ప్రజల డబ్బుతో నీ పెత్తనం ఏంటి జగన్?

-ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు
-విడదల రజని, సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఆ సీఐకి సవాలు విసురుతున్నా
-ఫ్లెక్సీ లో ఏమైనా తప్పులు ఉంటే నిరూపించండి. లక్ష రూపాయలు ఇస్తాం
-పోలీసులా? వైసీపీ కార్యకర్తలా?
-కేంద్రపథకాలపై రాష్ట్రంలో ఫ్లెక్లీలు పెడతాం
– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ ఫైర్

విజయవాడ: నిన్న నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఐదు ఎయిమ్స్ కళాశాల హాస్పటల్స్ ప్రారంభించటం జరిగింది. మంగళగిరి లో మేము సవాలు పేరుతో ఒక ఫ్లెక్స్ ఏర్పాటు చేసాము. ఈ ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.

దీనిపై మేము యువజన మోర్చా సవాలు చేస్తున్నాం. వీటిని చూసి ఓర్వలేని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని మా పై భౌతిక దాడులకి పాల్పడ్డారు. నిన్న సీఐ మా పై చేసిన దాడులకి గాను బీజేవైఎం ఖండిస్తున్నాం. విడదల రజని, సీఎం జగన్ మోహన్ రెడ్డి కి, ఆ సీఐ కి సవాలు విసురుతున్నాము. మేము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో ఏమైనా తప్పులు ఉంటే నిరూపించండి. లక్ష రూపాయలు మీకు ఇస్తాం.

త్వరలో పోలవరం నిధులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఖర్చుపెట్టిందో సవాలు చేస్తాము. పోలీసులు వైసీపీ కార్యకర్తలు లెక్క పని చేస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలపై బీజేవైఎం ఆధ్వర్యంలో మేము ఫ్లెక్స్ లు ఏర్పాటు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. దీనిపై మేము బహుమతుల పేర్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేస్తాము.

మా పథకాలలో ఎప్పుడు కూడా ప్రధాన మంత్రి పేరుతో పథకాలు ఉంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో పథకాలు ఉండవు. ప్రజలు ఇచ్చిన టాక్స్ ల తో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రజల డబ్బుతో జగన్ పేరుతో పథకాలు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి పేరుతో పథకాలు పెట్టుకో. అంతేకాని ప్రజల డబ్బుతో నీ పెత్తనం ఏంటి? అని ప్రశ్నిస్తున్నాం.

Leave a Reply