వాలంటీర్లకు డబ్బులు పంచిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు

– చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ రాసిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్
– గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాలంటీర్లకు డబ్బు పంచారంటూ షరీఫ్ లేఖ

26.02.2024 న మార్కాపురం పట్టణంలో వాలంటీర్లతో మీటింగ్ పెట్టి వారికి రూ.5 వేలు నగదు, స్వీట్లు పంచాడు. అన్నా రాంబాబు రాబోయే సాధారణ ఎన్నికల్లో వైకాపా తరపున మార్కాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని 50 కుటుంబాల ఓట్లు తనకు వేయించేలా ఓటర్లను ప్రభావితం చేయాలని నిర్ధేశించారు. సాధారణ ఎన్నికలకు ముందు ఇలా స్వీట్లు, డబ్బులు పంచడం ఎన్నికల నియమావళికి విరుద్దం. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి అన్నా రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకొని అనర్హత వేటు వేయండి. రాజకీయ పార్టీ సమావేశానికి హాజరైన వాలంటీర్లపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సమావేశాలకు హాజరు కాకుండా ఆదేశించండి.

Leave a Reply