Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ది స్టిక్కర్ల ప్రభుత్వం

– కేంద్ర నిధులతో బతుకుతోంది
– ఇది మాటల ప్రభుత్వమే
– బీజేపీని ఆశీర్వదించండి
– నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు సమావేశం ప్రారంభం
– జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అద్యక్షతన ప్రారంభం
– ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరు
– నంద్యాలలో మీడియా తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఏమన్నారంటే.. దేశమంతా రామమయం గా మారింది… బాలరాముడు ప్రాణ ప్రతిష్ట వీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం 22వ తేదీ సెలవు ఎందుకు ప్రకటించలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి ప్రశ్నించారు.

సంక్రాంతి సెలవులు పొడిగించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే విద్యాసంస్థలు 22రీఓపెన్ ప్రకటించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటి? తిరుపతి లో నకిలీ ఎపెక్స్ కార్డు లతో 30వేలు ఓట్లు ను వైసీపీ తస్కరించి న విషయం పై బిజెపి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ద్వారా అధికారులు పై చర్యలు తీసుకున్నారు.ఇదే విధంగా వైసీపీ ఫేక్ ఎపిక్ కార్డు లు తయారు చేసిన ఆరోపణలు పై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

రాయలసీమ కు వైసీపీ అన్యాయం చేసింది.ఒక్క పరిశ్రమ తీసుకుని రాలేదు.వైసీపీ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అంకితమై బిజెపి ప్రభుత్వం పని చేస్తుంది. యావత్ భారత దేశానికి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా కేంద్రం చేసిన అభివృద్ధి వివరించడం ద్వారా ప్రజలకు తెలుసు కుంటున్నాను.

టిడిపి, వైసీపీ స్టిక్కర్ లు వేసుకొని కేంద్ర పధకాలు తమవి గా ప్రచారం చేసుకున్నారు. కేంద్రం నిధులు తో జరుగుతున్న అభివృద్ధి ప్రజలు కు అర్థం అవుతుంది. 22వ తేదీ న బాలరాముడు ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఎన్నో శతాబ్దాల కల నేడు నెరవేరే బోతోంది. ఈ క్షణం కోసం రామభక్తులు ఎదురు చూస్తున్నారు. నేను శ్రీ శైలంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ జిల్లా కు. ఓట్లు తో సంబందం లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది.

ఈ జిల్లా కు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ 2000పైగా ఇవ్వడం జరిగింది.దీపం పధకం లో సొమ్ము చెల్లించి అయితే ఎటువంటి సొమ్ము కట్టక్కలేదు. ముద్రా యోజన పథకం ద్వారా రుణాలు మంజూరు చేసింది. పాణ్యం విమానాశ్రయం 850కోట్లు మంజూరు. కర్నూలు డోన్ మీదుగా బెంగళూరు వందే భారత్. గుంటూరు.. గుంతకల్లు రైల్వే విద్యుద్దీకరణ. జాతీయ రహదారి పనులు వేగవంతం.

నాగర్ కర్నూల్ నుండి.తీగల వంతెన వరకు రహదారి నిర్మాణం.ఐఐటీ, మెడికల్ కాలేజీ లు మంజూరు.జల జీవన్ మిషన్ ద్వారా కేంద్రం నిధులు.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా కు ఏం చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు. బనగానపల్లె లో ఒక్క ఇల్లు ఇవ్వలేదు. రైతులను ఆదుకోలేదు. ఈ ప్రభుత్వం మాటలు ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ జీవితాలతో ఆడుకుంటున్నారు. రా మరాజ్యం బిజెపి ద్వారా మాత్రమే సాధ్యం.

LEAVE A RESPONSE