జగన్ గంజాయి కి బ్రాండ్ అంబాసిడర్

చంద్రబాబు ది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్…జగన్ ది ఫినిష్ ఆంధ్రప్రదేశ్
జగన్ కి ప్రజలు భయాన్ని పరిచయం చేశారు
జగన్ మోహన్ అని కాకుండా స్కామ్ మోహన్ అని పిలుస్తా
జగన్ ఇచ్చే ప్రతి స్కీం లోనూ ఒక స్కాం
టిడిపి అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం
నిరుద్యోగ భృతి మళ్లీ ప్రారంభిస్తాం
క్వారీలకు అనుమతులు రావాలంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే
ఆయనకు కమీషన్ ఇచ్చుకోలేక దాదాపు 20 క్వారీలు మూతపడ్డాయి
రేపు తంబళ్లపల్లెలో ఉంటా.. పాపాల మిథున్ రెడ్డి వస్తే చర్చకు నేను సిద్దం
జగన్ సీన్ అయిపోయింది… రాబోయేది టిడిపి ప్రభుత్వం
మదనపల్లి బహిరంగ సభలో నారా లోకేష్
టిడిపి లో చేరిన మదనపల్లి వైసిపి ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా

మదనపల్లి ప్రజలకు నమస్కారం. త్యాగాలు, పోరాటాలకు పుట్టినిల్లు మదనపల్లె.స్వాతంత్రోద్యమం సమయంలో మహాత్మా గాంధీ మదనపల్లెకు వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ విరాళాలు ఇచ్చింది ఇక్కడ ప్రజలే.బ్రిటిషర్ల దౌర్జన్యాలను నిరసిస్తూ ఇక్కడి బీటీ కళాశాల విద్యార్థులే వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమణను బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసింది బీటీ కళాశాలలోనే.

అటువంటి పోరాటాల మదనపల్లె గడ్డపైన ఈరోజు నేను మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నా.యువగళం…మన గళం…ప్రజా బలం.యువగళంతో జగన్ గజ గజ వణుకుతున్నాడు. బిల్డప్ బాబాయ్ జగన్ ముందు భారీ డైలాగులు కొట్టాడు. నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు అన్నాడు. సింహం సింగిల్ గా వస్తుంది అన్నాడు.

యువగళం పాదయాత్ర లో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు జగన్ చెత్త పాలన ని ఉతికి ఆరేస్తున్నారు. జగన్ కి ప్రజలు భయాన్ని పరిచయం చేశాం.అందుకే ఇప్పుడు అందరూ విడివిడిగా పోటీ చెయ్యండి అని అడుక్కుంటున్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలకు జగన్ చేసింది ఏంటి? గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేశారు. కేవలం ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపే జగన్ ఎజెండా.

సంక్షేమ పాలన అందిస్తాడు అని ప్రజలు అనుకుంటే ఆయన జేసీబీ పరిపాలన అందించాడు.ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ జేసీబీ పాలన మొదలైంది. టిడిపి నాయకుల ఇళ్ళు కూల్చడం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేసి జైలుకి పంపడం.సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేసి కొట్టించారు. పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడిన సుబ్బారావు గుప్తా బండి లో గంజాయి పెట్టి అరెస్ట్ చేసారు. ఇందుకా జగన్ రెడ్డి నువ్వు సీఎం అయ్యింది.

చంద్రబాబు పాలనలో సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్… జగన్ పాలనలో ఫినిష్ ఆంధ్రప్రదేశ్.చంద్రబాబు గారి పాలనలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి. జగన్ పాలనలో అభివృద్ధి నిల్లు…గంజాయి ఫుల్లు. జగన్ గంజాయి కి బ్రాండ్ అంబాసిడర్. గూగుల్ లో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కొడితే ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది.

చంద్రబాబు పాలనలో కియా…జగన్ పాలనలో ఫిష్ ఆంధ్రా, చికెన్ ఆంధ్రా, మటన్ ఆంధ్రా. అవి కూడా తెరిచిన 6 నెలల్లోనే 99 శాతం మూతపడ్డాయి.చంద్రబాబు పాలనలో అన్న క్యాంటిన్, పెళ్లి కానుక, పండుగ కానుక, విదేశీ విద్య… జగన్ పాలనలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్.
చంద్రబాబు పాలనలో రాష్ట్రం పెట్టుబడుల్లో నంబర్1, ఉద్యోగాల కల్పన లో నంబర్ 1, అగ్రికల్చర్ గ్రోత్ లో నంబర్ 1…జగన్ పాలనలో అప్పుల్లో నంబర్1, పెట్రోల్, డీజిల్ ధరల్లో నంబర్1, నిత్యావసర సరుకుల ధరల్లో నంబర్1, చెత్త పన్ను లో నంబర్1, ఆర్టీసీ ఛార్జీల పెంపులో నంబర్ 1, ఇంటి పన్ను లో నంబర్1.అందుకే చంద్రబాబు ది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్…జగన్ ది ఫినిష్ ఆంధ్రప్రదేశ్.

జగన్ ఇచ్చే ప్రతి స్కీం లోనూ ఒక స్కాం ఉంటుంది… ప్రతి హామీ లోనూ ఒక స్కాం ఉంటుంది. అందుకే ఆయన్ని నేను జగన్ మోహన్ అని కాకుండా స్కామ్ మోహన్ అని పిలుస్తా. ఫీజు రీయంబర్స్మెంట్ ఎత్తేసాడు. విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు సరిగ్గా వెయ్యడు ఎందుకో తెలుసా పిల్లలంతా చదువుకోని పాస్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకుంటే ఉద్యోగాలు కల్పించాలి. ఈయన మొహం చూసి కంపెనీలు రావు. ఇదే విద్యా దీవెన, వసతి దీవెన వెనుక స్కామ్. యువతను మోసం చేసాడు.2.30 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి ఏడాది 6500 పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సి, ఏది అమలు కాలేదు.

టిడిపి అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. నిరుద్యోగ భృతి మళ్లీ ప్రారంభిస్తాం. 45 ఏళ్లకే బీసీ,ఎస్సి,ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పెన్షన్ అన్నాడు. మద్యపాన నిషేధం, దిశ చట్టం అన్నాడు. ఒక్క హామీ నెరవేర్చకపోగా మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టి 25 వేల కోట్లు అప్పు తెచ్చాడు. రైతులకు భరోసా 13,500 ఇస్తా అన్నాడు. ఇస్తుంది 7,500 అంటే 6 వేలు స్కామ్. ఒక్కో రైతుకి 30 వేలు నష్టం.మోటార్లకు మీటర్లు పెట్టడం వలన వృధా తప్ప ఆదా లేదని ప్రయాస్ అనే సంస్థ తేల్చేసింది. రూ. 6500 కోట్ల ప్రజాధనం వృధా తప్ప ఉపయోగం ఏమి లేదు. మీటర్లు రైతుల పాలిట ఉరి తాళ్ళుగా మారబోతున్నాయి,
వృద్ధులకు ఒకే సారి మూడు వేల పెన్షన్ అన్నాడు. కానీ ఏడాదికి రూ.250 మాత్రమే పెంచాడు. ఇందులో స్కామ్ ఎంతో తెలుసా ఒక్కో అవ్వా, తాత నుండి జగన్ కొట్టేసిన డబ్బు 18000 వేలు.పేదలకి ఇళ్లు పేరుతో స్థలాలు కొనడం, చదును చెయ్యడం, పట్టాలు అమ్ముకోవడం ద్వారా వైసిపి నేతలు 25 వేల కోట్లు కొట్టేశారు.జగన్ పాలనలో మైనార్టీలకు జరిగిన న్యాయం ఏంటో ఒక్క సారి ఆలోచించండి. మైనార్టీలకు వెన్నుపోటు పొడిచింది జగన్.

స్కామ్ మోహన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి లోన్ వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య పధకాలు రద్దు. మసీదు, ఈద్గాల అభివృద్ధి కి నిధులు కేటాయించడం లేదు.రాష్ట్ర చరిత్ర లో ఎప్పుడూ ముస్లింలపై ఇన్ని దాడులు జరగలేదు.అబ్దుల్ సలాం, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇన్ని ఘటనలు జరిగినా జగన్ కనీసం ఒక్క కేసులో కూడా వైసిపి నాయకుల పై చర్యలు తీసుకోలేదు.

ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చి మోసం చేసాడు. టిడిపి అధికారం లోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.మదనపల్లికి ఎంత మంది ఎమ్మెల్యేలో మీకు తెలుసా? నలుగురు ఎమ్మెల్యేలు.మదనపల్లి అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, అనధికారిక ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, వైకాపా నాయకుల అవినీతి
ఎమ్మెల్యే నవాజ్ బాష తన బినామీలను అడ్డుపెట్టుకుని పట్టణంలోని బెంగళూరు బస్టాండు, కదిరి రోడ్డులోని వక్ఫ్ బోర్డు పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ ల నుంచి ప్రతినెలా ఐదు లక్షల రూపాయల అద్దె వసూలు చేసి తన సొంతానికి వాడుకుంటున్నారు. నాలుగేళ్లలో రెండున్నర కోట్లు రూపాయలు ఆయన కాజేశారు.

జామియా మసీదు, జామియా టిప్పు సుల్తాన్ మసీదు ఖాతాల్లోని 23 లక్షల రూపాయలను ఎమ్మెల్యే సొంతానికి మళ్లించుకున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాష బినామీలను అడ్డుపెట్టుకుని మదనపల్లె పట్టణంలో వెంచర్లు వేస్తున్నారు. కొంత ప్రైవేట్ స్థలం కొనుక్కొని ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎమ్మెల్యే బినామీలు లేఅవుట్లు వేస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో ఎమ్మెల్యే ఇలా రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాలు ప్రభుత్వ, డీకేటీ భూములు ఆక్రమించారు.మదనపల్లి పట్టణంలో ఎవరు లే ఔట్లు వేయాలన్నా ఎమ్మెల్యే నవాజ్ బాష అనుమతి తీసుకోవాలి. ఆ లేఔట్లలో ఎమ్మెల్యేకు స్థలం ఇవ్వడంతోపాటు పది లక్షల రూపాయలు కప్పం కట్టాలి.

సీటీఎం చెరువును ఎమ్మెల్యే నవాజ్ బాష, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి అనుచరులు 30 ఎకరాలు ఆక్రమించారు.ఎమ్మెల్యే నవాజ్ భాష కరోనా సమయంలో బంగారు దుకాణాలు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బులతో పేదలకు నిత్యావసర సరకులు పంచుతానని చెప్పి మొత్తం డబ్బులు ఎమ్మెల్యే నవాజ్ బాషనే జేబులోనే వేసుకున్నారు.

వలసపల్లి దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీకి చెందిన మూడు ఎకరాల భూమిని లారీ ఓనర్స్ అసోసియేషన్ పేరు చెప్పి ఎమ్మెల్యే నవాజ్ బాష తన బినామీల ద్వారా 12 కోట్ల రూపాయల విలువైన భూమిని లాక్కున్నారు. కదిరి రోడ్డులో దళితుల పేరిట ఉన్న రెండు ఎకరాల భూమినీ ఎమ్మెల్యే నవాజ్ భాష వదలలేదు. బసినికొండ రోడ్డులో అగ్గిపెట్ట పరిశ్రమ కార్మికులకు చెందిన 20 కోట్ల రూపాయల విలువైన రెండు ఎకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ భాష ఆక్రమించుకున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మనపల్లి మండలంలోని బాహుదా నది నుంచి రోజూ 50 టిప్పర్లలో ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా మంత్రి పెద్దిరెడ్డి ఒక మండలంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా రోజుకు 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.మదనపల్లి నియోజకవర్గంలో క్వారీలకు అనుమతులు రావాలంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. ఆయనకు కమీషన్ ఇచ్చుకోలేక దాదాపు 20 క్వారీలు మూతపడ్డాయి. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి విద్యుత్తు కార్మికులకు చెందిన ఐదు ఎకరాల భూమిని బలవంతంగా రాయించుకున్నారు. ఇలా 30 కోట్ల రూపాయల విలువైన భూమిని పోలీసుల ద్వారా బెదిరించి కార్మికుల నుంచి లాక్కున్నారు. ఎంతో చరిత్ర ఉన్న బీటీ కళాశాల ఆస్తులపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కన్ను పడింది. 43 ఎకరాల భూములను ఆయన కొట్టేయాలని చూస్తున్నారు.

మదనపల్లి నియోజకవర్గ సమస్యలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎక్కడ తాము ఒక జిల్లాకే పరిమితమవుతామో అనే స్వార్థంతో మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినా స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాషకు చీమ కుట్టినట్టైనా లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మదనపల్లె కేంద్రంగా పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లెను కలిపి జిల్లాగా చేసి మీ ఎన్నో ఏళ్ల కలను తెలుగుదేశం పార్టీ నెరవేరుస్తుందని హామీ ఇస్తున్నా.

మదనపల్లె పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తాం. మదనపల్లె పట్టణంలో ప్రజలకు నీటి ఇబ్బంది ఉండకూడదని తెలుగుదేశం హయాంలో హంద్రీనీవా కాలువలోని 59వ ప్యాకేజ్, చిప్పిలి, గుంటివారిపల్లి ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మాణాలకు కలిపి 180 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఎస్ఎస్ ట్యాంక్ ల పనులు 90 శాతం పూర్తి చేశాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 10 శాతం పనులు చేయలేకపోయింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేసి పెండింగ్ పనులు పూర్తి చేసి పట్టణంలో తాగునీటి సమస్య అన్నదే లేకుండా చూస్తాం.

మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో దాదాపు 20 వేల మగ్గాలు ఉన్నాయి. వీటిపై దాదాపు 60 వేల మంది ఆధారపడ్డారు. ఇక్కడి కార్మికులు ఎంతో నాణ్యతతో చీరలు నేస్తున్నప్పటికీ కష్టానికి తగిన రేటు లభించడం లేదు. ఇక్కడ నేసిన చీరలకే బ్రాండ్ వేసి ఇతర ప్రాంతాల్లో రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు వ్యాపారులు అమ్ముతున్నారు. కంచి, ధర్మవరం పట్టులా మాకూ ఒక బ్రాండ్ కావాలని మీరు కోరుతున్నారు. నీరుగట్టువారి పల్లె పట్టుకు బ్రాండ్ లేకపోవడంతో మీ కష్టానికి ఫలితం ఉండటం లేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టుకు ఒక బ్రాండ్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కింద 24వేల రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మన నీరుగట్టువారిపల్లెలోని 10 శాతం కార్మికులకు కూడా ఈ సాయం అందడం లేదు.పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం.

గ్రామాల్లో హౌస్ కం షెడ్స్, పట్టణాల్లో టిడ్కొ ఇల్లు, కామన్ వర్కింగ్ షెడ్స్ ఏర్పాటు చేస్తాం. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు వ్యాపారం చేసుకోవడానికి 30 శాతం సబ్సిడీ పైన రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కార్డు ఇచ్చాం. ఈ ప్రభుత్వం మాత్రం నేతన్నలను పట్టించుకోవడం లేదు. కరెంటు ఛార్జీలు కూడా చేనేత కార్మికులకు భారంగా మారాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మన మదనపల్లె పట్టణానికి సమీపంలోని సీటీఎంలో చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. అప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకూ నెరవేర్చలేదు. దీంతో నేతన్నలు కమర్షియల్ రేటు ప్రకారం విద్యుత్తు ఛార్జీలు చెల్లిస్తున్నారు.

హంద్రీనీవా పనులు పూర్తిచేసి మదనపల్లెకు తెలుగుదేశం హయాంలోనే కృష్ణా జలాలు అందించాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో రెండుసార్లు నామమాత్రంగా నీళ్లు అందించింది. ఈ సంవత్సరం అది కూడా ఇవ్వలేదు.ఆసియాలోని అతిపెద్ద టమాట మార్కెట్ మన మదనపల్లిలోనే ఉంది. ఇక్కడ గిట్టుబాటు ధరలు లభించక రైతులు రోడ్డుపైనే, పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

టమాట ఎక్కువుగా పండించే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం రైతులకు లాభం చేకూర్చేలా టమాట వాల్యూ చైన్ ప్రాజెక్టు తీసుకురావాలని నాటి టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 70 కోట్లు, కేంద్రం వాటా 40 కోట్లు.టమాట రైతుల పెట్టుబడి తగ్గించడం దగ్గర నుండి గిట్టుబాటు ధర వరకూ ప్రభుత్వ సాయం అందాలి అనేది ఆ ముఖ్య ఉద్దేశం.

కానీ వైసిపి ప్రభుత్వం దానిని అటక ఎక్కించింది. నేను మదనపల్లి టమాట మార్కెట్ ని దత్తత తీసుకుంటాను. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం.ఒక్క బుట్ట టమాట కూడా రోడ్డు మీద పారబోసే పరిస్థితి రాకుండా చూడటం నా బాధ్యత.

పాపాల మిథున్ రెడ్డి కి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరి హయాంలో జిల్లా అభివృద్ది చెందిందో చర్చకు నేను సిద్దం. రేపు తంబళ్లపల్లెలో ఉంటా పాపాల మిథున్ రెడ్డి వస్తే చర్చకు నేను సిద్దం.

టిడిపి హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు కల్పించింది, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది టిడిపి. ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియా లు తెచ్చింది పాపాల పెద్ది రెడ్డి కుటుంబం. నాలుగేళ్లలో పెద్ది రెడ్డి కుటుంబం దోచుకుంది 10 వేల కోట్లు.మదనపల్లికి కంపెనీలు రాకపోవడానికి పెద్దిరెడ్డి కుటుంబమే కారణం. జగన్ సీన్ అయిపోయింది. రాబోయేది టిడిపి ప్రభుత్వం. రాష్ట్రాన్ని అభివృద్ది చేసేది టిడిపి.

 

Leave a Reply