దొడ్డిదారిన, దుర్మార్గపు ఆలోచనలతో అధికారంలోకి రావాలని జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు

– సజ్జల భార్గవ్ రెడ్డి ఆ కుట్రను ఆచరణలో పెడుతున్నారు
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వీరి ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా మంగళగిరి రూరల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలుగుదేశం-జనసేన పార్టీలపై తప్పుడు వార్తలను శృష్టిస్తున్నారు. టీడీపీ-జనసేన పార్టీల సీట్ల ఉమ్మడి జాబితా అంటూ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి సంతకాన్ని ఫోర్జరి చేసి ఒక ఫేక్ లెటర్‌ను వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ…ఎన్ని కుతంత్రాలు, నీచ పనులు చేసైనా అధికారాన్ని కాపాడుకోవాలని జగన్ రెడ్డి తపనపడుతున్నాడు. అందులో భాగంగానే ఒక ఫేక్ లేటర్‌ను రిలీజ్ చేయించాడు. టీడీపీ-జనసేన పార్టీల సీట్ల ఉమ్మడి జాబితా అంటూ, చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకున్నారని.. ఓ పనికిమాలిన సజ్జల భార్గవ్ రెడ్డి ఈ ఫేక్ లెటర్‌ను ప్రచారం చేశారు. ఈ కుట్రకు ఆధ్యుడు జగన్ రెడ్డి. దానికి మద్దతుదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆచరణలో పెట్టేది సజ్జల భార్గవ్ రెడ్డి. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నదిలో కొట్టుకుపోతుంది.

అందుకే ఏ నీఛ పనులైన చేసి ఒడ్డుకు చేరాలని చూస్తున్నారు. ఇటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. వాటిపై కూడా ఎన్నో ఫిర్యాదులు చేశాం. వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చిన్న పోస్ట్ పెట్టాడని ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లుగా ఎన్నారై ఎశస్వీని అరెస్ట్ చేశారు.

రామాల మన్విత్ కృష్ణారెడ్డి అనే కరుడు కట్టిన వైకాపా కార్యకర్త తెలుగుదేశం నాయకుడిలా పోజ్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేలా విడియోస్ చేస్తున్నాడు. దానిపై సీఐడీ డీజీకి, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇక రాష్ట్రంలో సీఐడీ ఉన్నా లేనట్లే. రాష్ట్రంలో సీఐడీని మూసివేస్తే మంచిదని వర్ల అన్నారు.

సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివాడు ఇక ప్రజలకు ఏం చేస్తాడు? వైఎస్ షర్మిల రోడ్డున పడి జగన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నాడు. జగన్ రెడ్డి భాగోతం, పనికిరానితనం, డొల్లతనం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని వర్ల అన్నారు. గెలుపు కోసం అక్రమాలకు, అవినీతికి, మోసాలకు, ఫోర్జరీకి పాల్పడటం “రాజకీయ వ్యభిచారం” అని ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గుర్తించాలని వర్ల రామయ్య తెలియజేశారు.

ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలిస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోను కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యదు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, రాష్ట్ర టీడీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్, నేతలు ఎస్పీ సాహెబ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply