడో తేల్చుకుంటాం
అసని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ వ్యయసాయ స్టీరింగ్ కమిటీ పర్యటన
టీడీపీ నేతలకు గోడు వెళ్లబోసుకున్న రైతులు
రైతులకు తక్షణమే పరిహారం ప్రకటించాలని టీడీపీ డిమాండ్
తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రభుత్వానికి తీరిక కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసని తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గంలోని తోటవల్లూరులో శుక్రవారం టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పర్యటించారు. పంటలను పరిశీలించే సందర్భంలో మొక్కజొన్న, అరటి రైతులు తమ బాధలను టీడీపీ నేతలతో పంచుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులను విస్మరించారని పేర్కొన్నారు. సబ్సీడీలేవీ ప్రభుత్వం నుండి అందడంలేదని తెలిపారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని రైతుల ఆవేదనలో ఉన్నారు. మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రూ.20 వేల కోట్ల మేర రైతులు నష్టపోయారు. రైతులకు ప్రభుత్వం కేవలం రూ.1600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్లారు. వ్యవసాయ మీటర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదు. తుఫాన్ అంచనా వేయడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా గోదావరి జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.75వేలు పెట్టుబడిపెట్టి రూ.30 వేలు కౌలు వెచ్చించి రైతులు పొలాలు సాగు చేస్తున్నారు. అరటి సాగు చేసిన రైతు ఎకరాకు రూ.1.35వేల నష్టం వాటిల్లింది. ఇన్ పుట్ సబ్సీడీని టీడీపీ రూ.3,750కోట్లు ఇచ్చింది. అంతకంటే ఎక్కువ తుపాన్ లు ఇప్పుడు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన తుఫాన్ వల్ల 53 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 20,300 కోట్లు రైతులకు నష్టం జరిగిందని వాళ్లే అంచనా వేశారు. పరిహారంలోనూ అవకతవకలకు పాల్పడ్డారు.
పార్టీలు చూసి పరిహారం ఇస్తున్నారు. మూడేళ్లలో 8 సార్లు వరదలు వచ్చాయి. ఏన్డీఆర్ ఫాంలో హెక్టారుకు పదివేలు ఉంటే మేము ఇరవై వేలు ఇచ్చాం. అరటికి రూ.30 వేలు ఇచ్చాం. వరికి వైసీపీ ప్రభుత్వం రూ.15వేలు, అరటికి రూ.25వేలు మాత్రమే ఇస్తున్నారు. జొన్నకు టీడీపీ హెక్టారుకు రూ.10 వేలు ఇస్తే 6,800 మాత్రమే ఇస్తున్నారు. ఆపరాలు పొద్దు తిరుగుడుకు టీడీపీ హెక్టారకు రూ.10 వేలు ఇస్తే ఈ ప్రభుత్వం రూ.4వేలు మాత్రమే ఇస్తోంది. జీడిపంటకు టీడీపీ రూ.30 వేలు ఇస్తే ఈ ప్రభుత్వం 20 వేలే ఇస్తోంది. మామిడికి రూ.30 వేలు టీడీపీ ఇస్తే..వీల్లు 20 వేలే ఇస్తున్నారు. మూడేళ్లుగా వరి రైతులకు ఉరి తాళ్లే మిగిలాయి. మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. అప్పు తెచ్చుకునేందుకు మీటర్లు పెడుతున్నారు. దుర్మార్గంగా అన్ని రేట్లు పెంచుతున్నారు. సీఎంగా ఏం చేస్తారో జగన్ చెప్పడం లేదు. వ్యవసాయంలో టీడీపీ 11శాతం వృద్ధి రేటు సాధిస్తే..అది ఈ రోజు ఏమైంది.? భూసార పరీక్షలు ఎందుకు ఆపేశారు.? రైతుల దిగుబడి పెరిగితే ఓర్చుకోలేరు.? మైక్రో ఇరిగేషన్ ఆపేశారు. ఏడాదికి యాంత్రీకరణ కింద రూ.5వందల కోట్లు ఖర్చే చేశాం. దమ్ముంటే వ్యవసాయంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. రైతాంగాన్ని సర్వ నాశనం చేశారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. మీటర్లు పెడితే తాడోపేడో తేల్చుకుంటాం’’అని హెచ్చరించారు.
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నారాయణ మాట్లాడుతూ.. ‘‘రైతులను చంద్రబాబు ఏవిధంగా ఆదుకున్నారో జగన్ తెలుసుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారు. రైతులకు ప్రభుత్వ అండగా నిలబడకపోతే ఎవరు నిలబడతారు.? రైతులకు పెద్ద ఎత్తున సబ్సీడీలు అందించిన ఏకైక సీఎం చంద్రబాబు ఒక్కరే సీఎంగా జగన్ పూర్తి వైఫల్యం చెందారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులకు ఆధారాలు లేకపోవడం వల్లే బెయిల్ వస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వానికి చెప్తున్నాం..వాటిని సరిదిద్ధుకుంటే బాగుంటుంది. ఉద్యోగస్తులు కూడా మోసపోయారు.
ఏ పుత్రున్నీ టీడీపీ నమ్ముకోలేదు. పరిస్థితిని బట్టే టీడీపీ పొత్తు పెట్టుకుంది. వైసీపీకి పొత్తులపైన అవగాహనే లేదు. రాబోయే ఓటమిని ఊహించుకుని పీడకలలు కంటున్నారు. పాలన సరిదిద్ధుకునే చర్యలు జగన్ చేయడం లేదు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసేందుకు 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేసి కూడా ఏం సాధించగలిగారు..చంద్రబాబు నిజాయితీ ఉన్న వ్యక్తి’’అని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తుంటే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లేకుండా జనంలోకి వెళ్తే తెలుస్తుంది ఎంత వ్యతిరేంగా ఉన్నారో. గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వైసీపీ నేతలకు ఎదరవుతోంది. గ్రామాల్లోకి జగన్ వెళ్లాలని చెప్తున్నా జనాన్ని చూసి భయపడుతున్నారు. 2024 వరకు ప్రభుత్వాన్ని నడపలేక జగన్ ముందస్తు ఎన్నికలకు చూస్తున్నారు. ప్రజల బాగోగుకోసం కలిసి పోటీ చేసిన పార్టీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వందలాది కేసులు పెట్టుకుని, రాష్ట్రాన్ని మూడేళ్లుగా నాశనం చేసిన వైసీపీతో కలిసేందుకు ఎవరైనా ఉన్నారా..? మేము ఎవరితో కలుస్తామో చెప్పలేదు. ఆర్థిక సంక్షోభంతో 2024 వరకు ప్రభుత్వాన్ని నడపలేక ముందస్తుకు వెళ్లాలని చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ప్రజలు గుణపాఠం చెప్తారు’’అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పామర్రు ఇంఛార్జ్ వర్ల కుమార్ రాజా, ఎంజీఎర్ఈజీఎస్ సభ్యులు వీరంకి గురుమూర్తి, పలువురు టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.