9 సార్లు కరెంట్ చార్జీలు పెంచిన ఘనుడు జగన్‌ రెడ్డి

-టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తేనే అందరికీ మనుగడ
-దళితులతో ఓట్లు వేయించుకుని వారినే హతమారుస్తున్న ప్రభుత్వమిది
-జగన్ సర్కారుపై కన్నా విమర్శనాస్త్రాలు

– ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడు గ్రామంలో (బాబు షూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ )కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…..మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా మహిళా సాధికారత చేకూర్చడం, తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15000 ఇవ్వనున్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు.

20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మనమందరం కూడా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు చర్యలను చూస్తూనే ఉన్నామని వ్యవస్థల్ని నాశనం చేసాడని, జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేస్తూనే వచ్చాడని రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దోచుకున్నాడని రాజ్యాంగబద్ధంగా 14 శాతం నిధులు మీకు రావాలని చట్టానికి వ్యతిరేకంగా కొన్ని వేల కోట్లు దోచుకున్నాడని వెల్లడించారు.

అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న పిల్లలకి దళితులకు చెందిన 27 పథకాలు రద్దు చేశాడని , దళితులకు ద్రోహం చేస్తూనే వచ్చాడని తను అధికారం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో సంపద మొత్తం దోచుకుంటున్నాడని భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని వెల్లడించారు.

కరెంటు బిల్లులు 9సార్లు పెంచిన ఘనుడిగా చరిత్రలో నిలిచిపోతాడని బస్ చార్జీలు బాదుడే బాదుడని తెలియజేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దళిత సోదరులందరూ మైనారిటీలు ఎస్సీలు,ఎస్టీలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే.. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో గోళ్ళపాడు గ్రామ తెదేపా, జనసేన నాయకులు గోపు చిరంజీవి గారు , గోపు శివయ్య గారు,రామిశెట్టి బుజ్జి గారు, గోనుగుంట్ల కృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు గొళ్లపాడు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply