జగన్ అంటే ఓ నిజం: లేళ్ళ అప్పిరెడ్డి

పేరులోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’ నామ సంవత్సరం, ఇటు రాష్ట్రానికి, అటు ప్రజలకు అన్ని రంగాల్లో మరింత శుభాలను చేకూర్చాలని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆకాంక్షించారు.తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే రీతిలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవనం వినిపించారు.

ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, జగన్ అంటే ఓ నిజం… నమ్మకానికి ప్రతిరూపమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్యం, ప్రజారోగ్యం, సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, ఒక మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితాలను గడిపారని, నేటి నుంచి ప్రారంభం కానున్న తెలుగు వారి కొత్త సంవత్సరాది శుభ కృత్ పర్వదిన తొలి రోజు నుండే ప్రజలందరికి శుభాలు సంతోషాలు మరిన్నో కలగాలని, ఏపీ అంటే అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఆనందోత్సాహాలతో జీవించాలని లేళ్ళ అప్పిరెడ్డి అభిలషించారు.

ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున, నవరత్నాల పధకం వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply