Suryaa.co.in

Andhra Pradesh

మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే గూండారాజ్యం

– మాచర్ల అసెంబ్లీలో అధికారపార్టీ అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన తెదేపా అధ్యక్షులు అచ్చెన్నాయుడు
– పోలింగ్ బూత్‌ల ఆక్రమణకు గురయ్యే మండలాలు, గ్రామాలను లేఖలో ప్రస్తావించిన అచ్చెన్న
– త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపధ్యంలో లేఖ రాసిన అచ్చెన్న

2009, 2014, 2019 లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఓటిండ్ డేటాను విశ్లేషించాలని వినతి. 2021 లో జరిగిన స్థానిక సంస్థలు, మునిసిఫల్ ఎన్నికల్లో వైకాపా గూండాలు ప్రతిపక్ష అభ్యర్ధులను నామినేషన్లు వేయనీయలేదు. మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, రెంటచింతల మండలాల్లో నమోదైన నామినేషన్ల వివరాలు ఎస్ఈసీకి పంపిన అచ్చెన్న

మాచర్లలో అధికారపార్టీ గూండాలు హత్యలు, దొమ్మి, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడ్డారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట రామిరెడ్డిలు ఆడమన్నట్లు అధికారులు, పోలీసులు ఆడుతున్నారు. మాచర్లలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయండి. రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోండి.

LEAVE A RESPONSE