Suryaa.co.in

Andhra Pradesh

ఒంటరిగా ఉండడానికి.. వెలివేయడానికి చాలా తేడా ఉంది

-సింహం డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని జగన్ రెడ్డి తెలుసుకోవాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

వెనకటికి ఎవడో.. తల్లిదండ్రుల్ని చంపేసి, జడ్జి ముందు నాకెవరూ లేరు, నాపై జాలి చూపించండి అని దేబురించినట్లుంది జగన్ రెడ్డి ఈ రోజు ప్రసంగం. తల్లిని, చెల్లిని ఇంటి నుండి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్ గా ఉంటానని చెప్పుకోవడం హాస్యాస్పదం. చేసిన పాపాలు… పాల్పడిన దారుణాలు.. వేసిన భారాలు భరించలేక అందరూ నిన్ను దూరం పెడితే సింగిల్ గా మిగిలావు.

ఆ ఒంటరితనం నుండి వచ్చిన ఫ్రష్టేషన్ తో నేను సింహాన్ని, సింగిల్ గా వస్తున్నా అంటూ సినిమా డైలాగులు వాగుతున్నావ్. ఒంటరిగా వస్తానని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి.. వెళ్లి నీ కబుర్లు నీ వాలంటీర్లకు చెప్పుకుని ఒంటరి పురుష పెన్షన్ కు అప్లై చేసుకో. అంతేగానీ ఇలాంటి దిక్కుమాలిన డైలాగులు విని నిన్ను నమ్మేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని తెలుసుకో. ప్రతిపక్షంలో ఉండగా నీవిచ్చిన హామీలు, చేసిన ప్రసంగాలు చూసి ప్రజలు నిజమేనని నమ్మి ఒట్లేసి గెలిపించారు.

నీ చెత్త పాలన, చేవజచ్చిన ప్రసంగాలు చూసి సభలకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు, అధికారులు లేకపోతే సభల్లో ఉండేది ఒక్కడివే. ఆ నిజం తెలిసి కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు. నీవు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. నీ పిచ్చిపై ప్రజలకు క్లారిటీ వచ్చేసి నిన్ను ఒంటరిని చేశారు. నీ పార్టీ నుండి కూడా నేతలంతా బయటికెళ్లి నిన్ను ఒంటరిని చేసేందుకు సిద్ధమయ్యారు. ఇకనైనా ఈ తిక్క డైలాగులు మాని ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ప్రజలకు ఏం చేశావో గుర్తు చేసుకో.

LEAVE A RESPONSE