Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటాడుకున్న జగన్

* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
* కేజీబీవీ, ఎంజేపీ స్కూళ్లను సందర్శించిన మంత్రి
* టీడీపీ హయాంలోనే విద్యా ప్రగతి
-భవనాలకు రంగులు, సొంత పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదు
* ఆకట్టుకున్న విద్యార్థుల డ్రమ్స్ వాయిద్యం

సత్యసాయి జిల్లా పెనుకొండ: మీకు ఏ అవసరం వచ్చినా… ఏం కావాలన్నా… నాకు ఒక్క కాల్ చేస్తే మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రొద్ద మండలంలోని MJP , కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత భరోసా ఇచ్చారు. గడిచిన అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటాలాడుకుందని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వాలు నిర్మించిన భవనాలే నేటికీ ఉన్నాయని అన్నారు.

ఆదివారం రొద్ద మండలంలోని కేజీబీవీ స్కూలు, కళాశాల, ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు. రొద్దంలో MJP , కేజీబీవీ,బాలికల జూనియర్ కళాశాల విద్యాలయాన్ని టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి, భవన నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసిందన్నారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల కేజేబీవీ భవన నిర్మాణం నిలచిపోయిందన్నారు.

చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, తప్పనిసరి అర్థాంతం నిలిచిపోయిన MJP భవన నిర్మాణం పూర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. గడిచిన 5 ఏళ్లలో విద్యా రంగం నీరుగారిపోయిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ప్రభుత్వం ఆటాలాడుకుందని మండిపడ్డారు. భవనాలకు రంగులు వేయడం, బటన్ నొక్కడం, తన సొంత పత్రికలో ప్రకటనలు ఇప్పించుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తమ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యిస్తోందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఒక్క కాల్ చేయండి సమస్యలు పరిష్కరిస్తా …

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థులు, కేజీబీవీ సిబ్బంది అటెండన్స్ రిజిస్టర్లను, తరగతి గదులను, హాస్టల్ గదులను మంత్రి సవితమ్మ క్షుణ్నంగా పరిశీలించారు. కిచెన్ గదిలోకి వెళ్లి అప్పటికే వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అక్కడున్న కూరగాయలను కూడా పరిశీలించారు. బాత్ రూమ్ లు, మరుగుదొడ్లను, నీటి సరఫరా పైప్ ల పనితీరుతో పాటు కేజీబీవీ పరిసరాలను కూడా కూడా మంత్రి సవిత పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. భోజన సదుపాయం బాగుందా…టీచర్లను బాగా బోధిస్తున్నారా..? అని విద్యార్థులను అడిగారు. ఏమైనా సమస్యలుంటే చెప్పాలని మంత్రి సూచించారు. విద్యార్థినుల అడిగినట్లు… త్వరలోనే కేజీబీవీ వాల్ కాంపౌండ్ ను నిర్మిస్తామన్నారు. చదువుతో క్రీడల్లోనూ రాణించాలని, ఇందుకు అవసరమైన కిట్లు అందజేస్తామని విద్యార్థినులకు మంత్రి హామీ ఇచ్చారు.

పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి …

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ ప్రిన్సిపల్ కు, వైద్య సిబ్బందికి మంత్రి సవితమ్మ స్పష్టం చేశారు. ముందుగా ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ ను మంత్రి సందర్శించారు.

అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఒకరిద్దరు విద్యార్థులు నీరసంగా ఉండడంతో కారణమేంటని మంత్రి ఆరా తీశారు. ప్రిన్సిపల్ ను, నర్సును పిలిపించి విద్యార్థికి ఎప్పటికప్పుడు ట్యాబెలెట్లు ఇవ్వాలని, వైద్యులకు చూపించాలని మంత్రి ఆదేశించారు. మరో విద్యార్థి బలహీనంగా ఉండడంపైనా మంత్రి ఆరా తీశారు. భోజనం తింటున్నావా… సమయానికి ఆహారం పెడుతున్నారా..? అని ఆ విద్యార్థిని అడిగారు.

ఆకట్టుకున్న విద్యార్థుల డ్రమ్ వాయిద్యం

రాబోయే పరీక్షల్లో పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని తెలిపారు. మన రాజధాని ఏది… మన ముఖ్యమంత్రి ఎవరు… విద్యా శాఖ మంత్రి పేరేంటి..? అని విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. అంతకుముందు ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ సందర్శనకు వచ్చిన మంత్రి సవితకు స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు డ్రమ్స్ వాయిస్తూ, మార్చ్ ఫాస్ట్ చేశారు. మంత్రిని స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE