Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అర్జునుడు కాడు..ఉత్తర కుమారుడు

• జగన్ రెడ్డి నిజాయితీపరుడైతే..రాప్తాడు సభలో చెప్పినవి నిజాలైతే టీడీపీ అధినేత సవాల్ పై ఎందుకు స్పందించలేదు?
• రాప్తాడు సభలో కల్తీమద్యం తాగి మత్తులో ఉన్న ప్రజల ముందు జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికి వీరంగం వేశాడు
• చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధం అనగానే తుర్రుమని తాడేపల్లికిపోయి తలుపులేసుకొని పడుకున్నాడు
• చంద్రబాబు అంటే అభివృద్ధి.. సంక్షేమం : జగన్ రెడ్డి అంటే జైలు..విధ్వంసం
• 99 శాతం హామీలు జగన్ రెడ్డి ఎక్కడ, ఎప్పుడు నెరవేర్చాడో ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధం. బహిరంగ చర్చకు ఎప్పుడు..ఎక్కడికి వస్తాడో ముఖ్యమంత్రే చెప్పాలి
• ప్రత్యేకహోదా..మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు.. జాబ్ క్యాలెండర్.. రైతులకు గిట్టుబాటుధర.. బీసీలకు చట్టబద్ధమైన సబ్ ప్లాన్..కాపు కార్పొరేషన్ కు ఎక్కువ నిధులు సహా అనేక హామీలపై ప్రజల ముందే జగన్ రెడ్డి నోరు విప్పేలా చేస్తాం
• జగన్ రెడ్డి అర్జునుడు కాడు.. ఉత్తరకుమారుడు. ఉత్తుత్తి ప్రగల్భాలతో ప్రజల్ని మోసగించగడం తప్ప ఏమీ చేయలేడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

ఓటమి భయంతో తీవ్రమైన నిరాశానిస్పృహల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చివరకు ఏం మాట్లాడుతున్నాడో తెలియనిస్థితిలో, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి, ఉమ్మడి రాష్ట్రంలో తనదైన అభివృద్ధి ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు, రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పే దుస్థితికి దిగజారాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే .. చంద్రబాబు సవాల్ విసిరి 24 గంటలైనా జగన్ రెడ్డి నుంచి స్పందనలేదు. “ అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న జగన్ రెడ్డి ప్రయాణించిన రోడ్లు చంద్రబాబు హాయాంలో వేసినవే. ఆఖరికి ఆ జిల్లాలో ఉద్యానవన పంటలకు, పులివెందుల నియోజకవర్గంలో చీనీతోటలకు నీళ్లిచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. టీడీపీప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం కళ్ల కు కట్టినట్టు కనిపిస్తున్నా చూడలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు.

మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ఇప్పటికే రాప్తాడు సభలో జగన్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేసి 24 గంటలైనా స్పందనలేదు. జగన్ రెడ్డి స్పందించడు సరే.. ఆయన మంత్రులు… వైసీపీనేతలు ఎందుకు నోరు మెదపలేదు? సిద్ధం అంటూ ప్రజలసొమ్ముతో బహిరంగసభలు పెట్టి, ఆ సభలకు వచ్చే జనానికి మద్యం, బిర్యానీలు పంచి మత్తులో ఉన్నవాళ్ల ముందు నోటికొచ్చి నట్టు మాట్లాడి, తుర్రుమని తిరిగి తాడేపల్లి కొంపలో పడుకుంటే సరిపోతుందా జగన్ రెడ్డి? 99శాతం హామీలు ఎక్కడ, ఎప్పుడు నెరవేర్చావో కూడా ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం జగన్ రెడ్డి. బహిరంగ చర్చకు ఎప్పుడు..ఎక్కడికి వస్తావో చెప్పు?

2019 ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు మచ్చుకు కొన్ని…
“25 ఎంపీ స్థానాలు అప్పగిస్తే, ప్రత్యేకహోదా సాధిస్తాను”, మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం, సీపీఎస్ అనేది మన ప్రభుత్వం వచ్చిన వారంలోనే రద్దుచేస్తాం, ఏటా జనవరి1న ప్రభుత్వ ఉద్యోగాలభర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తాం, 200యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తాం, పోలవరం ప్రాజెక్ట్ ని 2021 జూన్ నాటికి పూర్తిచేసి నీళ్లిస్తాం, పంట ఉత్పత్తులు మార్కెట్లకు రాకముందే పొలాల్లోనే కొని, రైతులకు వెంటనే గిట్టుబాటు ధర చెల్లిస్తాం, సమగ్ర సబ్ ప్లాన్ చట్టాన్ని చట్టబద్దంగా తీసుకొచ్చి, బీసీలకు మూడోవంతు నిధులు కేటాయిస్తాం, కేవలం బీసీలకే 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, విజయవా డలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, కాపు కార్పొరేషన్ కు చంద్రబాబు కేటాయించిన నిధులకంటే రెట్టింపు నిధులు కేటాయిస్తాం. ఇవీ జగన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పిన మాటలు.

ఇవన్నీ అధికారంలోకి వచ్చాక అమలు చేశాడా అని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఒక్కటీ అమలుచేయలేదు. అయినా సిగ్గులేకుండా 99శాతం హామీలు అమలు చేశానని డబ్బా కొట్టుకుంటున్నాడు. పాదయాత్రలో గానీ, ఎన్నికల ప్రచారంలో గానీ జగన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో కేవలం 15శాతమే అమలుచేశాడని, 85శాతం హామీల అమల్లో ఘోరంగా విఫలమయ్యాడని వాస్తవాలతో టీడీపీ 6 నెలల క్రితమే పుస్తకం ప్రచురించింది. ఆ పుస్తకంలోని అంశాలపై చర్చకు రావాలని టీడీపీ సవాల్ చేసినా వైసీపీ నుంచి ఎలాంటి స్పందనాలేదు.

చంద్రబాబు అంటేనే అభివృద్ధి.. సంక్షేమం : జగన్ అంటే అవినీతి..విధ్వంసం!
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధికి మారుపేరు అంటారు. విజనరీ నాయకుడని ప్రశంసిస్తారు. జగన్ అంటే జైలు పేరు చెబుతారు. జగన్ అంటే ఈడీ విచారణలు..సీబీఐ కేసులు. జగన్ చరిత్ర మొత్తం అవినీతిమయం. అధికారం కోసం బాబాయ్ ని చంపించిన నేర చరిత్ర జగన్ రెడ్డి ది. అలాంటి వ్యక్తి సిద్ధం పేరుతో ప్రజలముందు అబద్ధాలు చెప్పి, ఉత్తుత్తి సవాళ్లు విసిరి, టీడీపీ సవాల్ చేస్తే బయటకు రావడానికి జంకుతున్నాడు. జగన్ ఎన్నాళ్లు దాక్కుంటాడో చూస్తాం. అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొట్టైనా సరే బయటకు తీసుకొచ్చి ప్రజలముందు నిలబెడతాం.

కల్తీమద్యం.. అక్రమ ఇసుకదోపిడీతో కొట్టేసిన సొమ్మే జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చాడు. ఆయన జేబులో నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు
మద్యనిషేధం చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి కొత్త మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీమద్యం అమ్మించి రూ.2లక్షలకోట్లు కొట్టేశాడు. నూతన ఇసుక పాలసీ పేరుతో అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.50వేల కోట్లు కొట్టేశాడు. కేవలం ఈ రెండు మార్గాల్లో ప్రజలనుంచి కొట్టేసిన సొమ్మునే జగన్ రెడ్డి బటన్ నొక్కుడు ద్వారా తిరిగి ప్రజలకు పంచాడు. రాప్తాడు సభలో ప్రజలకు ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చానని జగన్ రెడ్డి గొప్పగా చెప్పాడు.

మరి ఇప్పుడు మద్యం, ఇసుక దోపిడీ ద్వారా కొట్టేసిన సొమ్మునే తిరిగి వారికి ఇచ్చాడని మేం అంటున్నాం. అవరసరమైతే మేం చెప్పిన అంశాల్ని ప్రజల ఎదుటే నిరూపిస్తాం. జగన్ రెడ్డి బహిరంగచర్చకు వచ్చి మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగల వా? మద్యం, ఇసుకలో కొట్టేసిందే ప్రజలకు ఇస్తే, ఇన్నేళ్లలో తెచ్చిన అప్పులసొమ్ము రూ.12లక్షల కోట్లు ఎటుపోయాయి జగన్ రెడ్డి? ఖనిజసంపద లూఠీ చేసిన సొమ్ము ఎటుపోయింది? గనులు కొల్లగొట్టిన సొమ్ము ఏమైంది? 5 ఏళ్ల నీ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా జగన్ రెడ్డి?

కనీసం రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క రూపాయైనా ఇచ్చావా? విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి, ఐదేళ్లలో ప్రజలపై రూ.60వేల కోట్ల భారం మోపావు. ఇదేనా జగన్ రెడ్డి నువ్వు నీ పాలనలో సాధించిన ఘనత? 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పి, చివరకు ఎన్నికల ముంగిట యువతను వంచించడానికి కేవలం 6,100 ఉద్యోగాలతో డీఎస్సీ విడుదల చేశా వు. అమ్మఒడి పథకానికి కోతలు పెట్టావు. రైతు భరోసాకు రంగులు పూశావు. చంద్రబాబు పేదల కడుపు నింపడానికి తీసుకొచ్చిన అన్యాక్యాంటీన్లు రద్దు చేశావు. ఇదేగా 5ఏళ్లలో నువ్వు సాధించిన గొప్పతనం జగన్ రెడ్డి?

జగన్ రెడ్డి … దేనికి సిద్ధమంటే!
ప్రశ్నించే వారిపై దాడులు చేయడానికి…తన పార్టీ వారితో చేయించడానికి. అందుకు నిదర్శనం… రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ సహా, మరో విలేకరిపై వైసీపీవారితో దాడి చేయించడమే. ఇంతకు ముందు టీడీపీ వారిపై దాడులుచేయించి, ఎన్నో తప్పుడు కేసులు పెట్టించాడు. తన సభకు వచ్చిన జనం.. తాను చెప్పే మాటలు నిజమైతే జగన్ రెడ్డి తన పార్టీ వారితో విలేకరులపై ఎందుకు దాడులు చేయించాడు?

ఎందుకు పత్రికాస్వేఛ్చను హరిస్తూ జీవోలు ఇచ్చాడు? ఎందుకు పత్రికాధిపతులపై తప్పుడు కేసులు పెట్టించాడు? గతంలో తునిలో ఆంధ్రజ్యోతి విలేకరిని ఎందుకు హత్యచేయించారు? జగన్ రెడ్డి ఇలాంటి వాటికేనా నువ్వూ..నీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాప్తాడు సిద్ధం సభకోసం జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశాడు. ఆర్టీసీ బస్సుల్ని తన సభలకు తరలించడంతో ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. (ఒక ప్రయాణికుడి ఆవేదనకు సంబంధించిన వీడియోను బొండా ఉమా విలేకరులకు చూపించారు)

ఫ్యాన్ లోపల ఉంటే… సైకిల్ బయట ఉంటుందా జగన్ రెడ్డి? నిజమే సైకిల్ ఎప్పుడూ జనంలో ఉంటే.. ఫ్యాన్ ఎప్పుడు ఊడిపోతానా అన్న భయంతో లోపల నాలుగ్గోడల మధ్య ఉంటుంది. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. మీ రాజధాని ఏది అంటే ప్రజలు తలదించుకునే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి.

జగన్ రెడ్డి నిజాయితీపరుడైతే, రాప్తాడు సభలో చెప్పినవన్నీ నిజాలైతే చంద్రబాబు సవాల్ కు ఎందుకు స్పందించలేదు?
జగన్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే.. రాప్తాడు సభలో ఆయన చెప్పినవన్నీ నిజాలైతే టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా ఎందుకు బయటకు రాలే దు? ప్రజల సమక్షంలో భారీ బహిరంగసభ పెడదాం.. అక్కడే చర్చిద్దాం. ఆంధ్రపదేశ్ లో ఎక్కడైనా జగన్ రెడ్డితో మా నాయకుడు చర్చకు సిద్ధం. ప్రజలు.. విలేకరులు..న్యాయ నిపుణుల సమక్షంలో చర్చకు సిద్ధం. ప్రజాకోర్టులో జగన్ రెడ్డి బొంకుతున్న అబద్ధాలను పటాపంచలు చేయడానికి మేం సిద్ధం.

సంబరాల రాంబాబు.. కోతల రాంబాబు..ఉత్తుత్తి ట్వీట్లు ఆపేసి జగన్ రెడ్డిని బహిరంగ చర్చకు తీసుకురావాలి
సంబరాల రాంబాబు ఉత్తుత్తి ట్వీట్లు పెట్టుకోవడం మానేసి, చంద్రబాబు విసిరిన సవాల్ పై జగన్ రెడ్డి స్పందించేలా చేస్తే బాగుంటుంది. “మాజీ ముఖ్యమంత్రి ఇలా అంటున్నాడయ్యా… ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ప్రజల మధ్యకు వచ్చి సమాధానం చెప్పాలి” అని కోతలుకోసే రాంబాబు జగన్ రెడ్డికి చెప్తే సంతోషిస్తాం. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జగన్ రెడ్డి సింగిల్ డిజిట్ కు పరిమితమవ్వడం ఖాయం. ఏమీ చేయకుండానే జగన్ రెడ్డి అన్నీ చేశానని చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పేవాటిలో నిజానిజాలు ఏమిటో తెలియాలంటే చంద్రబాబు విసిరిన సవాల్ పై ముఖ్యమంత్రి స్పందించాల్సిందే.

జగన్ రెడ్డి వద్ద సరుకు లేదుకాబట్టే.. రాప్తాడుసభలో కేకలేసి, తాడేపల్లిలో పడుకున్నాడు. జగన్ రెడ్డి అర్జునుడు కాదు.. ఉత్తరకుమారుడు. ఉత్తుత్తి ప్రగల్భాలు పలకడడం తప్ప ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి లేదు. జగన్ రెడ్డి నైజం ఏంటో ప్రజలకు తెలిసిపోయాక, వైసీపీ పేటీఎం కుక్కలు పిచ్చికూతలు కూయడం మానుకోవాలి. జర్నలిస్టుల్ని చంపబోయారంటే వైసీపీ నేతలు ఎంతకు దిగజారా రో అర్థం చేసుకోవచ్చు. టీడీపీనేతల్ని చంపబోయారు… ఇప్పుడువిలేకరులపై పడ్డారు.. భవిష్యత్ లో ఓట్లేయలేదని ప్రజల్ని చంపేసినా ఆశ్చర్యంలేదు.

175 స్థానాల్లోపోటీచేసే వైసీపీ అభ్యర్థుల పేర్లు జగన్ రెడ్డి బయటపెట్టగలడా? జగన్ రెడ్డి చర్యలతో విసిగిపోయి.. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే పారిపోతున్నారు. కొడాలినాని పనికిమాలిన వ్యక్తి అని తెలిసే జగన్ రెడ్డి అతన్ని మంత్రి పదవి నుంచి తప్పించాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా తప్పించడం చాలా సాధారణమైన విషయం. క్రిమినల్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. వాటి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. ” అని బొండా ఉమా వ్యాఖ్యానించారు

LEAVE A RESPONSE