Suryaa.co.in

Andhra Pradesh

విలువైన వక్ఫ్ ఆస్తుల్ని కొట్టేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది

• అల్లాహ్ ఆస్తులు.. భూములు రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని కబళించడం బాధాకరం
• వక్ఫ్ బోర్డు పరిధిలోని వేల ఎకరాల భూములు వైసీపీప్రభుత్వంలో అన్యాక్రాంతమయ్యాయి
• నాలుగున్నరేళ్లుగా వక్ఫ్ బోర్డు నియామకం గురించి ఆలోచించని జగన్.. అతని ప్రభుత్వం ఇప్పుడు అనర్హుల్ని బోర్డులో పెట్టి.. వారిద్వారా వక్ఫ్ ఆస్తులు కొట్టేసేందుకు పథకరచన చేస్తోంది
• వక్ఫ్ భూములు కాజేయాలని చూస్తున్న వైసీపీ నేతలు..వారికి సహకరిస్తున్న అధికారులు కచ్చితంగా శిక్షంపబడతారు
• టీడీపీ ప్రభుత్వం రాగానే వక్ఫ్ భూములు అన్యాక్రాంతంపై జ్యుడిషియరీ విచారణ జరిపించి, భూములు కాజేసినవారిని..వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షిస్తుంది.
•ముస్లిం మైనారిటీల పథకాలు రద్దుచేసిందికాక.. చివరకు వక్ఫ్ ఆస్తుల్ని కూడా కబళించాలని చూస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముస్లిం సమాజం కఠినంగా శిక్షించాలి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్

గత ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అనేక పథకాలురద్దు చేయడం తప్ప నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం మైనారిటీలకు చేసిందేమీ లేదని, మైనారిటీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు, ముఖ్యమంత్రికి మైనారిటీల సమస్యలు..కష్టాలు పట్టడం లేదని. తన శాఖకు విధులు.. నిధులు.. బాధ్యతలు లేవన్నట్టు అంజాద్ బాషా తన పదవీ కాలాన్ని మాటలతోనే వెళ్లబుచ్చాడని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ వక్ఫ్ బోర్డు అనేది ముస్లిం మైనారిటీలకు ఎంతో పవిత్రమైన సంస్థ. ఆధ్యాత్మిక చింతనతో మసీదులు.. దర్గాల నిర్వహణ నిమిత్తం.. అంజుమన్ సంస్థల నిర్వహణ కోసం ముస్లిం వర్గ పూర్వీకులు వేలాది ఎకరాల భూముల్ని అల్లా పేరిట దానమిచ్చారు. వక్ఫ్ ఆస్తులు..భూములు అంటే అల్లాపేరుతో ఉన్న ఆస్తులనే చెప్పాలి. అలాంటి ఆస్తులు.. భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కానీ జగన్ సర్కార్ తన దోపిడీకోసం వక్ఫ్ ఆస్తుల్ని కూడా దోచుకోవడానికి సిద్ధమైంది. మంత్రులు.. వైసీపీ నేతలు.. వక్ఫ్ ఆస్తుల్ని మింగేస్తున్నారని చెప్పడానికి నిజంగా బాధపడుతున్నాం.

రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో దాదాపు 65వేల ఎకరాల భూములుంటే, వాటిలో కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాలకు గురైన భూములు పోగా ఇప్పటికి ఇంకా 40వేల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు అధీనంలో ఉన్నాయి. జనాభా పెరుగు దల.. గ్రామ, పట్టణ, నగరాల విస్తరణతో వక్ఫ్ భూముల ధరలు అమాంతం పెరిగాయి. కొన్నిచోట్ల ఒక్కో ఎకరం కోట్లాదిరూపాయల విలువ పలుకుతోంది. భూముల విలువ పెరగడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీనేతల కన్ను వాటిపై పడింది. వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన ప్రభుత్వమేమో ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.

విలువైన వక్ఫ్ ఆస్తులు కొట్టేయాలన్న దురుద్దేశంతోనే కొందరు మంత్రులు.. ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా ఉండేవారిని వక్ఫ్ బోర్డులో నియమించడానికి ఒత్తిళ్లతో కూడిన ప్రలోభాలకు తెరలేపారు
ఈ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటులో ఇన్నాళ్లు కాలయాపన చేసి, బోర్డులో సభ్యులుగా చేరడానికి వక్ఫ్ భూములు కాజేయాలనుకునేవ వారిని నియమించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ అండతో వక్ఫ్ బోర్డులో చేరి.. తరువాత ప్రభుత్వ దోపిడీకి సహకరించాలనే దురాలోచనలో కొందరు ఉన్నారు. ఒక వక్ఫ్ బోర్డు సభ్యుడి ఎంపిక కోసం ఇటీవల ఎన్నిక జరిగితే.. సాక్షాత్తూ ఆ పదవిలో తమకు అనుకూలమై నవారిని నియమించడం కోసం నేరుగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషానే రంగంలోకి దిగారు. ఆయన కాకుండా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆ పదవిలో తమ మనుషుల్ని నియమించాలని ప్రయత్నించారు.

ఆ ఒక్క వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎలాగైనా తమవాడే గెలవాలనే ఉద్దేశంతో ముతవలీలలను ప్రలోభపెట్టి.. వారిద్వారా దాదాపు 250 ఓట్లు ఆ సభ్యుడికి వేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ ఓట్లకోసం ఓటుహక్కున్న ఒక్కోసభ్యుడికి రూ.10 నుంచి రూ.25 వేల వరకు చెల్లించారనే సమాచారం కూడా ఉంది. ఆ విధంగా వక్ఫ్ బోర్డులో ఖాళీగా ఉన్న ఒక సభ్యుడి ఎంపికకోసం అధికారపార్టీ నేతలు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఏ దురు ద్దేశంతో వైసీపీవారు ఇలాంటి ప్రలోభాలకు తెరలేపారో ముస్లిం సమాజం గ్రహించాలి.

వైసీపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుని వైసీపీ కమిటీలా.. ఏంఎంసీ పాలకమండలిలా మొక్కుబడిగా నియమించింది అనర్హుల్ని సభ్యులుగా నియమించి.. వారి ద్వారా వక్ఫ్ ఆస్తులు కొట్టేయాలని చూస్తోంది
నాలుగున్నరేళ్లపాటు కాలయాపన చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏర్పాటుచేసిన వక్ఫ్ బోర్డు కమిటీని వైసీపీ కమిటీలా.. ఏఎంసీ పాలకమండలిలా మొక్కుబడిగా నియమించింది. వక్ఫ్ బోర్డు కమిటీ ఏర్పాటు అనేది కేంద్రప్రభుత్వ చట్టం నిబంధనలకు లోబడి జరగాలి.

కానీ ఏపీప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకంలో ఆ నిబంధనలు పాటించలేదు. బోర్డ్ లో ఎన్నిక ద్వారా వచ్చే సభ్యులు ఎక్కువగా.. నామి నేట్ కాబడే వారు తక్కువగా ఉండాలనే నిబంధన ఉంటే.. వైసీపీ ప్రభుత్వం నామినే టెడ్ సభ్యుల్ని ఎక్కువమందిని నియమించి.. ఎన్నిక ద్వారా రావాల్సిన వారిని తక్కుమందిని నియమించింది. న్యాయవాదుల నుంచి ఒకరిని వక్ఫ్ బోర్డులో సభ్యునిగా నియమించాలని.. అతను కూడా బార్ కౌన్సిల్ సభ్యుడైన ముస్లిం వ్యక్తి అయి ఉండాలనే నిబంధనను కూడా ప్రభుత్వం పాటించలేదు. వైసీపీకి వత్తాసుపలికే జూనియర్ లాయర్లను వక్ఫ్ బోర్డ్ సభ్యులుగా నియమించింది.

అర్హుల దరఖాస్తుల్ని బుట్టదాఖలు చేసింది
అలానే రాష్ట్రంలోని లోక్ సభ, రాజ్యసభ ఎంపీల కోటాలో వక్ఫ్ బోర్డు సభ్యులుగా తమకు అవకాశం ఇవ్వాలని మాజీ రాజ్యసభసభ్యులు సైఫుల్లా.. కల్నల్ నిజాముద్దీన్ లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వారి విజ్ఞప్తిని వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. కనీసం వారి దరఖాస్తులు ఎందుకు తిరస్కరించారో కూడా వారికి చెప్పకుండా ఆ స్థానాల్లో కూడా వైసీపీవారినే వక్ఫ్ బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో మైనారిటీ వర్గానికి చెందిన ఒకరిని బోర్డ్ సభ్యు లుగా నియమించాలనే నిబంధన ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీ లు ఎవరిని సభ్యులుగా నియమించలేదు. ఇదంతా గమనిస్తే జగన్ ప్రభుత్వం కేవలం వక్ఫ్ భూముల్ని.. ఆస్తుల్ని కాజేయాలన్న కుట్రతోనే అనర్హులతో మొక్కుబడిగా వక్ఫ్ బోర్డుని నియమించిందని అర్థమవుతోంది.

వక్ఫ్ భూములు..ఆస్తులు కొట్టేస్తున్న వైసీపీప్రభుత్వాన్ని, అధికారపార్టీ నేతల్ని ముస్లిం సమాజం కఠినంగా శిక్షించాలి
వక్ఫ్ భూములు… ఆస్తులు కొట్టేస్తున్న వైసీపీప్రభుత్వాన్ని, అధికారపార్టీ నేతల్ని ముస్లిం సమాజం ఎన్నటికీ క్షమించకూడదు. వక్ఫ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రభు త్వమే కంచె చేను మేసినట్టుగా వ్యవహరించడాన్ని ముస్లిం సమాజం తరుపున తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాం. టీడీపీప్రభుత్వ హయాంలో ఆనాడు వక్ఫ్ బోర్డు ప్రత్యేకాధికారిగా ఉన్న ఇక్బాల్ నేత్రత్వంలో అన్యాక్రాంతమైన దాదాపు 300ఎకరాల భూముల్ని కబ్జా దారుల నుంచి విడిపించడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం వక్ఫ్ భూముల్ని కాపాడుం దుకు.. వక్ఫ్ బోర్డు ఉనికిని రక్షించేందుకు పనిచేసింది. టీడీపీ హాయాంలో ప్రభుత్వ సొమ్ముతోనే షాదీఖానాలు నిర్మించడం.. మసీదులు మరమ్మతులు చేయడం.. అంజుమన్ సంస్థల ఆస్తుల్ని కాపాడటం జరిగింది. కానీ నేడు జగన్ రెడ్డి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల్ని దిగమింగేందుకు అధికారాన్ని ఉపయోగిస్తోంది.

వక్ఫ్ బోర్డు లోని కొందరు సభ్యులు… మైనారిటీ శాఖాధికారులు కూడా ప్రభుత్వ దోపిడీకి సహకరిస్తు న్నారు. వక్ఫ్ భూములు తాకట్టు పెట్టడానికి.. అద్డెకు ఇవ్వడానికి… నచ్చినవారికి ధారాదత్తం చేయడానికి కొందరు అధికారులు ఇష్టానుసారం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. వక్ఫ్ భూములు ప్రభుత్వానికి.. వైసీపీనేతలకు దోచిపెట్టేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల్ని వదిలిపెట్టేదిలేదు. టీడీపీప్రభుత్వం రాగానే జ్యుడీషియల్ విచారణ జరిపించి, తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తాం.

అలానే వైసీపీప్రభుత్వ పెద్దల చెరలోని వక్ఫ్ భూములు ఆస్తుల్ని కూడా వెనక్కు తీసుకుంటాం. ముస్లిం మైనారిటీలను రాజకీయంగా.. ఆర్థికంగా.. సామాజికంగా అణచి వేస్తున్నది చాలక.. చివరకు వక్ఫ్ ఆస్తుల్ని కూడా కొట్టేయడానికి వెంపర్లాడుతున్న జగన్ రెడ్డిని.. అతని ప్రభుత్వాన్ని ముస్లిం సమాజం కఠినంగా శిక్షించాలి.” అని షరీఫ్ పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE