Suryaa.co.in

Andhra Pradesh

మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదు

చంద్రబాబు పాలనతోనే మైనార్టీల అభివృద్ది, సంక్షేమం
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

మైనార్టీ ద్రోహి జగన్ రెడ్డికి మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత లేదని టీడీపీ నేతలు అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాళలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ….మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి వారిని అన్ని విధాల దగా చేస్తున్నారు.

జగన్ రెడ్డి నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సభలో పచ్చి అబద్దాలు చెప్పారు. సీఎం జగన్ రెడ్డి అబద్దం అనే పదానికి పర్యాయపదంగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాలతో అందరికీ ఇస్తున్న పథకాలను సైతం మైనారిటీ బడ్జెట్‌లో లెక్కించి తిమ్మిని బమ్మిని చేసి గత ప్రభుత్వ పథకాలను తుంగలో తొక్కి వంచిస్తున్నారు. 2019 జూన్ నుండి ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్ల మైనారిటీ నిధులను దారి మళ్లించారు. స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తి పలికి.. ముస్లిం, క్రైస్తవ మైనారిటీ యువత స్వావలంబనకు ముగింపు పలికారు.ఉన్నత విద్య, విదేశీ విద్య మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్ష చేశారు.దుకాన్‌, మకాన్‌ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందించింది.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిని అర్ధాంతరంగా నిలిపేశారు. మైనార్టీల కోసం చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించి దాదాపు 20 పనులు పూర్తైతే జగన్ రెడ్డి దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాపంల్లిలో, నవ్యాంద్రలో రూ.25 కోట్ల వ్యయంతో కడపలో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాం. రూ.80 కోట్లతో విజయవాడలో హజ్ హౌస్ ఏర్పాటుకు చంద్రన్న ప్రభుత్వం పూనుకోగా జగన్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నారు. వైసీపీ పాలనలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయింది, మైనార్టీలపై వేధింపులు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్ ని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించటం లేదు? మీ పదవుల కోసం బానిసలుగా మారి జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని టీడీపీ నేతలు అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ కో ఆర్డినేటర్ గురజాల మాల్యాద్రి, మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముష్తాఖ్ అహ్మద్, అధికార ప్రతినిధి సయ్యద్ రఫి, సంయుక్త కార్యదర్శి ఫతావుల్లా, ఉపాధ్యక్షులు అమానుల్లా, నరసరావుపేట నాయకులు అమీర్ అలీ, గుంటూరు పార్లమెంట్ జనరల్ సెక్రటరి రుస్తుమ్, మైనార్టీ నాయకులు ఎండి ఫిరోజ్, కరీముల్లా, రఫి, బాజీ మాష్టర్, సైదావలి, షేక్ ఖలీల్, సలాం, మహమ్మద్ నూర్, మోసిద్ మహ్మద్, దేవినేని శంకర్ నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE