Home » మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి

మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి

– తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత
– నారీ సంకల్ప దీక్ష

మహిళా ద్రోహి జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలి అనే లక్ష్యంతో అధినేత చంద్రబాబు ఆదేశాలతో నారీ సంకల్ప దీక్ష చేపట్టాము. రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు చేస్తే చూస్తు ఊరుకోబోము. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ధైర్యంగా గుండెలపై చేయి వేసుకొని నిద్రపోలేసి దుస్థితి. చేతకాని, దద్దమ్మ, సైకో ముఖ్యమంత్రి పాలన వల్లే ఇన్ని ఇబ్బందులు. ఉదయం లేవగానే ఏ వార్త వినాల్సి

వస్తోందనే భయంతో అందరూ మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రతి మహిళ బయటకొచ్చి హక్కుల కోసం పోరాటం చేయాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. అవినీతి జగన్ పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో దీక్షకు వచ్చిన ప్రతిమహిళకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాతో పాటు స్టేట్ కమిటీలో ఉన్న వారిలో సుమారు 100మంది వరకూ దీక్షలో పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి మహిళలకు అండగా నిలబడతాడేమోనని రెండున్నరేళ్లుగా వేచి చూశాం. ఉపయోగం లేకుండా పోయింది. అందుకే సమర భేరి మోగించాం. పాదయాత్ర సమయంలో మహిళలకు ముద్దులు పెడుతూ తల నిమిరాడు. ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. మన ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేదం చేస్తాను, అక్కచెల్లెమ్మల కళ్లలో ఆనందం చూస్తానని నమ్మబలికాడు.

తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు. మడమ తిప్పాడు. కరెంటు షాకు కొట్టేలా ధరలు ఉండాలని లిక్కర్ రేట్లు పెంచానన్నాడు. అన్నీ అబద్ధాలే. తన జేబులు, బినామీల జేబులు నింపుకుంటున్నాడు. నాశిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నాడు. ఇంటిని, వంటిని, రాష్ట్రన్ని గుల్ల చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా?

కరోనా విపత్తులో మద్యం షాపులు ఓపెన్ చేసింది దేశం మొత్తంలో జగన్ రెడ్డే. మద్యం షాపుల దగ్గర చదువులు చెప్పే టీచర్లను కాపలాపెట్టాడు. నకిలీ బ్రాండ్లు తాగుతున్న వైసీపీ నేతలు పిచ్చి వాగుడు వాగుతున్నారు. వైసీపీ నేతల తీరు, వారు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకుంటే అధికారంలో ఉండీ నిందితుణ్ణి శిక్షించకపోగా మంత్రులు మొదలు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తారా? ఆడబిడ్డ జీవితాన్ని కూడా రాజకీయం చేయడానికి సిగ్గుందా? రెండున్నరేళ్లలో 1500కు పైగా అత్యాచార ఘటనలు నమోదైతే ఏం చేశారు చర్యలు తీసుకోకుండా?

ప్రతిరోజూ ఒక ఆడబిడ్డపై అత్యాచారమో, లైంగిక దాడో జరిగింది. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న సుచరిత గారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మహిళకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకు వచ్చి మాట్లాడలేని దుస్థితిలో హోంమంత్రి, మహిళా కమిషన్, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు-జగనన్న అని కొట్టుకుంటోంది అని ఓ మహిళా ఎమ్మెల్యే అన్నారు. ఏమ్మా.. రాష్ట్రంలో అన్యాయమైపోతున్న ఆడబిడ్డలు, కన్నపేగును పోగుట్టుకున్న తల్లుల గర్భశోకం నీకు వినిపించడం లేదా? అమరావతి మహిళా రైతులను కాళ్ల బూట్లతో పోలీసులు తన్నితే ఆ ఎమ్మెల్యే గుండె జగన్ జగన్ అనే కొట్టుకుంది.

గన్ కంటే జగన్ ముందువస్తాడన్నారు. మరి ఆ గన్నుకు తుప్పుపట్టిపోయిందా? విజయవాడ లో బాలిక ఆత్మహత్య చేసుకుంటే రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు బయటకు వచ్చారు. నరసరావుపేటలో అనూష, విజయవాడలో తేజస్విని, పులివెందులలో నాగమ్మ, విశాఖలో లక్ష్మి, అనంతపురంలో స్నేహలత ఇలా ఎందరో ఆడబిడ్డలు చనిపోయినప్పుడు వెలగని కొవ్వుత్తు ఇవాళ వెలిగిందా? మరి రెండున్నరేళ్లుగా జరిగిన అత్యాచార ఘటనలపై ఎందుకు స్పందించలేదు? వైసీపీ పేటీఎమ్ కుక్కలు మొరుగుతున్నారు. నిండుసభలో చంద్రబాబుగారి సతీమణిపైనే దిగజారి మాట్డిన కాలకేయులు వైసీపీ నేతలు, మంత్రులు ఎవరినీ వదలరు. మన గురించీ నీచంగా మాట్లాతారు. అయితే మనం భయపడకుండా ఇలాంటి ఇడియట్స్ ని ఉక్కు సంకల్పంతో కాళ్ల కింద చెప్పుల్లా నలిపేయాలి.

నిత్యావసరాల ధరలు ఎంత పెంచేశారో చూస్తున్నాం. పచారీ కొట్టుకు వెళితే రూ. 500 క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. ఒక బిడ్డ అడిగిన ఇష్టమైన వంటకం కూడా వండలేని పరిస్థితులు తల్లులకు కల్పించారు. ధరలు తగ్గించాలని, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను అరికట్టాలని, మద్యపాన నిషేదం అమలు చేయాలని మేము దీక్ష చేస్తున్నాం. చంద్రబాబు గారు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. ఆడవాళ్లకు ఆర్థిక స్వావలంబన అవసరం లేదనే రీతిన తుగ్లక్ సీఎం వ్యవహరిస్తున్నాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకున్నట్టే ఉంది జగన్ రెడ్డి తీరు. డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును కాజేస్తున్నాడు.

ఇంతకుముందు రూ. 50,000 ఉంటే రూ. 5 లక్షల లోన్ వచ్చేది. ఇప్పుడు గ్రూప్ తరపున రూ. 2 లక్షలు ఉంటేనే రూ. 5 లక్షల లోన్ ఇవ్వడానికి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారు. చంద్రబాబుగారు డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి గురించే ఆలోచించారు. దశాబ్ధాలుగా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్మును తీసుకోవాలన్నా కూడా పర్మిషన్లు తీసుకోవాలాట. ఎంతటి దౌర్భాగ్యమో చూడండి. దానిమీద చేస్తున్నాం దీక్ష.

ఓటీఎస్ అంట. వన్ టైమ్ సీఎం ఆర్డర్ వేయగానే వన్ టైం సెటిల్ మెంట్ అంటున్నారు. ఎప్పుడో ఎవరో కట్టిన ఇళ్లకు ఇతగాడు రిజిస్ట్రేషన్ చేయడమేంటి? రూ. 10,000 వసూలు చేయడమేంటి? వసూల్ రాజా దేనిమీదైనా పన్ను వేస్తాడు. మనం బయట పడేసిన చెత్తమీద పన్ను వేశాడు. బాత్రూమ్ మీద , ఇంటి మీద, ఎప్పుడో కట్టిన ఇంటికీ వసూల్ రాజా పన్నులు వేస్తాడు. ఎందుకు కట్టాలి పన్ను. నీ తాత సొమ్మేమైనా ఇచ్చావా? అభయహస్తం కింద ఉన్న 2 వేల కోట్ల రూపాయిలను దోచేశాడు. మనం దాచుకున్న కష్టాన్ని దోచేసేవాడిని దొంగ అనాలా వద్దా? మహిళలు ఆలోచన చేయాలి.

వైసీపీ పాలనలో ఆడబిడ్డపై అఘాయిత్యాలు కామన్ అయిపోయాయి. క్యాసినో కల్చర్ తీసుకొచ్చి మహిళలతో అర్ధనగ్న ప్రదర్శలు చేయిస్తూ అంగటి బొమ్మగా మార్చేశారు. వైసీపీ నేతలకు సిగ్గుందా? వీళ్లు ఆడవాళ్లకు పుట్టిన వాళ్లేనా? మహిళలతో వ్యాపారం చేస్తున్నారంటే వైసీపీ నేతలు మనుషులా, పశువులా, కాలకేయులా అనేది ప్రజానీకమే తేల్చుకోవాలి. కిరోసిన్ పోసుకుంటానని మంత్రి అంటాడా? రా బయటకు రా…మా ఆడవాళ్లు వచ్చారంటే బూడిద కూడా మిగలదు. పెట్టుకోండి కేసులు.తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్న రోజే భయం పోయింది. ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడే భయం పోయింది. మా వెనుక చంద్రబాబు గారు అనే శక్తి ఉంది.

ఆడబిడ్డలకు గౌరవం ఇవ్వడంలో, ఆడబిడ్డలను అక్కున చేర్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎంత ముందు ఉంటుందో ఇక్కడ పనిచేసి వెళ్లిన వారికి కూడా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్లి ఎమ్మెల్యేలు అయినవారికి అక్కడ కుర్చీ కూడా లేదు. అదే మా చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో తెలుసా..ఏమ్మా అనితమ్మా అని మాట్లాడతారు. మాకు గౌరవం ఇచ్చి ఆయన గౌరవం పొందుతున్నారు. జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని ఏం చేశాడో చూశాం. తల్లినీ, చెల్లినీ గౌరవించలేని వాడు ఎవరిని గౌరవిస్తాడు. తుగ్లక్ రెడ్డి పాలనకు ఎంత త్వరగా చరమగీతం పాడితే అంత మంచిది.

నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుందేమో వైసీపీ నేతలు చెప్పగలరా? మన రాష్ట్ర భవిష్యత్, మన ఆడబిడ్డ , భవిష్యత్, భరోసా కోసమే మేము సంకల్ప దీక్ష చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ సంకల్ప దీక్షకు మద్దతు తెలపాలి.

Leave a Reply