హైకోర్టు తీర్పుతోనైనా జగన్ బుద్ది తెచ్చుకుని అమరావతి అభివృద్ధికి పాటుపడాలి

– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి
హైకోర్టు తీర్పుతోనైనా జగన్ బుద్ధి తెచ్చుకొని అమరావతి అభివృద్ధికి పాటుపడాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి సీఎం జగన్ కు సూచించారు.. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి అమరావతిని చంపేయడంవల్ల రాష్టానికి చాలా నష్టం వాటిల్లిందని జగన్ గ్రహించాలి.. 2 లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టించే అమరావతిని చంపి జగన్ సోయి, సొంపు లేకుండా ఉన్నాడు. 5 లక్షల మందికి ఉపాధి కల్పించే అమరావతి ప్రాజెక్టును నాశనం చేశారు.
30 వేల మంది పనివాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రాజధాని అమరావతిలో కట్టడాలు కట్టడం కుదరదన్నావు. అక్కడ వరదలొస్తాయన్నారు. చాలా లోతులో పునాదులు వేస్తేగాని ఇళ్లు నిర్మించలేమన్నావు. డబ్బులు చేతులు మారిందన్నావు, ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పి రాజధాని నిర్మాణానికి జగన్ మోకాలడ్డారన్నారు. గుంటూరు-విజయవాడ మధ్య ఎంతో మంది ఉపాధి కోల్పోయారన్నారు. స్వచ్చందంగా 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన అమరావతి రైతులను జగన్ నిండా మోసం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రానికి రావాల్సిన రాబడులు కృష్ణార్పణమయ్యాయి.
అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతకు ముందు సుప్రీం కోర్టు కూడా చెప్పింది. అమరావతి విషయంలో జగన్ కు అనుకూలంగా ఒక్క తీర్పు రాలేదు. అసెంబ్లీలో అమరావతి రాజధానికి అంగీకరించడంతో అమరావతి రైతులు జగన్ ను నమ్మి మోసపోయారు., ఆ తర్వాత మాట మార్చారు. రాజధాని చిన్న ముక్క, ఆ ముక్కను మూడు ముక్కలు చేస్తామనడంలో అర్థంలేదు. అనేక కుల, మతాలు అమరావతిలో ఉంటే.. ఒకే కులంవారున్నారనడమేంటి?. ప్రభుత్వ అసమర్థతతో ఉన్న పరిశ్రమలు పోయాయి, వచ్చే పరిశ్రమలు రాకుండా పోతున్నాయి.
ఎన్నికలకు ముందు సర్పంచుల్లో ఆశలు కల్పించి, ప్రస్తుతం వారిని నిరాశపరిచారు. రాష్ట్రాభివృద్ధికి ప్రాజెక్టులు, కంపెనీలు అవసరం, ఏ ఒక్కటి రాష్ట్రానికి రాలేదు. అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధాని చేసి అభివృద్ధి చేస్తాననడంలో అర్థంలేదు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశావు. ఉద్యోగస్థులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావు. సీపీఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తామనడంతో వారు నమ్మి మోసపోయారు. బాదుడే బాదుడు అని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను బాదుతున్నావు. చివరకు అమరావతి రైతులే గెలుస్తారని జగన్ గ్రహించాలి. ఇప్పటికైనా మనసు మార్చుకొని జగన్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి సూచించారు.

Leave a Reply