Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి

– ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని చెప్తున్నారు
• విజయసాయిరెడ్డి విశాఖపట్నంపై పడి పందికొక్కులాగా భూములు లాక్కున్నాడు
– ఎర్రబుక్ చూస్తే వైసీపీ నేతలకు ఉచ్చ పడుతున్నాయి
– తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు.?
– చట్టాన్ని ఉల్లంఘిచింన వారిని మాత్రమే నేను వదిలిపెట్టను అని చెప్పా
– టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలి
– బొబ్బిలి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం

ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర..పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి. తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉంది. మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుండి పారిపోతుంది. శ్రీపైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యంపులి అల్లూరి సీతారామరాజు నడిచిన నేల ఈ విజయనగరం జిల్లా. ఇంతటి పవిత్ర భూమిపై, చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముంద మాట్లాడటం నా అదృష్టం.

• జగన్ కు ఒక కొత్త జబ్బు వచ్చింది..అందుకే ఎప్పుడన్నా ఈ మధ్య బయటకు వచ్చాడా.? జగన్ కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. తాడేపల్లి మున్సిపల్ అధికారులను అడిగా..ఎందుకు జగన్ బయటకు రావడం లేదు అని. ఈ ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని చెప్తున్నారు.

• ఈ ప్రభుత్వానిది చెత్త పాలన. గుంటూరులో ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగి ఎంతో మంది అనారోగ్యంపాలయ్యారు. డయేరియాల వల్ల ఇద్దరు చనిపోయారు. వందలమంది ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య శాఖ మంత్రి రజినీని అడుగుతున్నా..అమ్మా రజినీ…నాడు మహానాడులో చంద్రబాబు నాటిన తులసి మొక్కనని చెప్పుకున్నావ్… మరి వైసీపీలో చేరాక జగన్ నాటిన గంజాయి మొక్కగా ఎలా మారారమ్మా.?

• సీఎం జగన్ పవన్ లాగా సినిమాల్లో పోటీ పడాలనుకుంటున్నారు. అందుకే సినిమాల పిచ్చి ఎక్కువైంది. యాత్ర-2 అని సినిమా తీశారు. ఆ సినిమా మొదటి షో లోనే ఎవరూ లేరు. వాళ్ల ఎమ్మెల్యేలే డబ్బులిచ్చి సినిమా చూడండి అని టిక్కెట్లు ఇస్తే వద్దుబాబాయ్ ఆ సినిమా అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ప్రొడ్యూసర్ జగన్ దగ్గరకు వెళ్లి సినిమాకు పెట్టిన డబ్బంతా పోయింది..మీరు ఆదుకోవాలని వేడుకున్నాడు. అప్పుడు జగన్ నాకేం సంబంధం అని బయటకు పంపాడంట. అందుకే ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని మరో పోస్టర్ విడుదల చేశాడు. ప్రొడ్యూసర్ సినిమా తీయాల్సిన పనిలేదు..రెండు నెల్లలోనే వైసీపీకి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. మళ్లీ జగన్ ఏమన్నుకున్నాడో ఏమో తెలీదు కానీ ప్రొడ్యూసర్ ను పిలిచి హార్సిలీహిల్స్ లో రెండు ఎకరాలు కేటాయించాడు.

• ఈ సభాముఖంగా జగన్ ను అడుగుతున్నా సినిమా తీయాలని ప్రజలు నిన్ను అడిగారా.? నీకు ఇడుపులపాయలో, పులివెందులలో, తాడేపల్లిలో, హైదరాబాదులో, బెంగళూరులో, విశాఖలో ప్యాలెస్ లు ఉన్నయి…వాటిల్లో రెండు ఎకరాలు ఇవ్వొచ్చు కదా..? ప్రజల సొమ్మును ఎందుకు అప్పనంగా ఇస్తున్నావ్? ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా లూటీ చేస్తున్నాడు. జగన్ ను చూస్తే పిట్టల దొర గుర్తొస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా క్రీడలను ప్రోత్సహిస్తుంటే..దానికి ఆడుదాం ఆంధ్రా అని పేరు పెట్టుకున్నాడు.

• మా జీవితాలతో ఆడుకంది చాలు…ఇక రెండు నెలల్లో మీతో ఆడే రోజులు రాబోతున్నాయి. ఎన్నికల ముందు నియోజకవ్గరానికి ఒక ఇండోర్ స్టేడియం, క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు…అవేమీ చేయలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. దాని పేరు కోడికత్తి వారియర్స్. ఆ టీంలో ప్లేయర్లు సీనియర్ బ్యాట్స్ మెన్…బాబాయిని గొడ్డలితో గట్టిగా కొట్టినందుకు అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ కుమార్, అరంగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ ఎంపీ భరత్, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని, మరో ఆల్ రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి.

• ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేకహోదా తెస్తా అన్నారు. 22 మంది లోక్ సభ ఎంపీలు, 9 రాజ్యసభతో కలిపి 31 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు. మరీ హోదా తెచ్చాడా.? కొందరు ఎంపీలు ఏపీ పరువు తీశారు. ఒక ఎంపీ జిప్పు తీసి దేశం మొత్తం చూపించాడు. మరో ఎంపీ బాబాయ్ ని చంపి ఆసుపత్రిలో దాక్కున్నాడు. ఇంకో ఎంపీ టిక్ టాక్ వీడియోలు, రీల్స్ తీయండంలో బిజీగా ఉన్నాడు. ఇంకో ఎంపీ భార్య, కొడుకును కిడ్నాప్ చేయించాడు. మరో ఎంపీ జగన్ వెంటే ఎప్పుడూ ఉంటాడు…జగన్ అక్రమాల్లో ఏ2 విజయసాయిరెడ్డి ఉంటాడు.

• ఆయన విశాఖపట్నంపై పడి పందికొక్కులాగా భూములు లాక్కున్నాడు. ప్రధాని దగ్గరకు వెళ్లి హోదా అడగలేదు..వాళ్లను జైలుకు పంపవద్దని వేడుకుంటాడు. జగన్ ఈ మధ్య వైసీపీ నేతలతో బస్సు యాత్ర ప్రారంభించాడు..దాని పేరు సామాజిక సాధికార యాత్ర అంట. కానీ దాన్ని చూశాక నాకు అర్థమైంది…వైసీపీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. 63 ఎమ్మెల్యేలను, 13 ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేశారు. ఇందోలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. సొంత సామాజికవర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యేను కూడా ట్రాన్స్ ఫర్ చేయించలేదు.

-యాదవ సామాజిక వర్గానికి చెంది జంగా కృష్ణామూర్తి స్వయంగా చెప్పాడు..వైసీపీలో బీసీలకు గౌరవం లేదని, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా అన్నారు… వైసీపీలో బీసీలను చిన్నచూపు చూస్తున్నారు అని. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి కూడా…తనను గుర్తించి ప్రజలు గెలిపించారు కానీ..జగన్ గుర్తించడంలేదని అన్నారు. ఒక్కసారి బీసీలు ఆలోచించాలి. బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. ఎప్పుడూ లేని విధంగా దాడులు చేయిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు తగ్గించారు. బీసీలకు నేను హామీ ఇస్తున్నా..10 శాతం రిజర్వేషన్లు మళ్లీ తీసుకొస్తాం.

• దామాషా ప్రకారం నిధులు కేటాయించి కార్పొరేషన్లు బలోపేత చేస్తాం. బీసీలు బ్యాక్ బోన్ అని వెన్నుముకు విరుస్తున్నాడు.. జయహో బీసీ అని అందరూ నినదించాలి. బీసీలంతా జగన్ వెన్నెముకు విరచాలి. జగన్ కటింగ్, ఫిటింగ్ మాస్టారు. ఆయన దగ్గర రెండు బటన్లు ఉంటాయి…బల్లపై ఉండే బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు…బల్లకింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాక్కుంటాడు.

• విద్యుత్ చార్జీలలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. చెత్తపన్ను, ఇంటిపన్ను, గ్యాస్, పెట్రోల్, డీజల్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ ధరలు కూడా పెంచి దోచుకుంటున్నాడు.   కంటింగ్ మాస్టారు అన్నాను కదా..అన్న క్యాంటీన్, విదేవీ విద్య, పండుగ కానుకలు, 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధాంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా చూశాం. అందుకే చంద్రబాబు, పవన్ కలిసి సూపర్-6 ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. యేటా డీఎస్సీ నిర్వహిస్తాం. ఉద్యోగం వచ్చేదాకా రూ.3 వేలు భృతి ఇస్తాం.

• స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి యేటా రూ.15 వేలు ఇస్తాం. 18-59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.15 వందలు ఇస్తాం.ప్రతి ఇంటికి యేటా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. రైతుకు యేడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తాం. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తాం. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు అన్నాడు..ఒక్క ఇటుకున్నా ఉత్తరాంధ్రలో వేశాడా..?

ఇప్పుడు ఏకంగా 3 కుటుంబాలకు మాత్రమే పదవులు ఇచ్చాడు. బొత్స, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలిసి ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా మెక్కుతున్నాయి. టీడీపీ రాగానే తిన్నదంతా కక్కిస్తాం. విశాఖ ఉక్కు కోసం పెద్దలంతా పోరాడి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. కానీ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ప్లాంట్ అమ్మాలని చూస్తున్నాడు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం..అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తాం.

జగన్ విజయనగరానికి అనేక హామీలిచ్చాడు. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేస్తానన్నాడు. రామతీర్థం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు.. చేయలేదు. గోస్తాని-చంపావతి నదులు అనుసంధానం చేస్తానని చేయలేదు. రామభద్రపురం పెద్దగడ్డ పనలు పూర్తి చేస్తానని చెప్పాడు..చేయలేదు. పాలేరు నదిపై డ్యాం, చిత్తిగడ్డ-స్వర్ణముఖిపై బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పాడు..ఏదీ చేయలేదు. కనీసం రోడ్డుపై గుంతలు కూడా పూడ్చలేకపోతున్నాడు. విజయనగరం జల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పర్యాటకం, ఇళ్లు నిర్మించాం. ఉత్తరాంధ్ర ప్రజలకు హామీ ఇస్తున్నా..మరో 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. పరిశ్రమలు తెచ్చి స్థానికంగా ఉద్యోగాలు అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాం.

• బొబ్బిలి నియోజకవర్గంలో సుజయకృష్ణరంగారావు మంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా అభివృద్ది చేశారు. రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పక్క నియోజకవర్గాల్లో కనీసం ఇంకుపెన్ను ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో పెన్నుకు ఇంకును మరొకరు పోసే పరిస్థితి.

• కొండదేవుల పల్లి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును టీడీపీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. వెంగలరాయసాగర్ విస్తరణ పనులు మనం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. పెద్దగడ్డ నీళ్లను రామభద్రపురం గడ్డ ఆయకట్టుకు అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. వేదవతి బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం. జిల్లాలో పెండింగులో ఉన్న సీసీరోడ్లు, బీటీ రోడ్లు కూడా వేస్తాం. తప్పకుండా డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.

• మన జిల్లాకు క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా ముద్దుల మావయ్య..మీ అందరి బాలయ్య హైదరాబాద్ లో కేన్సర్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. నా భార్య బ్రాహ్మణి కూడా చెప్తోంది..ఏపీ నుండి క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారని చెప్పింది. ఎన్జీవో లేదా ప్రభుత్వం తరపున క్యాన్సర్ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తా. ఎరుకలపాకం సర్పంచ్ ను ఈ ప్రభుత్వం వేధించి ఇబ్బంది పెడుతోంది. పాలవలస గౌడ్ ను కూడా వేధించారు. పేర్లు ఎర్రబుక్ లో రాసుకున్నా ఎవర్నీ వదలను.

• టీడీపీ బలం కార్యకర్తలే. నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల పార్టీ అంటే ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో టీడీపీని పెట్టారో కానీ జండా చూస్తేనే నూతన ఉత్సాహం వస్తుంది. వైసీపీ కార్యకర్తకు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ కావాలి. కానీ మనకు మాత్రం చంద్రబాబు పిలుపునిస్తే రెడ్లపైకి వస్తాం. 2014లో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోతే బీమా అందించాం. కార్యకర్తల కుటుంబాలకు రూ.100 కోట్లు అందించాం.

• తల్లిదండ్రులు లేని కార్యకర్తల పిల్లలను భువనేశ్వరి చదివిస్తున్నారు. నాకు అక్కా, చెల్లి, అన్నా, తమ్ముళ్లు లేరు..ఎన్టీఆర్ ఇచ్చిన 60 లక్షల మంది నా కుటుంబ సభ్యులు. నాపై ఎన్నికేసుల పెట్టినా తగ్గేదే లేదు. బాంబులకు భయపడని మేము చిల్లర కేసులకు భయపడతామా.?

• రెండు నెలలు మీరు కష్టపడిండి. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మిమ్మల్ని వేధించిన వారిపేర్లు ఎర్రబుక్ లో ఉన్నాయి…దీన్ని చూస్తే వైసీపీ నేతలకు ఉచ్చపడుతున్నాయి. కోర్టుకు వెల్లి నన్ను అరెస్టు చేయాలని చెప్తున్నారు.

• తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు.? చట్టాన్ని ఉల్లంఘిచింన వారిని మాత్రమే నేను వదిలిపెట్టను అని చెప్పా. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తా. ఎన్టీఆర్ దేవుడు..చంద్రబాబు రాముడు..కానీ ఈ వైసీపీ నేతలకు లోకేష్ మూర్ఖుడు. బొబ్బిలో ఉన్నా..బాండే పారిపోయినా తప్పు చేసిన వారిని తీసుకొచ్చి జైల్లో వేస్తాం.

• చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేశారు. ఒక అన్నగా అండగా ఉంటానని చెప్పారు. నాడు పవన్ ఏపీకి రావాలనుకుంటే విమానానికి అనుమతి రాకుండా చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. ఆనాడు పవన్ నిర్ణయించుకున్నారు ఈ సైకోను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలి. ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి. పేటియం కుక్కలు విభేధాలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి.

• సూపర్-6 పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెల్లాలి. హామీలు గురించి వివరించి చెప్పాలి. ప్రజల చుట్టూ తిరిగితే మిమ్మల్ని నేనే వెతుక్కుంటూ వస్తా. ఎవరైతే బాగా పని చేస్తారో వారికే నామినేటెడ్ పోస్టు ఇస్తా.
• అందరి నినాదం..హలో ఏపీ..బైబై వైసీపీ కావాలి

LEAVE A RESPONSE