Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి..దేనికి సిద్దం ఎన్నికలయ్యాక దేశం విడిచి పారిపోవడానికా?

-వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు
-జగన్ రెడ్డి తన ప్రచార సభలకు సిద్దం అనే పేరుకు బదులు పారిపోదాం అని పెట్టుకోవాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

జగన్ రెడ్డి..ఎన్నికలయ్యాక పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్దం చేసుకుంటూ మరో వైపు సిద్దం పేరుతో ప్రచార సభలు నిర్వహించటం హాస్వాస్పదం. జగన్ తన ప్రచార సభలకు సిద్దం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలి. సిద్ధమా….! దేనికి సిద్ధం జగన్ రెడ్డి? చివరిరోజుల్లో మరింత దోచుకోవడానికా? ప్రజాగ్రహం చవిచూడటానికా? ఎన్నికల్లో ఓడిపోవడానికా?

ఓటమి అనంతరం దేశం విడిచి పారిపోవడానికా? బాబాయ్ హత్యకేసులో కారాగారవాసం చేయడానికా? కంట్లో నలుసులా మారిన చెల్లిని హింసించడానికా? గొడ్డలిపోటు పాత్రధారి అవినాశ్ రెడ్డిని అంతం చేయడానికా? అవినీతికేసుల్లో జైలుకెళ్లకుండా హస్తినపెద్దల కాళ్లపై పడటానికా? దేనికి సిద్దం?

వైసీపీ సర్కారును పెకలించేందుకు ఐదు కోట్ల మంది ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు. 5 ఏళ్ల అరాచకాలు, దౌర్జన్యాలు తప్ప ప్రజలకు మీరు ఒరగబెట్టిందేంటి? వైసీపీ దుర్మార్గాలు భరించేలేక ఆ పార్టీ నేతల్ని ప్రజలు తన్ని తరిమేందుకు సిద్దంగా ఉన్నారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమన్నందుకు ఎస్మా చట్టం తెచ్చి వేధిస్తున్న లక్ష మంది అంగన్వాడీలు నిన్ను దించేందుకు సిద్దంగా ఉన్నారు.

వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసినందుకు కోటి మంది రైతులు నీ సీఎం కుర్చీ ఊడబీకేందుకు సిద్దంగా ఉన్నారు. రాజధాని అమరావతికి స్వచ్చందంగా భూమిలిచ్చిన రైతుల్ని 1500 రోజుల నుంచి రోడ్డు మీద పడేసిందుకు నిన్ను దించేందుకు సిద్దంగా ఉన్నారు.

మద్య నిషేదం హామీపై మాట తప్పి నాసిరకం మద్యంతో తాళిబొట్లు తెంచుతున్నందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్దంగా ఉన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పై మోసం చేసినందుకు ఈ రాష్ట్రం నుంచి నిన్ను, నీ పార్టీని తరిమికొట్టేందుకు యువత సిద్దంగా ఉన్నారు.

LEAVE A RESPONSE