రాతియుగపు రాక్షసుడు జగన్

– బాబు సూపర్ సిక్స్ ను విజయవంతం చేయాలి
– సత్తెనపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా
– మహిళల ఘన స్వాగతం

సత్తెనపల్లి పట్టణం 15వ వార్డు లో అట్టహాసంగా భారీ ర్యాలీతో స్వాగతం పలికిన పట్టణ కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కార్య సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి, అనంతరం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మహిళలు హారతులతో ఘన స్వాగతంపలికారు. కన్నా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి, ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు

కన్నా మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు, ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

.ఈ సైకో జగన్ పాలన ఎప్పుడు అంతం అవుతుంది అని ఎదురుచూస్తున్న అన్ని రంగాల కార్మికులు ఎదురుచూస్తున్నారని, జగన్ అధర్మ పాలనపై ధర్మాగ్రహ జ్వాల మొదలైంది హింసను ప్రేరేపించే ఇటువంటి రౌడీ. సంస్కారం తెలియని ఒక రాతియుగపు రాక్షసుడు ప్రజా రాజకీయాల్లో ఉంటే, ప్రజలకు భద్రత భవిష్యత్తు రెండు ఉండవు. కాబట్టి ఇతగాడికి రాజకీయ సమాధి కట్టడమే ప్రజాస్వామ్య న్యాయం.

సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగింది అని స్థానికంగా ఉన్న నేతలు చెబుతున్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందో చూపిస్తారా? డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేవని పలు రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వం వల్ల, సత్తెనపల్లి పట్టణం వెనుకబడి ఉందని.. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కొంచెం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.

త్వరలోనే తెలుగుదేశం జనసేన కూటమి రాగానే అన్ని రంగాల్లో అభివృద్ధి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ప్రజలకు పథకాలు అనే పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాడు ఈ జగన్.. రాజధాని లేని రాష్ట్రంగా ఈ ముఖ్యమంత్రి చరిత్ర హీనుడిగా మిగులుతాడని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు,రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి యెల్లినేడి రామస్వామి, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధులు పూజల వెంకట కోటయ్య, కంబాల వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ వలి, నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ వడ్డీంపూడి పవన్ కుమార్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నూర్ భాషా జానీ బాబు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నోముల ప్రకాష్,పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు యెల్లినేడి లక్ష్మి తులసి,పట్టణ తెలుగు రైతు అధ్యక్షులు పీలా సాంబశివరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు,15వ వార్డు ప్రెసిడెంట్ కరేటి శ్రీనివాసరావు, వార్డు సెక్రటరీ కూచిపూడి కోటేశ్వరరావు, వార్డు ఇన్చార్జ్ ఉపాసి సైదులు, క్లస్టర్ ఇంచార్జెస్ పొట్ల అంజి, మార్కెట్ రాజు, మరియు వివిధ హోదాల్లో ఉన్న పట్టణ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply