Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అర్జునుడు కాదు..అక్రమార్జనుడు

-పులివెందుల కుటుంబ పంచాయతీని..రాష్ట్ర సమస్య చేయాలని చూస్తున్నారు
-తాను కేసుల నుండి బయటపడేందుకు చనిపోయిన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్
-వైఎస్ పేరును ప్రధాన ముద్ధాయిగా చేర్చాలని అఫిడవిట్ వేశావా..లేదా జగన్?
-బెయిల్ కోసం నాడు సోనియాతో బేరాలాడాడు
-జగన్ పాలనలో ప్రజలు మరింత పేదలయ్యారు
-జగన్ జలగలా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు
-చింతలపూడి రా…కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

చింతలపూడి :- సీఎం జగన్ తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నాడు..ముమ్మాటికీ జగన్ అక్రమార్జనుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్ర సమస్యగా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను కేసుల నుండి బయటపడేందుకు చనిపోయిన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

‘‘చాలాసార్లు చింతలపూడి వచ్చాను…కానీ ఈసారి సభ ఎంతో మధురమైన జ్ఞాపకంలా నిలిచిపోతుంది. చింతలపూడి సభ చూస్తుంటే…గెలిచేది మనమే…ఇందులో అనుమానం లేదనిపిస్తుంది. మరో రెండు నెలల్లో సైకోని ఇంటికి పంపాల్సిందే. నా తెలుగింటి ఆడపడుచులు నావెంట ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించి జయిస్తా. రాష్ట్రంలోని యువత మొత్తం తెలుగుదేశం, జనసేనలోనే ఉన్నారు. మీరు తలుచుకుంటే విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. రాబోయే ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఈ గెలుపు మనకోసం కాదు.

ఒక కుటుంబ పెద్ద త్రాగుబోతు అయితే ఆ కుటుంబం చితికిపోతుంది. రాష్ట్ర పెద్ద సైకో అయితే ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. అదే మన రాష్ట్రంలో జరగింది. జగన్ రెడ్డి మన రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. జగన్ రెడ్డి దిగిపోవడం కాదు..ప్రజలే జగన్ రెడ్డిని బరించే స్థితిలో లేరు. ప్రజలే జగన్ రెడ్డిని ఇంటికి పంపుతారు. యువత జీవితాలను నాశనం చేశాడు. రాష్ట్ర ప్రజలను రూ.12 లక్షల కోట్లు అప్పుల్లో ముంచాడు. జగన్ రెడ్డి నాశనం చేసిన రాష్ట్రాన్ని పున:నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం కావాలి. మీరందరు తోడుగా ఉంటే ఆ బాధ్యత నేను తీసుకుంటా.

జలగలా జగన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడు
ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా నష్టపోయారు. ఇచ్చేది పదయితే దోచుకునేది తొంభై. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. విద్యుత్ వినియోగదారులపై రూ.64 వేల కోట్ల భారాలు మోపాడు. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని మద్యంపై దోచుకుంటున్నాడు. ఒక క్వార్టర్ మందులో రూ.150 లు జగన్ రెడ్డి కమీషన్ కొట్టేస్తున్నాడు. ఈ విధంగా జగన్ అనే జలగ ఏడాదికి రూ.54 వేల రూపాయలు మద్యం తాగేవారి నుంచి దోచేస్తున్నాడు.

ఈ దోపిడీకి జగన్ రెడ్డిని ఏం చేయాలి?. జే బ్రాండ్ల మందు తాగిన 30 లక్షల మంది అనారోగ్యం పాలు కాగా, 30 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, ఈ జగన్ అనే జలగ మాత్రం ప్రజల రక్తాన్ని త్రాగుతూనే ఉన్నాడు. ఇంటిపై పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలను పెంచాడు. జగన్ రెడ్డి పంచభూతాలను మింగేసే అక్రమార్జునుడు. నా జీవితంలో ఇంతటి అక్రమార్జునుడి చూడలేదు.

నిత్యవసర సరుకుల ధరలన్నీపెరిగాయి
నాడు పెట్రోల్ రూ.76 ఉంటే నేడు రూ.111, నాడు డీజీల్ రూ.70 ఉంటే రూ.99, నాడు బియ్యం రూ.40 ఉంటే నేడు రూ.56, నాడు కందిపప్పు రూ.87 ఉంటే నేడు రూ.160, నాడు చింతపండు రూ.120 ఉంటే నేడు రూ.240, నాడు వంటనూనె రూ.60 ఉంటే నేడు రూ.120, నాడు పంచధార రూ.26 నేడు రూ.45, నాడు గ్యాస్ సిలెండర్ రూ.726 నేడు ఇప్పుడు రూ.1175, నాడుకంరెంటు బిల్లు రూ.200 ఉంటే నేడు రూ.1000, నాడు మద్యం క్వార్టర్ రూ.60 ఉంటే నేడు రూ.200, నాడు కేబుల్ టీవీ రూ.149 ఉంటే నేడు రూ.350 చేశారు.

జగన్ రెడ్డి ధరల బాధుడుతో ఒక్కో ఇంటిపై దాదాపు రూ.8 లక్షల భారం పడింది. ఇవి కాకుండా ఐదేళ్లలో రూ.12 లక్షల కోట్లు అప్పు చేశాడు. జగన్ రెడ్డి జైలుకెళ్లుతాడు. ఈ అప్పు కూడా మనపైనే పడుతుంది. కరెంటు ఛార్జీలు పెరగడంతో కరెంటుపై ఆధారపడి ఉత్పత్తి అయ్యే ప్రతీ వస్తువు రేటు పెరిగింది. ఆ మేరకు ఆ భారాలు మనపైనే పడుతుంది.

సామాన్యుడు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు
తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే…ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ 5 వేలుకు అమ్ముతున్నారు. నేడు ఇసుక బంగారమైపోయింది. కేజీల లెక్కన అమ్ముతున్నారు. ఇసుక నిలుపుదల చేయడంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. నేడు సామాన్యుడు ఇళ్లు కట్టుకేనే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయమే. రోడ్లకెందుకు బటన్ నొక్కలేదని జగన్ రెడ్డి అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు.

రాష్ట్రానికి సంపద సృష్టించాలి. రాష్ట్రానికి ఆదాయం పెంచాలంటే అమరావతి లాంటి రాజధానిని కట్టాలి. అమరావతికి రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే దాన్ని నాశనం చేశాడు. రాజధానిని నాశనం చేయడంతో ప్రజలకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ప్రజలు అప్పుల పాలయ్యారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు.

పోలవరం ఏపీకి వరం
పోలవరాన్ని విభజన చట్టంలో చేర్చడానికి ఎంతో కష్టపడ్డాం. అది మనమే సాధించాం. పోలవరం ముంపుకు గురయ్యే 7 మండలాలను రాష్ట్రంలో కలపడానికి ఎంతో పోరాటం చేశాం. పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరిగా గతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో వారం వారం పోలవరం కార్యక్రమం పెట్టుకుని 72 శాతం పూర్తి చేశాం. పట్టిసీమను ఒక్క ఏడాదిలో పూర్తి చేసి ఆ నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. పోలవరం పూర్తి చేసి ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను కలలుకన్నాను.

చింతలపూడి సభ వేదికపై నుంచి అడుగుతున్నా. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి జగన్ రెడ్డి కారణం కాదా? పోలవరం 2024కు కాదుకదా ఎప్పుడు పూర్తవుతుందో అర్ధం కాని పరిస్థితి. అయినా పర్వాలేదు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రం సహకారం తీసుకుని పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటా. రూ.4,900 కోట్లు ఖర్చు చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే నూజివీడుతో సహా చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. రాబోయే ప్రభుత్వంలో చింతలపూడిని పూర్తి చేసి ప్రతీ ఎకరాకు నీళ్లేచ్చే బాధ్యత తీసుకుంటాను.

పామాయిల్ రైతులను ఆదుకుంటా
చింతలపూడిలో ఫామాయిల్ ను సాగుచేస్తారు. ఈ పంటను మొట్టమొదటగా ఇక్కడ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మలేషియా నుంచి ఫామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ సాగు మొదలు పెట్టారు. నాడు ఒక మొక్కకు రూ.40 లు సబ్సిడీ ఇచ్చాం. పురుగుమందులు, డ్రిప్ ఇర్రిగేషన్‌కు సబ్సిడీ ఇచ్చాం. నేడు జగన్ రెడ్డి సబ్సిడీలన్నీ ఎత్తేశాడు. ఒకప్పుడు ఫామాయిల్ టన్నుకు రూ.18 వేలు వస్తే నేడు రూ.12 వేలు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు.

మార్కెట్‌లో ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా రైతులను ఆదుకున్నాం. చింతలపూడిలో ఫామాయిల్, ఆక్వా పంటలు దెబ్బతిన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫామియిల్ రైతులును ఆదుకుంటాం. ఆక్వాకు యూనిట్‌కు రూ.1.50 పైసలకే ఇచ్చి ఆక్వాను ఆదుకుంటాం. మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తాం. చింతలపూడి పథకాన్ని పూర్తి చేసి నీళ్లిస్తే ఇక్కడి రైతులు వాణిజ్య పంటలు వేసి ఎంతో అభివృద్ధి చెందుతారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
ప్రతీ రాజకీయ నాయకుడు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆలోచించాలి. అంతేకానీ, ముద్దులు పెట్టి, లేనిపోని హామీలు ఇచ్చి మోసం చేసే నాయకులను నమ్మకూడదు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే నేడు హైదరాబాద్ దేశానికే తలమానికంగా మారింది. ఐటీ, ఇంజనీరింగ్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నేడు ఏ దేశానికి వెళ్లిన తెలుగు బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. యువతను ప్రోత్సహిస్తే ఏదైనా సాధించగలరు. యువతతో నేను నడుస్తా…వారికి అండగా నిలబడుతా.

సూపర్ సిక్స్ ద్వారా సంవత్సరానికి 4 లక్షలు…ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జగన్ రెడ్డి యువకులకు ఉద్యోగాలు ఇచ్చానంటాడు. ఏం ఉద్యోగాలు ఇచ్చాడో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే…జగన్ రెడ్డి మద్యం షాపులో, పిష్ మార్టుల్లో ఉద్యోగాలు ఇచ్చాడు. జగన్ రెడ్డి యువతను హోటల్లో సర్వర్లుగా చేయాలనుకుంటే నేను యువతను ఐటీ ఇంజనీర్లుగా, పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నది నా ఆకాంక్ష. ఉద్యోగం వచ్చే వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా. జగన్ రెడ్డి గంజాయి తీసుకొచ్చి యువత భవితను నాశనం చేశాడు.

తెలుగుదేశం –జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే వర్క్ ఫ్రం హోం తీసుకొచ్చిన యువత ఇంటి నుంచే అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేసుకునే వాతావరణం తీసుకొస్తాం. మండల హెడ్ క్వార్టర్లలో వర్క్ స్టేషన్లు పెట్టి యువతకు శిక్షణ ఇస్తాం. పిల్లలను కష్టపడి చదివించే ఏ తల్లీదండ్రి ఇబ్బందులు పడకుండా చూసుకుంటాం.

జగన్ ను ఇంటికి పంపే శక్తి మహిళలకు ఉంది
ఆడబిడ్డలు కూడా మగవారితో సమానంగా చదువుకోవాలని నాడు పద్మావతి యూనివర్శిటీ స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత నేను వచ్చి డ్వాక్రా సంఘాలు స్థాపించి ఆడబిడ్డల సత్తాను ప్రపంచానికి చూపించాం. నాడు ఆడబిడ్డలు సంకాలో పుస్తకాలు పెట్టుకుని చదువుకోవడానికి వెళుతుంటే అందరూ ఎగతాళి చేశారు. కానీ నేడు వారే కుటుంబాలను నడిపి, మగవారికి ఆర్ధిక సహాయం చేసే స్థితికి ఎదిగారు.

ఆడబిడ్డలను సమానంగా చదివిస్తే వారు ఎన్నో అద్భుతాలు సాధిస్తారని ఉద్యోగాలు, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. వరకట్నం పోయి రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం కృషే. తెలుగు మహిళలు పేదరికం నుంచి బయటపడేలా నెలకు రూ.1500 లు వారి అకౌంట్లలో వేస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం. దీన్ని ఏడాదికి లక్షా 50 వేలు చేసేలా మార్గం చూపిస్తాం. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తాం. జగన్ మోహన్ రెడ్డి ఇళ్లలో దీపాలు ఆర్పేశాడు. ఏదాడికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.

మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని లెక్కవేసి జలగన్నకు లేఖలు రాయాలని మహిళలను కోరుతున్నా. లేఖ రాసి ఎన్నికల్లో జటన్ నొక్కి జగన్ రెడ్డిని ఇంటికి పంపగల శక్తి మహిళలకు ఉంది. తెలుగు ఆడబిడ్డలను ఇంటికి లక్ష్మీదేవీలుగా తయారుచేసే బాధ్యత తెలుగుదేశం-జనసేన తీసుకుంటుంది. మహిళలకు ఏ ప్రభుత్వం మేలు చేస్తుందో మీరే బేరీజు వేసుకోవాలి.

టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తా
ప్రతీ రైతులకు అన్నదాత కింద రూ.20 వేలు ఇస్తాం. ప్రతీ ఇంటికి సురక్షిత మంచినీటిని ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. వారి కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇస్తున్నా. 200 ఫించన్ ను 2000 చేసిన ఘనత తెలుగుదేశంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేం తీసుకుంటామని మీకందరికి హామీ ఇస్తున్నాం. పేదవారికి రూ.2వేలు పింఛన్ ఇచ్చి 3 పూటలా అన్నా క్యాంటిన్ ద్వారా నాలుగైదు రూపాయలకే అన్నం పెట్టిన పార్టీ టీడీపీ. మొదటి తారీకున మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకా పెంచుతాం. ఫింఛను ఏనెలకు ఆనెల కాకుండా వృద్ధులు, వితంతువులు అందుబాటులో లేకపోతే మూడు నెలల వరకు ఎప్పుడొచ్చినా తిరిగి వారికి ఇంటికే పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మీకు సంతోషమేనా? టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ప్రతీ ఒక్క లబ్దిదారుడికి ఇచ్చే బాధ్యత నాది.

తన తండ్రిని చంపారన్న వారికే రాజ్యసభ
2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ రెడ్డి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డాడు. రూ.43 వేల కోట్లు అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. కానీ, తండ్రి పోయిన తర్వాత తండ్రిపై ఛార్జీషీటు దాఖలు చేయాలంటూ తన లాయర్లును కోరే పరిస్థితికి జగన్ రెడ్డి వచ్చాడు. చనిపోయిన తండ్రిపై ఛార్జీషీటు దాఖలు చేస్తే తప్పించుకోవచ్చని జగన్ రెడ్డి ఆలోచన. ఇది కన్న తండ్రికి ద్రోహం చేయడం కాదా? ఇలాంటి కొడుకును చూసి ఏ తండ్రి అయినా సంతోషిస్తాడా?

తన తండ్రి మరణానికి రిలయన్స్ వారు కారణమని వారి పెట్రోల్ బంకులపై దాడులు చేయించి చివరికి వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన ఘనుడు జగన్ రెడ్డి. ఈరోజు ఏఏజీగా పనిచేస్తున్న జగన్ రెడ్డి మనిషి రాజశేఖర్ రెడ్డిపై ఛార్జిషీటు దాఖలు చేయాలని నాడు సుప్రీంకోర్టులో పిటీషన్ వేయలేదా? దీనికి సమాధానం జగన్ రెడ్డి చెప్పగలడా? పులివెందుల పిల్లి జగన్ రెడ్డి జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నాడని సొంత చెల్లే చెప్పింది. వాళ్ల ఇంటి రహస్యాలను వాళ్లే బయటపెట్టుకునే పరిస్థితికి వచ్చారు.

పులివెందుల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కారాదు. వారి కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్రానికి చుడితే మంచిది కాదు. ఎన్నికలకు ముందు బాబాయిని చంపి ఆ హత్యను ఇతరుల పైకి నెట్టే ప్రయత్నం చేశారు. కోడికత్తి శ్రీను జైలులో ఉంటే…వివేకందరెడ్డిని చంపినవాడు రోడ్లపై తిరుగుతున్నాడు. ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఓకే ఇంట్లో వారు వేర్వేరు పార్టీలలో ఉన్నా ఒకరిపై ఒకరు అసభ్యంగా ప్రవర్తించుకోరు. నా భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నా జీవితంలో ఎప్పుడు బాధపడనంతగా బాధపడ్డాను.

జగన్ రెడ్డి సొంత చెల్లిని, తల్లిని కూడా వదిలిపెట్టలేదు. అందుకే జగన్ వద్దు…రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నా. జగన్ మోహన్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించడానికి నేనిచ్చే ఆయుధాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.

జగన్ వి..ఊసరవెళ్లి రాజకీయాలు
తెలుగుజాతి బాగుండాలన్నదే నా ఆశయం. 10 కోట్ల తెలుగువారు నా ఆత్మ బంధువులు. వారి కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తా. విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరాం. విభజన సమయంలో జగన్ మోహన్ రెడ్డి పార్లమెంటులో సోనియా గాంధీ వెనుక దాక్కుని నాటకాలు ఆడాడు. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో కూడా విభేదించి బయటకు వచ్చాను. అది రాష్ట్రం కోసమే. జగన్ మోహన్ రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు. మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి నేడు కేసులు కోసం మెడలు వంచి కేంద్రం ముందు మోకరిల్లుతున్నాడు. పోటీ చేసిన ఓడిపోతామని ఏలూరి ఎంపీ ముందుగానే పసిగట్టి తప్పుకున్నాడు.

ప్రక్క నియోజకవర్గానికి చెందిన ఎర్రిపప్ప మంత్రి ఆయన కొడుకుని ఇక్కడకు పంపుతున్నాడు. వీళ్లందరినీ మీరు తిరుగుటపాలో పంపించాలి. ఎలీజా గ్రాఫ్ పడిపోయింది అమలాపురం పంపుతున్నానంటే…ఆయన నీ గ్రాపూ పడిపోయిందని జగన్ రెడ్డికే చెప్పాడు. వైకాపాలో దళితులకు విలువలేదని ఎలీజా ఆక్రోసించాడు. గోదావరి జిల్లాల పెత్తనం మొత్తం పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డిది. ఇలాంటి వారు ఇక్కడకు వస్తే తరిమి తరిమి కొట్టాలి.

ఎలీజా చెప్పిందాట్లో వాస్తవాలు ఉన్నాయి. వైకాపాలో దళితులకు విలువ లేదు. ఉంగుటూరును దోచేస్తున్న వసూల్ రాజా కుప్పాల వాసుబాబు. చెరువులు, కాలువలు, చివరకు పోలవరం కుడికాలువ మొరం కూడా దోచేశాడు. నేడు వర్షాలు వస్తే పోలవరం కాలువల గట్లు కొట్టుకుపోయే పరిస్థితి. దెందులూరులో కొటారి అబ్బయ్య చౌదరి అక్రమాలకే అక్రమార్కుడు. అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. ఆ డబ్బు పిచ్చినేతగాడు, చింతమనేనిపై పెట్టని కేసులేదు. దీంతో వీళ్లు చింతమనేనిని పీకింది ఏమీలేదు.

కొటారి అబ్బయ్య చౌదరిని ఈ ఎన్నికల్లో ఓడించి తిరిగి అమెరికా పంపించాలి. పోలవరంలో తెల్లబాలరాజు గిరిజనులనే మోసం చేసే అక్రమార్కుడు. అవినీతిపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులుపెట్టిస్తాడు. ఇలాంటి వ్యక్తి గిరిజనులను రక్షించగలడా. మేక వెంకట ప్రతాప్ అప్పారావు నూజీవీడుకు నున్నగా గుండు కొట్టేశాడు. ఏలూరులో ఆళ్ల నాని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సీటిచ్చినా గెలిచే పరిస్థితి లేదు.

కైకలూరులో దూలం నాగేశ్వర్ రావు నియోజకవర్గాన్ని కొడుకుకు అప్పగించి సెంటు పట్టాలో చేయని అవినీతి లేదు. ఐదేళ్లలో 300 కోట్లు అక్రమార్జన చేసిన నాయకుడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి అక్రమార్కులు, వసూల్ రాజాలు మనకు కావాలా?’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE