– విద్యుత్ టెండర్లను తనబినామీ కంపెనీలకు కట్టబెట్టి, అడ్డగోలుగా పనుల్ని ప్యాకేజీలుగా విభజించి వేలకోట్ల స్వాహాకు సిద్ధమైన జగన్.
• జగన్ తన బినామీ కంపెనీలు అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ , రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీలకు కలిపి ఒక్క ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ డిస్కమ్ పరిధిలోనే రూ. 4,592.61కోట్లు దోచిపెట్టాడు.
• రాష్ట్రంలోని మూడుడిస్కంల పరిధిలో అన్నిజిల్లాల్లో కలిపి ఈ దోపిడీ రూ.13 నుంచి రూ.14వేలకోట్ల వరకు ఉంటుంది.
• రైతులమెళ్లకుఉరితాళ్లు బిగించే దిక్కుమాలిన పనికోసం జగన్ తన బినామీ కంపెనీలకు ఈ విధంగా వేలకోట్లు దోచిపెట్టి, తిరిగి ఆసొమ్ముతోనే వచ్చేఎన్నికల్లో ఓట్లుకొనడానికి ప్రణాళికలు వేశాడు.
• విద్యుత్ టెండర్ల ప్రక్రియ, కంపెనీల ఎంపిక, టెండర్లు కట్టబెట్టిన విధానంపై పుంగనూరు పుడింగి మంత్రి పెద్దిరెడ్డి నోరువిప్పాలి.
• జగన్ ప్రజల నమ్మకం, భవిష్యత్ కాదు.. 5 కోట్లప్రజలు జగన్ తమకు పట్టిన దరిద్రం, రాష్ట్రానికి పట్టిన పెద్దశని అనుకుంటున్నారు.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
జగన్ రెడ్డికి బాగానచ్చిన పదం దోచుకో, పంచుకో, తినుకో (DPT) అని, ఆ పదంపై ఆయన కు ఎందుకంత మోజా అనిఆలోచిస్తే ఆయన ఈనాలుగేళ్లలో చేసిన రకరకాల స్కాములు గుర్తొస్తాయని, ఆ క్రమంలోనే తానుచేసిన స్కాముల్ని ఇతరులపై రుద్దే ప్రయత్నంచేస్తున్నా డని, ప్రధానప్రతిపక్షంపై బురదజల్లే ప్రయత్నాలుచేస్తున్నాడని టీడీపీ జాతీయఅధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …
“జగన్ కు దోచుకో, పంచుకో, తినుకో (DPT) అనేమాటలు ఊతపదాలుగా మారాయి. 4ఏళ్ల నుంచి చంద్రబాబుపై, టీడీపీపై, పసలేని ఆరోపణలుచేయడం తప్ప, చిన్నమరకకూడా జగన్ అంటించలేకపోయాడు. తవ్వుతున్నా..తోడుతున్నా అంటూ ప్రజలకు కట్టుకథలు చెబుతు న్నాడుగానీ, దేన్ని నిరూపించలేకపోయాడు. కానీ తెలుగుదేశం పక్షాన తాముమాత్రం జగన్ అవినీతిని, అతనిఎమ్మెల్యేల దోపిడీని ఆధారాలతోసహా బయటపెడుతున్నాం. యువగళం పాదయాత్రలో లోకే శ్ గారు వైసీపీఎమ్మెల్యేల అవినీతి చిట్టాను, దోపిడీని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. జగన్ డీపీటీ స్కీమ్ లో భాగంగా కొత్త కుంభకోణాన్ని తాము నేడు ప్రజలముందు ఉంచుతున్నాం.
విద్యుత్ శాఖలో జగన్ సరికొత్త DPT స్కీమ్. ఆర్.డీ.ఎస్.ఎస్ పథకంకింద వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, మీటర్లు బిగించే కార్యక్రమానికి సంబంధించి బినామీకంపెనీల్ని అడ్డుపెట్టుకొని రూ.14వేలకోట్ల దోపిడీకి తెరలేపిన జగన్
జగన్ సరికొత్త డీపీటీ స్కీమ్ విద్యుత్ శాఖకు సంబంధించింది. మీటర్లు బిగించే వ్వవహారం పేరుతో జగన్ రెడ్డి ఎన్నివేలకోట్ల కుంభకోణానికి తెరలేపాడో ఇదివరకే పత్రికల్లో చూశాం. తనకు సంబంధించిన బినామీకంపెనీలకి టెండర్లుకట్టబెట్టడంద్వారా రూ.13 నుంచి రూ.14 వేలకోట్ల కుంభకోణానికి తెరలేపాడు. స్మార్ట్ మీటర్లు, వ్యవసాయవిద్యుత్ కనెక్షన్లకు సంబం ధించిన మీటర్ల బిగింపువెనక దాగిఉన్న వేలకోట్ల కుంభకోణాన్ని నేడు ప్రజలముందు ఉంచు తున్నాం. ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ కు సంబంధించి ఆర్. డీ.ఎస్.ఎస్ స్కీమ్ కింద (రీ వ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) ఈ మధ్యనే టెండర్లు పిలిచారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి మీటర్లబిగింపునకు సంబంధించి పిలిచిన టెండర్లలో ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ పరిధిలో రూ.4,592కోట్లను జగన్ తనకుచెందిన రెండు కంపెనీలకు దోచిపెట్టాడు.
వాటిలో జగన్ కు అతిప్రీతిపాత్రమైన కంపెనీ షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ. ఆ కంపెనీకి సగందోచిపెట్టి, తనకు అత్యంతసన్నిహితుడైన మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన మెస్సర్స్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సగం కట్టబెట్టాడు. విద్యుత్ టెండ ర్లతో కన్ స్ట్రక్షన్ కంపెనీకి ఏంటి సంబంధం? మెస్సర్స్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ ఇండియాప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమానులైన పొంగులేటి కుటుంబానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యాపారలావాదేవీలున్నాయన్నది జగమెరిగి సత్యం. వైసీపీ మాజీఎంపీ శ్రీ నివాసరెడ్డి అనేకసందర్భాల్లో జగన్ కుటుంబం తనసొంత కుటుంబం అని బహిరంగంగానే చెప్పాడు. ఆయన కంపెనీని తీసుకొచ్చి, దానికి అనుభవం లేదని ఎన్.సీ.సీ కంపెనీని తోకలాగా తగిలించి, జాయింట్ వెంచర్ ఏర్పాటుచేసి, దానికి దోచిపెట్టారు. మరోకంపెనీ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ జగన్ కజిన్ బ్రదర్ అయిన ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డికి అనుంగుఅనుచరుడైన విశ్వేశ్వర్ రెడ్డిది.
కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పనులకు సంబంధించి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టిన మొత్తం రూ.2535.66కోట్లు
ఏఏ జిల్లాలో ఆకంపెనీలకు ఎంతెంతదోచిపెట్టారో చూద్దాం. టెండర్ దక్కినతర్వాత నోటిఫికేషన్ ఆఫ్ అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ వారు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి ఇచ్చిన లిఖితపూర్వ క డాక్యుమెంట్లో కడప, కర్నూలుజిల్లాలకు సంబంధించిన ఒకప్యాకేజీకి రూ.1098.85కోట్ల రూపాయలు, అవే జిల్లాల్లోని మరోప్యాకేజీకి రూ.243.35కోట్లు కలిపి రూ.1342.20కోట్ల టెండర్లు షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టినట్టు చెప్పారు. అనంతపురంజిల్లాలో ఒకప్యాకేజీకి సంబంధించి రూ.985.80కోట్లు, మరోప్యాకేజీకింద రూ.207.76కోట్లటెండర్లు కట్టబెట్టారు. మూడుజిల్లాల్లో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు రూ.2,535.66కోట్లటెండర్లు దోచిపెట్టారు. టెండర్ దక్కినట్టు సదరుకంపెనీకి ఇచ్చిన లేఖలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ను, ‘సోల్ బిడ్డర్’ గా పేర్కొ న్నారు. అది ఎలా సాధ్యమైందో మంత్రి పెద్దిరెడ్డి జవాబు చెప్పాలి.
ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి మెస్సర్స్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి రూ.2056.95కోట్లు కట్టబెట్టారు
అదేవిధంగా ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ డిస్కమ్ పరిధిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన మెస్స ర్స్ రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీకి దోచిపెట్టిన వివరాలుకూడా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒకప్యాకేజీకింద రూ.1188.61కోట్లు, మరోప్యాకేజీ కింద రూ.215.65 కోట్లు, కలిపి మొత్తం రూ.1404.26కోట్లు సదరుసంస్థకు దోచిపెట్టారు. అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒకప్యాకేజీ కింద రూ.551.86కోట్లు, మరోప్యాకేజీ కింద రూ.100.84 కోట్లు కలిపి దాదాపుగా రూ.652.70కోట్లు. ఆవిధంగా చిత్తూరు నెల్లూరుజిల్లాల్లో పెద్దిరెడ్డి వ్యాపార భాగస్వామి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి రూ.2,056.95కోట్లు దోచిపెట్టారు. జగన్ చెబుతున్న దోచుకో, పంచుకో, తినుకోకి నిజమైన రూపం ఈ టెండర్ల దోపిడీకాదా? జగన్ తన బినామీ కంపెనీలు అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ , రాఘవ కన్ స్ట్రక్షన్స్ కంపెనీలకుకలిపి ఒక్క డిస్కమ్ పరిధి లోనే రూ. 4,592.61కోట్లు దోచిపెట్టాడు. ఇదికేవలం ఒక్క డిస్కం (ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్) పరిధిలో జరిగిన వ్యవహారం. రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాలు అయిన కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించే ఈ మొ త్తాన్ని దోచిపెట్టారు. ప్రపంచంలో మరేకంపెనీలు లేవన్నట్టు ఈరెండు కంపెనీలకే టెండర్లు కట్టబెట్టి ప్రజల సొమ్ముని ఈ విధంగా అడ్డగోలుగా దోచిపెడతారా? ఈ వ్యవహారంపై పుంగనూరు పుడింగి ఏంసమాధానం చెబుతాడు? రైతులమెడకు ఉరితాళ్లు బిగించే ఒకదిక్కుమాలిన పనికోసం రూ.4,592కోట్లు దోచిపెడతారా? ఇలాంటి బినామీకంపెనీలతో జగన్ ఎంతగా దోచిపెడుతున్నాడో రాష్ట్రప్రజలంతా ఆలోచించాలి.
విద్యుత్ టెండర్ల ముసుగులో తనబినామీ కంపెనీలకు జిల్లాలవారీగా ప్యాకేజీలుగా విభజించి పనులు కట్టబెట్టిన వైనంపై మంత్రిపెద్దిరెడ్డి నోరువిప్పాల్సిందే. లేకపోతే జగన్ దోచుకో, పంచు కో, తినుకో (DPT) అనే తనస్కీమ్ ను తూచాతప్పకుండా అమలుచేశాడనే భావించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం అంతాకూడా గప్ చుప్ గా సరిగ్గా ఎన్నికలకు 10నెలల ముందు జరిగేలా ప్రణాలికలు వేశాడు.
ఈ విధంగా వేలకోట్లు మింగి, ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ప్లాన్ చేశాడు. ఎలాగోలా అవినీతిసొమ్ముతో ఎన్నికల్లో గెలవాలన్నదే జగన్ ఆలోచన. విద్యుత్ టెండర్ల ముసుగులోతనబినామీ కంపెనీలకు వేలకోట్లు దోచిపెట్టిన జగన్ దోచుకో, పంచుకో, తినుకో (DPT) స్కీమ్ బాగోతంపై మంత్రిపెద్దిరెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. రూ.2535కోట్ల విలువైన టెండర్ సోల్ బిడ్డర్ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టినట్టు అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్లో స్పష్టంగా పేర్కొన్నారు. అడ్డగోలుగా అలా ఎలాకట్టబెట్టారో కూడా పెద్దిరెడ్డిచెప్పాలి. ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ పరిధిలోనే రూ.4592 కోట్ల టెండర్లను జగన్ తనబినామీ కంపెనీలకు ధారాధత్తంచేస్తే, మొత్తంగా రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో రూ.13 నుంచి రూ.14వేలకోట్ల టెండర్లు దోచిపెట్టినట్టు అర్థమవు తోంది. ఒక్కో స్మార్ట్ మీటర్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ ను రూ.35వేలకు కట్టబెట్టేందుకు జగన్ గతంలో సిద్ధమైతే, టీడీపీ ప్రశ్నించింది. పత్రికలు ప్రసారమాధ్యమాలు కూడా జగన్ ని నిలదీయడంతో అప్పుడు వెనక్కుతగ్గాడు. కానీ మరలా అదేమొత్తానికి తనబినామీ కంపెనీలకు ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ పరిధిలోని టెండర్లను కట్టబెట్టినట్టు లభించిన ఆధారాలనుబట్టి తేలిపోయింది. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో టెండర్లకు సంబంధిం చిన పూర్తివాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని పెద్దిరెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.
ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొని ఎంతధరలుకోట్ చేశాయో, టెండర్ల ప్రక్రియలో జరిగిందేమిటో, రివర్స్ టెండరింగ్ లో ఏకంపెనీ ఎంతకోట్ చేసిందనే వాస్తవాలను పెద్దిరెడ్డి ప్రజల ముందు ఉంచాల్సిందే. మంత్రి పెద్దిరెడ్డి నోరువిప్పకపోతే, జగన్ విద్యుత్ టెండర్లలో దోచుకో, పంచుకో, తినుకో (DPT) విధానాన్ని అమలుచేసి రూ.14వేలకోట్లు కొట్టేశాడనే ప్రజలంతా భావించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి ఏరకంగా తమ బినామీ కంపెనీలకు ఒక్క ఏపీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ పరిధిలోనే రూ.4592కోట్లు ఎలాదోచిపెట్టారో, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీడియా వారికి అందిస్తున్నాం. షిర్డిసాయి కంపెనీని సోల్ బిడ్డర్ గా ఎందుకు పరిగణించారో కూడా చెప్పాలి. దోచుకో, పంచుకో, తినుకో (DPT) మాటల్ని పదేపదే పైకిచెబుతున్న జగన్, దాన్నే విద్యుత్ టెండర్లలో అమలుచేసి, వేలకోట్లు మింగేశాడు. ఇన్నివేలకోట్లు మింగేస్తూ, మరోపక్క ప్రజలంతా మానమ్మకం నువ్వే జగన్, మాభవిష్యత్ జగన్ తోనే అనమని చెప్పడం, ఇళ్లకు తనబొమ్మతోకూడిన స్టిక్కర్లు అంటించమనడానికి ముఖ్యమంత్రికి నిజంగా సిగ్గుండాలి. జగన్ ను 5కోట్ల రాష్ట్రప్రజలు తమ నమ్మకం, భవిష్యత్ గా కాకుండా, తమకు పట్టినదరిద్రంగా భావిస్తున్నారన్న నిజాన్ని సైకోసీఎం ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిది.” అని పట్టాభిరామ్ తేల్చిచెప్పారు.