Suryaa.co.in

Andhra Pradesh

జగన్ కిరికిరి – చలో అలిపిరి..

  • జగన్ కు భక్తి, విశ్వాసాలు ఉంటే గుండు చేయించుకోవాలి
  • తిరుమల (విశ్వాస) డిక్లరేషన్ రిజిస్టర్లో జగన్ సంతకం పెడతానని ప్రకటిస్తేనే దర్శనానికి అనుమతినివ్వాలి
    రెచ్చగొడుతున్న జగన్ ను అలిపిరి నడక మార్గం వద్ద భారీ స్థాయిలో భక్త బృందాలు,హిందూ సంఘాలు, స్వామీజీలు సంయుక్తంగా కలసి కచ్చితంగా అడ్డుకొని తీరుతాం
  • జగన్ హిందు ధర్మ విశ్వాసాలను రెచ్చగొట్టేందు కోసమే తిరుమల దర్శనం
  • ఒక రకంగా హిందూ ధర్మం పై దాడి చేసేందుకోసమే జగన్ కుట్ర

అమరావతి: గుంటూరు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో 13 జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు సిరిపురపు శ్రీధర్ శర్మ, దాసరి రాము, వనమా నరేంద్ర, డా. కోనేరు శ్రీవిద్య,జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, వావిలాల కుమార్ లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28న తిరుమల కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుని తీరుతానని చెప్పటం హిందు మత,ధర్మ విశ్వాసాలను, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కావాలనే రెచ్చగొట్టటమేనని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక రకంగా హిందూ ధర్మం పట్ల జగన్ చేస్తున్న దాడిగానే భావించాలని నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ కు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పై నమ్మకము,విశ్వాసము, భక్తి,భయము ఉంటే, జగన్కు దమ్ముంటే ఆయన భార్య భారతితో సహా కొండపైకి కాలినడకన వచ్చి స్వామివారికి భక్తి పూర్వకంగా విశ్వాస పూర్వకంగా తలనీలాలు సమర్పించి జగన్ గుండు చేయించుకోవాలని జేఏసీ నేతలు చాలెంజ్ చేశారు.

భక్తి విశ్వాసాలు ఉన్నవారు స్వామివారి భక్తులుగా గుండు చేయించుకోవడం అనేది సాంప్రదాయ బద్ధంగా, ఆనవాయితీగా తమ జీవిత కాలంలో అనేక పర్యాయాలు వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి, గుండు చేయించుకొని తమకున్న భక్తి ప్రపత్తులను, మొక్కుబడులను గుండు ద్వారా స్వామికి తీర్చుకుంటారని, సాంప్రదాయబద్ధంగా వైఎస్ జగన్ కూడా గుండు చేయించుకొని, తన సచ్ఛిలతను భక్తుల సమక్షంలో రుజువు చేసుకోవాలని, అప్పుడే జగన్న నమ్ముతామని, లేనిపక్షంలో తన స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి భక్తులను రెచ్చగొట్టి నీచ రాజకీయం చేసేందుకోసమే తిరుమల పర్యటనని, ఈ పర్యటన కేవలం మతాల,కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే జగన్ భయంకరమైన కుట్రను పన్నారని, ఈ విషయంపై తాను గతంలో కూడా కూటమి ప్రభుత్వానికి మీడియాల ద్వారా తెలియజేశామని జేఏసీ నేతలు తెలిపారు.

ఈ విషపూరిత కుట్రను ఇలదైవం వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు, హిందు ధార్మిక సంఘాలు, సంతులు స్వామీజీలు అందరూ కలసి “జగన్ కిరికిరి” ~ “చలో అలిపిరి” పేరుతో కచ్చితంగా అడ్డుకోని తీరుతామని జై సినేతలు హెచ్చరించారు. జగన్, అతని తండ్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్యమతానికి చెందినవారై వుండి తిరుమలకు వచ్చిన అనేక సందర్భలలో అక్కడ (విశ్వాస) డిక్లరేషన్ రిజిస్టర్ లో గత 20 ఏళ్లల్లో ఏనాడు కూడా తండ్రి కొడుకులు సంతకాలు చేయలేదని, భక్తులు, పీఠాధిపతులు, జర్నలిస్టులు చెప్పినా సరే వినకుండా గతంలో తాము ముఖ్యమంత్రులమని తాము సంతకాలు పెట్టేది ఏంటి అని అహంకార ధోరణితో, అధికార మదంతో ప్రవర్తించారని, వెంకటేశ్వర స్వామి వారి పట్ల, హిందూ ధర్మ సాంప్రదాయాల పట్ల తండ్రి, కొడుకులు ఎన్నో అపచారాలు చేశారని చెప్పారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఏనాడు తన భార్యతో కలిసి స్వామివారి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదని, తీర్థం ఇస్తే తాగకుండా, అక్షింతలు వేస్తే దులిపేసుకుని, ప్రసాదం ఇస్తే పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయని, ఇటువంటి వ్యక్తి గత ఐదేళ్లలో తన బంధువులైన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లను చైర్మన్ లుగా, ఈవోగా ధర్మారెడ్డిలను నియమించి తిరుమలను అపవిత్రం చేసి, వ్యాపారం చేస్తూ స్వామివారికి చెందాల్సిన కోట్ల సంపదను కొల్లగొట్టారని, లడ్డు, అన్నప్రసాదాలలో నకిలీ ఆవు నెయ్యి, కల్తీ ఆహార పదార్థాలను వాడి కమిషన్లు దండుకున్నారని, వీరికి దేవుడంటే కనీస భయం భక్తి కూడా లేదని, వీరు అప్పట్లో కనీస ప్రాయశ్చిత్తం కూడా చేసుకోకపోవడంతో ఏడుకొండలు ఎందుకు రెండు కొండలు చాలు అన్న వ్యక్తి అదే పావురాల కొండగుట్టలలో ము ముక్కలుగా మారిపోయెలా ఆ కలియుగ దైవం శిక్ష విధించారని, ఇప్పుడు జగన్ కూడా దైవం పట్ల తన తండ్రి చేసిన తప్పులనే మరలా, మరల చేస్తూన్నాడని, భక్తుల మనోభావాలు,దైవం పట్ల అతని మాటలు, ప్రవర్తన, చేష్టలు చూస్తుంటే భగవంతుడు విధించే శిక్ష కోసం జగన్ ఎదురుచూస్తున్నట్లుగా ఉందని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తెచ్చేందుకు కోసమే జగన్ ఇటువంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ ఏర్పడిన తొలి రోజుల్లోనే దాని ఈ విషయం చంద్రబాబు ప్రభుత్వానికి తెలియజేశానని, ఇప్పటికైనా సరే చంద్రబాబు కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ కుట్రను భంగ్నం చేసి జగన్ పై, వైసిపి నాయకులు పై చట్టరీత్యా కఠిన చర్యలు చేపట్టాలని జేఏసీ నేతలునేతలు డిమాండ్ చేశారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల జగన్ కు భక్తి విశ్వాసాలు ఉంటే కనుక తాను కచ్చితంగా స్వామివారికి తలనీలాలు సమర్పించి గుండు చేయించుకుంటానని, తిరుమల స్వామివారి డిక్లరేషన్ రిజిస్టర్లో సంతకం పెడతానని మీడియా ముఖంగా బహిరంగంగా ప్రకటిస్తే కనుక అలిపిరి వద్ద తాము అడ్డుకోపోబోమని, జగన్ను స్వాగతిస్తామని, లేనిపక్షంలో అలిపిరి వద్ద 28వ తేదీన హిందు థార్మిక సంఘాలు, సనాతన ధర్మ పరిరక్షకులు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందాలతో కలసి కచ్చితంగా అడ్డుకొని తీరుతామని, భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని జగన్ ను జేఏసీ నేతలు హెచ్చరించారు.

ఈనెల 28వ తారీఖున తిరుమలకు కాలినడకన వెళ్లే అలిపిరి మార్గం వద్దకు హిందూ సంఘాలు,సనాతన ధర్మ పరిరక్షకులు, శ్రీవెంకటేశ్వర స్వామి భక్త బృందాలు, రాజకీయ పార్టీలకతీతంగా వేలాదిగా అలిపిరి నడక మార్గానికి చేరుకోవాలని జేఏసీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శానం రమేష్, పెద్దింటి కృష్ణ చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వడ్లమూడి నాగేశ్వరావు,పెమ్మరాజు సుధాకర్ , నల్లపనేని అమర్నాథ్, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్, పోలూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE