నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇంకెన్ని రోజులు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటావు.?
నిరుద్యోగుల ఆత్మహత్యలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలి
నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు
యువతకు టీడీపీ బలమైన హామీ ఇస్తోంది
– మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
అమరావతి :- ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో అనంతపురం జిల్లా, కుందుర్పికి చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసున్నాడన్న విషయం కలచివేసింది. శ్రీకాంత్ తల్లిదండ్రులకు ఏం ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు.? జగన్ రెడ్డి వచ్చాక యువత నిరాశ, నిస్పృహలో ఉన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాలి. నాలుగున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసానికి గురి చేసింది. యేటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తానన్నాడు..ఒక్క జాబ్ కేలండర్ అయినా విడుదల చేశారా?
తన పత్రికకు ప్రకటనలు, తన విలాసాలకు మాత్రమే జగన్ రెడ్డి కేలండర్ రూపొందించుకున్నారు. సలహాదారులపై ఉన్న శ్రద్ద నిరుద్యోగులపై లేదు. ఇది యువత వ్యతిరేక ప్రభుత్వం. జగన్ అధికారంలోకి వచ్చాక వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి తప్ప..జగన్ మాటలు నమ్మి ఓట్లేసిన యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. తాను తప్ప మరొకరు ఎదగకూడదన్నది ఫ్యాక్షనిస్టుల కుటిల బుద్ధి..అందుకే యువత తమ సొంతకాళ్లపై నిలబడకుండా చేయాలన్న లక్ష్యంతో జగన్ వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నాలుగున్నరేళ్లలో 471 మంది చావుకు కారణమయ్యాడు.
నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. యువతకు టీడీపీ బలమైన హామీ ఇస్తోంది…వచ్చే ఎన్నికల్లో జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది..యేటా ప్రతి జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా టీడీపీ-జనసేన ప్రభుత్వం పనిచేస్తుంది. ఉద్యోగాలు వచ్చేదాకా నిరుద్యోగ యువతకు భృతిగా నెలకు రూ.3 వేలు అందిస్తాం. సైకో ప్రభుత్వానికి రాంరాం చెప్పేందుకు యువత సిద్ధంగా ఉంది.