– ఇలాంటి బుద్ధి ఆలోచన ఇచ్చిన మీరు నమ్మే జీసస్ కి కూడా ధన్యవాదాలు
– ఇకపై మాకు టికెట్లు ఇవ్వకుండా మీ పాపపంకిలాన్ని మాకు అంటించకండి
– ప్రపంచ మానవాళి చరిత్రలో, తెలుగుజాతి చరిత్రలో మాస్థానం పదిలం
– భయం అనేది మా కమ్మ డీఎన్ఏ లోనే లేదు
– అన్నికులాల వాళ్ళూ మాకు ఆత్మీయులే
– సీఎం జగన్‌కు ప్రపంచ కమ్మ సంఘం లేఖ
ప్రపంచ కమ్మ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా….!
గతమెంతో ఘనకీర్తి కలవోడా…!
ప్రపంచ చరిత్రలో ఇంతవరకూ ఒకజాతి/ఒకరాష్ట్రం/ఒకసమాజం యొక్క నిర్మాణంలో అభివృద్ధిలో మాత్రమే భాగస్వాములుగా ఉంటూ మార్గదర్శకులుగా ముందుండి నడిపించే మా కమ్మకులం, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక ఆర్ధిక సాంఘిక విధ్వంసంలో వినాశనంలో మాపాత్ర, మాపేరు, మాప్రమేయం ఏమాత్రం లేకుండా చేసినందుకు మీకు మా ప్రపంచ కమ్మసంఘం తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము.
ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన చారిత్రాత్మక అభివృద్ధిలో వ్యవసాయం శాస్త్ర సాంకేతిక పరిశోధన అభివృద్ధి వాణిజ్య- వ్యాపార- పారిశ్రామిక- న్యాయ -అధికార రాజకీయ- సాంస్కృతిక- సాహిత్య -సినీపరిశ్రమ- నటన -హేతువాద- ఆధ్యాత్మిక- భక్తి -సేవా- పత్రిక- ప్రింటింగ్ -కళలు -సామాజికాసేవ -విద్య -వైద్యం మౌలికవసతులు- అభివృద్ధి లాంటి అన్ని రంగాల్లో దిక్చూచిగా మార్గదర్శనంగా నాయకత్వంతో భాగస్వామ్యంగా ముందుండి సమాజానికి హితోధిక సాయంచేస్తూ సాటి పదిమందికి ఉపయోగపడుతూ, మేము సంపాదించింది సమాజంలో పదిమందికి పంచుతూ, సమాజంలో అందరినీ సమభావంతో సాటి మనుషులు అందరూ అన్ని కులాలు వర్గాలు మతాల వారు అందరూ మాసొంత కుటుంబమే అన్న విశ్వభావంతో మసులుకుంటూ, తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు గౌరవం తీసుకొచ్చి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినది మా కమ్మకులం, ఇది చారిత్రక సత్యం, ఎవరో కిరాయి వ్రాతలు వ్రాస్తే వచ్చేది/వచ్చింది కాదు, ఇది కళ్ళముందు నిరూపించబడే వాస్తవం.
ప్రపంచ మానవాళి చరిత్రలో, తెలుగుజాతి చరిత్రలో మాస్థానం పదిలం, అల్పులు అర్భకులు మమ్మల్ని చేరుకోలేక మామీదపడి ఏడుస్తుంటారు, వాళ్ళు అలా ఏడుస్తూనేఉంటారు, మేము ఇలా ఎప్పటికీ అన్నిరంగాల్లో అగ్రగామిగా ముందుకెళుతూనే ఉంటాము…వాళ్ళ ఏడుపులే మాకు శ్రీరామరక్ష.
మేము ఎవరికీ శత్రువులంకాదు, మాకు ఎవరూ శత్రువులులేరు ఉండరు….ఎందుకంటే మాకు సమాజం అభివృద్ధి మానవత్వం సమానత్వం ముఖ్యం కాబట్టి.!
చరిత్ర పుటలు తిరగేస్తే మాకమ్మకులం స్థానం ఎన్నటికీ పదిలం శాశ్వతం, ఇలా మా కమ్మకులం ప్రపంచంలో అన్నిరంగాలలో ఇకమీద కూడా ముందుంటూనే ఉంటుంది, మా ఈ యాత్ర ఈ జైత్రయాత్ర ఇలా కొనసాగుతూనే వుంటుంది, మా కమ్మ కులం చేసిన సామాజికాసేవా సౌరభం గుభాళింపులు పోరాటాలు ఉద్యమాలు సామాన్యులకు బలహీనులకు కనిపించవు, మేమంటే ఉన్మాదులకు సంఘవి ద్రోహులకు అసాంఘిక శక్తులకు అవినీతిపరులకు వెన్నులో వణుకు.
తెలుగు జాతికి మూలమైన అలనాటి శాతవాహన కాకతీయ విజయనగర చరిత్రలను, స్వాతంత్రోద్యమాన్ని తెలంగాణా సాయుధ పోరాటాన్ని భూపోరాటాలను రైతుకూలీ ఉద్యమాలను తిరగేస్తే ప్రతి పుటలోనూ కనిపించేది మేమే.!
మేమంటే దోపిడీదారులకు ప్రజాస్వామ్య వ్యతిరేకులకు ప్రజాకంఠకులకు అభిజాత్యులకు సింహస్వప్నం, మేము ఎక్కడైనాసరే ఒక్కడిగాఉన్నా గుప్పెడు ఉన్నా కూడా మా మనుగడ గుర్తింపు స్థానం విజయం ప్రత్యేకం, మేము ఎవడికీ తలవంచేదిలేదు, భయపడేది అంతకంటేలేదు, భయం అనేది మా కమ్మ డీఎన్ఏ లోనే లేదు, ఉండదు, భయస్తులు పిరికివాళ్ళు మోసగాళ్ళు ద్రోహులు, అధికారంకోసం హత్యలుచేసేవాళ్ళు నమ్మి ఆశ్రయమిచ్చినవాళ్లను అన్నంపెట్టినవాళ్లను హతమార్చేవాళ్ళు మాకమ్మకులంలోనే ఉండరు ఉండబోరు.
మాకు గ్రామస్థాయిలోని సమాజంలోని అన్నికులాల వాళ్ళూ మాకు ఆత్మీయులే, మా అభివృద్ధిలో మాల మాదిగ కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత కల్లుగీత యాదవ గౌడ కాపు కంసాలి సాయీబ్బు మత్స్యకారి ఎరుకల యానాది బ్రాహ్మణ కరణం రెడ్డి వెలమ ఇలా అన్నికులాలవాళ్ళు ఉన్నారు,వాళ్లకు మేము ఎల్లవేళలా కృతజ్ఞతాభావంతో ఉంటాము, వాళ్ళు అందరూ ఎల్లవేళలా ఎల్లప్పుడూ మాకు సొంత కుటుంబసభ్యులు ఆత్మీయులే.! మా అభివృద్ధిలో భాగమైన పైవర్గాలు వర్ణాలు వాళ్ళు అందరికీ మాకమ్మకులం ఎల్లప్పుడూ పాదాభివందనాలు చేస్తుంది, మాకు భేషజాలు లేవు, ఉండవు.
ఎందుకంటే మేము గతం మరవము, మేము కృతఘ్నులంకాదు, మేము తిన్నఇంటి వాసాలు లెక్కించేవాళ్ళం కాదు, అన్నం పెట్టినవాళ్లను చంపేవాళ్ళం అసలే కాదు, మేము భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని చట్టాలను న్యాయాన్ని ధర్మాన్ని సమాజాన్ని మనుషులను అన్నికులాలను అన్నివర్గాలను అన్నీమతాలను గౌరవిస్తాము. ప్రేమిస్తాము. అనుసరిస్తాము, మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎంతటివాడినైనా సహించేదిలేదు.!
నేడు మీరు పొందిన అధికారం ద్వారా చేస్తున్న సామాజిక ఆర్ధిక సాంఘీక నైతిక విధ్వంసంలో వినాశనంలో, మీ అవినీతి దోపిడీలో, మీపాపంలో ప్రత్యక్షంగా మాపాత్ర ఏమాత్రం లేకుండా మమ్మల్ని పక్కన పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఇలాంటి ఆలోచన కలగడానికి, మీతో మేము కలవకుండా మీకు ఇలాంటి బుద్ధి ఆలోచన ఇచ్చిన మీరు నమ్మే జీసస్ కి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు.
మీరు ఎన్నాళ్ళు అధికారంలో గానీ రాజకీయలలోగానీ ఉన్నా మీరు ఇలాగే ముందుకెళ్లాలి, మీరు మాకులాన్ని ఇలాగే పక్కనపెట్టి, మాకమ్మవాళ్లకు ఎవరికీ ఎటువంటి పదవులు టిక్కెట్లు ఇవ్వకుండా మీ పాపపంకిలాన్ని మా కమ్మకులంకి అంటకుండా చేయాలని, మీరు ఆయురారోగ్యాలతో బాగుండాలని, మా పురోభివృద్ధిని మీరు మీ ఆత్మీయులు మీగురువులు మీరాజగురువులు కనులారా చూస్తూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.
భవిష్యత్తు మాదేనని, ప్రపంచానికి మార్గదర్శకులం రథసారధులం మేమేనని, మా ఆత్మవిశ్వాసం అలాంటిదని, మాకు ప్రకృతిమాత ఎల్లవేళలా తోడూ నీడగా ఉంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుందని, ఎందుకంటే మేము సమాజం బాగుండాలని కోరుకునేవాళ్ళం కాబట్టి అని మరొక్కసారి మీకు గుర్తుచేస్తూ….!
మీకు మరోమారు మా ప్రతి కమ్మ వ్యక్తి తరపున, ప్రపంచ కమ్మ సంఘం తరపున హృదయపూర్వక మనస్ఫూర్తి ప్రేమ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు.
ముఖ్యగమనిక:
ప్రపంచం కమ్మ సంఘం ఏమిటని కొందరు అల్పులు, అనామకులు, అర్భకులు నవ్వుకోవచ్చు, గత యాభైఏళ్ల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పరిమితమైన మాకమ్మవారు.. నేడు ప్రపంచంలో దరిదాపు ప్రతి ఖండంలో ప్రతి దేశంలో ఉన్నారు, కాబట్టి మావాళ్లను అందరినీ సంఘటితం చేయడంకోసం , మాకు ప్రపంచ కమ్మసంఘం ఉంటుంది.
నిన్నమొన్నటి వరకూ మాకమ్మ కులస్తుడికి ఒకరికి, మీరు మంత్రిపదవి ఇచ్చి మా కన్నుని మావేలితోనే పొడిపించారు.అమాయకుడు ఆవేశపరుడు చరిత్ర తెలియని వాడు మా సోదరుడు మీ వలలో పడి నేడు
గిలగిలా కొట్టుకుంటున్నాడు. మేము ఆరోజే అతను గానీ, మరెవరూ గానీ మీ మంత్రిమండలిలో ఉండడం.. మా ప్రపంచ కమ్మ సంఘానికి ఇష్టంలేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా మా కమ్మ కులంలో, అల్పుడు అర్భకుడు మీలాంటి దృక్పథం ఆలోచనలు కలిగిన మీ సహచరుడు మరలా మీ ఎంగిలిమెతులకు ఆశపడి తోకఊపుతూ మీరు ఉసుగొల్పితే మరలా భౌభౌమనవచ్చు. కానీ మేము జాలితో అటువంటి ఉన్మాదులను వదిలేస్తాం, వీలైతే అటువంటి వాళ్లకు మేమే కౌన్సిలింగ్ ఇస్తాం.
– మంజరి