– ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుతోనే ఆర్ధిక వ్యవస్థకు పూర్వ వైభవం
– యనమల రామకృష్ణుడు
ఆర్ధిక వ్యవస్థను చెక్కబెట్టేందుకు ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనే తెలుగుదేశం సహా దేశంలోని ఆర్ధిక నిపుణుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం, అసలు అవసరమే లేదని ఆర్ధిక మంత్రి చెప్పడం వైసీపీ ప్రభుత్వం ఫిస్కల్ కన్సాలిడేషన్ మరియు బడ్జెట్ మాన్యువల్ ని ఫాలో అవ్వబోమని బహిరంగంగా ప్రకటించడమే. ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని FRBM రివ్యూ కమిటీలోని N .K.సింగ్ సిఫార్సు చేశారు.
దీని వలన ఎప్పటి ఖర్చుల్ని అప్పుడు స్క్రూటినీని ఫిస్కల్ కౌన్సిల్ చూస్తుంది. అదే సమయంలో బడ్జెట్ ని ఫాలో అవుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. చాలా మంది ఎకనామిస్ట్స్ అండ్ ఫైనాన్సియల్ నిపుణులు ఇలాంటి వ్యవస్థ ఉండాలని చెబుతున్నారు.
కాగ్ చేసేది పోస్టుమార్టం. ఖర్చు అయిన తరువాత అభ్యంతరాలు చెప్పడం, తరువాత PAC పరిశీలన చేయడం. ఈ పోస్టుమార్టం జాబ్.. FRBM అండ్ బడ్జెట్ మానుల్ ఉల్లంఘనలను ఆపలేదు. ఫైనాన్స్ కమిషన్ ఓన్లీ రెవెన్యూ ఎస్టిమేషన్ మరియు డిస్ట్రిబ్యూషన్స్ కేంద్ర రాష్టాల మధ్య తప్ప తదుపరి చర్యలు రాజ్యాంగపరంగా ఏమి ఉండవని ప్రభుత్వానికి తెలియదా?
రాష్ట్ర ఆర్ధిక నిర్వహణ మెరుగ్గా ఉందని మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పడం నిజాలను దాయాలని ప్రయత్నించడం మాత్రమే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డెఫిసిట్స్ ,అప్పులు ఎంత పెరిగాయో లెక్కలేదు.
ఎకానమీ ఎంత దిగజారిపోయినదో ప్రభుత్వ లెక్కతో తేటతెల్లమవుతోంది. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ (10.22%) ఉంటే ప్రస్తుతం జగన్ రెడ్డి పాలనలో -2 .58శాతానికి పడిపోయింది. ఇది చాలదా జగన్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ఎంతలా పతనం చేశారో చెప్పడానికి.?
సంక్షేమ పథకాల అమలులో ఆంద్రప్రదేశ్ చాలా బాగుందని చెప్పడం, లేనిదీ చాటుకోవడానికి తప్ప మరో ప్రయోజనం లేదు. సంక్షేమ పథకాలు అంత బాగుంటే నేరుగా నగదు బదిలీ చేసే పథకాల జాబితాలో(DBT పథకాలు) ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఎందుకు ఉన్నట్లు.? ఆర్ధిక అసమానతలు 34 % నుండి 43 శాతానికి ఎందుకు పెరిగాయి.? క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ 2018-19లో రూ.19,976 కోట్లు ఉంటే… ప్రస్తుతం(2020-21 నాటికి రూ.14,000 కోట్లకు ఎందుకు పడిపోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఆదాయం, అప్పులు పెరిగినప్పటికీ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ ఎందుకు పెరగకపోగా తగ్గిందో స్పష్టం చేయాలా రెవిన్యూ ఎక్స్ పెండిచర్ ఎందుకు అదుపులేకుండా పోయింది ? ఎకానమీ డబల్ డిజిట్ నుండి నెగటివ్ గ్రోత్ కి దిగజారింది. తలసరి ఆదాయం సింగల్ డిజిట్ కి పడిపోయింది. 2020-21 లో 2018-19 తో పోలిస్తే రెవిన్యూ ఆదాయం పెరిగిన మాట వాస్తవం కాదా ? ధరలు విపరీతంగా పెరగడం వలన సమాన్యుని కొనుగోలుశక్తి క్షీణించడం వాస్తవం కాదా.? ఆర్ధిక మంత్రి నేరుగా డీబీటీ పథకాల ద్వారా ప్రజలకు రూ.1.20లక్షల కోట్లు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదం. టీడీపీ హాయంతో పోలిస్తే.. ప్రస్తుతం అమలు చేస్తున్న నగదు బదిలీ అంతంత మాత్రమే.
పెరిగిన ధరలను, ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ పంపిణీ ఎంత మాత్రమో ప్రభుత్వ పెద్దలు వివరించాలి. డీబీటీ క్రింద అమలయ్యే ఎన్ని పథకాలు రద్దు చేశారో చెప్పాలి? ఎంత మంది పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేశారో, ఎంత నష్టం చేశారో వివరించడానికి మేం సిద్ధం.ఆర్ధిక అస్థవ్యస్థ విధానాలతో రెవెన్యూ పడిపోతున్న విషయం ప్రభుత్వానికి తెలియదా.? అయినప్పటికీ టీడీపీ హయాంతో (2016 నుండి 2019 )తో పోలిస్తే వైసీపీ పాలనలో రెవెన్యూ 12.6 % పెరగడం వాస్తవం కాదా.?
టీడీపీ మూడు సంవత్సరాల రెవెన్యూ రెవెన్యూ వసూళ్లు రూ.3,18,716 కోట్లు
వైసీపీ మూడు సంవత్సరాల రెవెన్యూ వసూళ్లు రూ.3,58,837 కోట్ల
పెరిగిన మొత్తం రూ.40,121 కోట్లు (12.6 %)
మూడు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ అప్పులు రూ.3,71,756 కోట్లు
మూడు సంవత్సరాల రెవెన్యూ వసూళ్లు, అప్ప్లు కలిపి రూ.7,30,593 కోట్లు
ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన సొమ్ము మొత్తం ఏమైనట్లు.?
ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే.. FRBN నిబంధనల్ని ఉల్లంఘించనట్లు స్పష్టంగా తెలుస్తోంది. బడ్జెట్ మాన్యువల్స్, బడ్జెట్ కేటాయింపులు పరిశీలించాక.. ఆ ఆదాయం మొత్తం దుబారా, దోపిడీ జరిగిందని తేటతెల్లమవుతోంది. అందుకే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఆర్ధిక రంగ నిపుణులతో ప్రభుత్వమే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.