Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న జగన్ రెడ్డి

-కొండపై బాలాజీనగర్ లో స్థానికుల ఇళ్లకు జగన్ స్టిక్కర్లు అతికించడం అపచారం
-హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ రెడ్డి చర్యలు
-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహఖ కార్యదర్శి శిష్ట్లా లోహిత్

హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు? హిందువులు, హిందూ దేవాలయాలంటే ముఖ్యమంత్రికి ఎందుకంత చులకనభావం? తిరుమల బాలాజీ నగర్ లో నివసించే స్థానికుల ఇళ్లకు జగన్ రెడ్డి స్టిక్కర్లు అంటించడం దేనికి సంకేతం? కొండపై ఇంతటి అమానుషానికి పాల్పడతారా? ఈ చర్య కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని అవమానించడమే.

తిరుమల కొండపై వ్యక్తుల విగ్రహాలు, పార్టీల జెండాలు, చిహ్నాలు, నేతల ఫోటోలు, అన్యమత ప్రచారం దశాబ్ధాలుగా నిషేధంలో ఉన్నప్పటికీ నిబంధనలు అతిక్రమించారంటే ఏమనాలి?అసలు అలిపిరి చెక్ పాయింట్ లో ప్రచార సాధనాలను ఎలా అనుమతించారు? రూల్స్ భక్తులకేనా? అధికార పార్టీకి వర్తించవా?వైసీపీ నేతలు ఇంతటి దుస్సాహసానికి పాల్పడినా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? జగన్ రెడ్డి ప్రాపకం కోసం ఇంతలా దిగజారాలా?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అడుగడుగునా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లుగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా తిరుమల కొండపై అన్యమత ప్రచారం, గంజాయి, మాంసం లభ్యం వంటి ఘటనలు వెలుగుచూసినా స్పందనలేదు. అంతేకాదు….హిందూ దేవాలయాలకు వెళ్లడానికి కూడా ముఖ్యమంత్రికి మనసు రాదనడానికి ఒంటిమిట్ట పట్టువస్త్రాల సమర్పణకు వెళ్లకపోవడమే నిదర్శనం.

అలాగే ప్రసిద్ధ ఆలయాల్లో ఉత్సవాల ఏర్పాట్లలోనూ ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమవుతున్నారనడానికి సింహాచలం అప్పన్న చందనోత్సవ కార్యక్రమమే ఉదాహరణ. ఒక్క రోజు కార్యక్రమం నిర్వహించలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏం కాపాడతాడు? జగన్ రెడ్డిలాగే వైసీపీ నేతలూ వ్యవహరిస్తున్నారు.

సింహాచలంలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైనందుకు సిగ్గుపడకపోగా భక్తులు కళ్లలో ఆనందభాష్పాలు కళ్లారా చూశానని దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతున్నారంటే ఏమనాలి? ఇప్పటికైనా జగన్ రెడ్డి కుల, మత , ప్రాంతాల వారీగా విభజించి పాలించడం మానుకోవాలి. హిందూ మనోభావాలను గౌరవించాలి. లేనిపక్షంలో వారి ఆగ్రహానికి గురికాక తప్పదు.

LEAVE A RESPONSE